poojas
-
ఐశ్వర్య ప్రదాయిని.. వరలక్ష్మీ
సందర్భం– నేడు వరలక్ష్మీ వ్రతం అనంతపురం కల్చరల్ : శ్రావణం దేవతలకు ఇష్టమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి. ముత్తైదువలు దీర్ఘ సుమంగళీతనం కోసం భర్తతో కలిసి ఆచరించే వరమమాలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాముఖ్యత ఉంది. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి మొదట వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఎనిమిది విధాల సకల సౌభాగ్యాలనిచ్చే అష్టలక్ష్ములకు మహిళలు పూజిస్తారు. జిల్లాలోని వివిధ ఆలయాలతో పాటు నగరంలోని స్థానిక పాతూరులో వెలసిన ఏకైక మహాలక్ష్మీ ఆలయంలో వ్రత వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండెక్కిన పూల ధరలు వరలక్ష్మి వ్రతం సందర్భంగా గురువారం సాయంత్రం నుండే నగరంలోని పలు చోట్ల మామిడాకులు, పళ్లు, పూల దుకాణాలు కిటకిటలాడాయి. అన్ని రకాల పూల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒక కేజీ కనకాంబరాలు రూ.150, గులాబీలు రూ.300, మల్లెలు రూ. 130 కాగా చామంతి పూలు రూ. 400 పలుకుతున్నా ప్రజలు పెద్ద ఎత్తున కొంటున్నారు. వరలక్ష్మీ విధానం ఇలా ఆచరిద్దాం.. సాధారణంగా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఆ రోజున వీలు కాకపోతే శ్రావణంలో వచ్చే ఏ శుక్రవారమైనా దీనిని ఆచరించుకోవచ్చు. - వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే వారు ఆరోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. - పూజా మందిరంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసుకుని దానిపై బియ్యపు పిండితో ముగ్గు వేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. - పసుపు రాసుకున్న తెల్లటి దారాలను ఐదు లేదా తొమ్మిదిపోగులు తీసుకుని తోరాలుగా చేసుకున్న వాటిని చేతికి కట్టుకోవాలి. - తొలుత గణపతి పూజలతో ప్రారంభించి అమ్మవారిని అష్టోత్తర నామాలకు అనుగుణంగా పూజించాలి. - పాలు, పండ్లు, గంధం, వివిధ రకాల పూలను అమ్మవారికి సమర్పించాలి. - దీపారాధనలో అమ్మవారి ప్రతిరూపంగా ఉంటుందని కనుక మహా మంగళహారతి ఇవ్వాలి. - వ్రత కథలను శ్రద్ధగా విన్న తర్వాత ఐదు మంది ముత్తైదువులను పిలిచి చందన తాంబూలిస్తే ఆ ఇంట సిరులొలుకుతాయని అందరి విశ్వాసం. సకల ఐశ్యర్యాలు కలుగుతాయి సహజంగా మహిళలకు పుట్టింటిపై మమకారం ఉంటుంది. ఇదే విషయాన్ని వరలక్ష్మి వ్రతం ప్రతిబింభిస్తుంది. ఈ వ్రతం నిష్టగా జరుపుకునే వారికి పుట్టినింటిలో, మెట్టినింటిలో అపూర్వ ఆదరణ, ఆప్యాయతలు, సకల ఐశ్యర్యాలు కలుగుతాయని అందరి నమ్మకం. –రమాదేవి, గృహిణి, అనంతపురం -
వరుణదేవా.. కరుణించు !
రాయదుర్గం టౌన్ : వరుణుడి కరుణం కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. వరుణదేవా...కరుణించవయ్యా అంటూ పూజలు చేస్తున్నారు. రాయదుర్గం పట్టణంలోని సిద్దేశ్వర , బైలాంజనేయస్వామి కాలనీవాసులు వర్షం కోసం శుక్రవారం 28వ వార్డులోని పురాతన పాలబావిలో పూజలు, ఊరువాకిలి, బళ్లారి రోడ్లలోని బొడ్రాయికి పూజలు నిర్వహించారు. శాంతినగర్‌లోని బైలాంజనేయస్వామి గుడి వద్ద నుంచి మల్లికార్జున, మారెప్ప ఆధ్వర్యంలో యువతీయువకులు కలశాలతో పాలబావి వద్ద పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి బొడ్రాయి వద్దకు చేరుకుని 101 బిందెల నీరు పోసి అభిషేకం, 101 టెంకాయలు సమర్పించి వర్షాలు కురిసి ప్రజల్లో సుఖసంతోషాలు నింపాలని ప్రార్థించారు. వర్షాలు లేక తాగునీరు, సాగునీటితో పాటు పశుపక్షాదులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి తలెత్తిందని, వర్షాభావం నుంచి గట్టెక్కించాలని పూజలు చేశారు. -
కుటుంబ కథా చిత్రాలకే ప్రాధాన్యం
∙‘శతమానం భవతి’ డైరెక్టర్ సతీష్ రాజు ∙ఆత్రేయపురం వెంకన్నకు పూజలు ఆత్రేయపురం: (కొత్తపేట) : కుటుంబ కథా చిత్రాలకే అధిక ప్రాధాన్యమి స్తానని శతమానం భవతి సినిమా డైరెక్టర్ వేగేశ్న సతీష్‌రాజు అన్నారు. మంగళవారం ఆయన ఆత్రేయపురం శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లమ్మ, కనక మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాల్లో కుంకుమ పూజలు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ 45 చిత్రాలకు కథ, మాటలు రాసి, స్క్రీ¯ŒS ప్లే చిత్రీకరించడంతో పాటు డైరెక్టర్‌గా శతమానం భవతి మంచి హిట్‌ను అందించడంతో సతీష్రాజును క్షత్రియ యూత్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్రేయపురంతో ఎంతో ఆత్మీయబంధం ఉందన్నారు. అందుకే శతమానం భవతి సినిమాలో ఆత్రేయపురం పేరుతో సినిమా రూపొందించడం సెంట్‌మెంట్‌గా భావిస్తున్నానని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఓడూరు తన స్వగ్రామమని, అందుకే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ కథా చిత్రాలపై దృష్టి సారించానని తెలిపారు. ప్రస్తుతం దిల్‌రాజ్ నిర్మాణంలో ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేపడుతున్నామని తెలిపారు. ఆలయంలో ఘన స్వాగతం.. శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చిన సతీష్ రాజుకు నిర్మాత పాతపాటి సత్యనారాయణరాజు (రమణరాజు) ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. వేదపండితులు ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయంలో స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వామి వారి ఫొటోను ఆలయ నిర్మాత రమణరాజు ఆయనకు అందజేశారు. అనంతరం గ్రామంలో ‘వేగేశ్న’ వారి ఇంట్లో భోజనం చేసి, బంధుమిత్రులతో కాలక్షేపం చేశారు. సతీష్ రాకతో ఆయన అభిమానులు తరలివచ్చి ఆటోగ్రాఫ్‌ల కోసం పోటీపడ్డారు. విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు అయినవిల్లి : విఘ్నేశ్వరస్వామి ఆలయంలో వేగేశ్న సతీష్ మంగళవారం పూజలు చేశారు. ఆయనకు ఆలయ ప్రధానార్చకుడు సూరిబాబు, చైర్మ¯ŒS సుబ్బరాజు స్వాగతం పలికారు. స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. -
సిద్ధేశ్వరస్వామి ఆలయంలో డీఐజీ పూజలు
అమరాపురం : మండలంలో వెలసిన హేమావతి సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని డీఐజీ ప్రభాకర్‌రావు శనివారం సందర్శించారు. అర్చకులు, సర్పంచు సదాశివ, గ్రామపెద్దలు ప్రకాష్, కుమారస్వామి తదితరులు డీఐజీకి స్వాగతం పలికారు. అనంతరం మానవాకారంలో ఉన్న సిద్ధేశ్వరస్వామికి ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం కాలభైరవేశ్వరస్వామి, దొడ్డేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు చేయించారు. ఆలయ విశిష్టతను అర్చకులు డీఐజీకి వివరించారు. పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు, మడకశిర సీఐ దేవానంద్, ఎస్ఐ వెంకటస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. -
‘బాబు’కు మంచి బుద్ధి ప్రసాదించుస్వామీ
ఆలయాల్లో ‘కాపు’వర్గీయుల పూజలు సాక్షిప్రతినిధి, కాకినాడ : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా మంగళవారం జిల్లాలో కాపు సామాజికవర్గీయులు ఆలయాల్లో పూజలు, అభిషేకాలు చేసి వినతిపత్రాలు అందచేశారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ ఆధ్వర్యంలో పలు దశల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ది ప్రసాదించాలంటూ వారు ప్రార్థించారు. కాకినాడలోని భానుగుడి జంక్ష¯ŒS సమీపాన ఉన్న భానులింగేశ్వరస్వామి దేవాలయంలో కాపు జేఏసీ నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసు, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు ఫ్రూటీకుమార్, కాపు సద్భావనా సంఘం నాయకుడు బసవా ప్రభాకరరావు తదితరులు దేవుడికి వినతిపత్రం అందచేశారు. అమలాపురంలో రాష్ట్ర కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, కాపు జేఏసీ నాయకులు నల్లా పవన్, మిండగుదిటి మోహన్, కలవకొలను తాతాజీ తదితరులు వెంకటేశ్వరస్వామి ఆలయం, గడియారస్తంభం సెంటర్లో లక్షీ్మగణపతి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. రావులపాలెం కళావెంకట్రావు సెంటర్లో భక్తాంజనేయస్వామి ఆలయం వద్ద జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామికి పూజలు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు దోసాలమ్మ ఆలయంలో రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ అయ్యప్పస్వామి ఆలయంలో చంద్రబాబుకు జ్ఞాపకశక్తి ప్రసాదించాలని నగర కాపు సంఘ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు కొబ్బరికాయ కొట్టి దేవుని ప్రార్థించారు. కాపు నాయకులు నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కడియంలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. -
వైకుంఠ ద్వార దర్శనం.. ముక్తికి మార్గం
వెదురుపాక(రాయవరం) : వైకుంఠ ద్వార దర్శనం ముక్తి కి మార్గమని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆదివారం భక్తులనుద్దేశించి గాడ్ మాట్లాడుతూ శ్రీవైష్ణవ క్షేత్రాల్లో దేవతల కాల ప్రమాణాలను బట్టి ఏడాదిలో రెండు భాగాలైన దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయనం పగలుగా ఉంటాయన్నారు. ఈ మకర సంక్రమణ ఉత్తరాయన ప్రవేశానికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకొంటారన్నారు. ముక్కోటి ఏకాదశుల పుణ్యఫలం ఒక్క రోజున లభించేలా చేసేదే ముక్కోటి ఏకాదశిగా అన్నారు. ఈ పర్వదినాన వైష్ణవాలయాల్లో శ్రీవారు ఉత్తర ద్వార దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీదేవి, భూదేవి సమేత విజయ వేంకటేశ్వరస్వామి వారికి పీఠబ్రహ్మ కోట వీరవెంకటసత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి) ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. -
నమోస్తుతే..
-
గంగమ్మకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పూజలు
శామీర్‌పేట్: మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా నిండితున్న చెరువులు, కుంటలను పరిశీలించేందుకు ఆదివారం మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా శామీర్‌పేట్ పెద్ద చెరువు వద్ద తూమును పరిశీలించారు. సగానికి చేరుకున్న శామీర్‌పేట్ పెద్ద చెరువులో నీటిని పరిశీలించిన ఆయన మండలంలోని వర్షాల వల్ల ఎన్ని చెరువులు నిండాయి.. వాటి వివరాలు వరద నీటితో వస్తున్న సమస్యలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవరయాంజాల్‌లోని చెన్నరాయుడుచెరువు అలుగులను సందర్శించి గంగమ్మకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్, శామీర్‌పేట్, దేవరయాంజాల్ సర్పంచులు బత్తుల కిశోర్‌యాదవ్, శ్రీనివాస్‌ముదిరాజ్, మాజీ ఎంపీపీ నాలిక యాదగిరి, ఉప సర్పంచ్ నర్సింగ్, వార్డుసభ్యులు ప్రకాశ్, మహేశ్, రాజు, వీరారెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చెరువులకు పూజలు
శామీర్‌పేట్: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిండిన చెరువుల వద్ద మండలంలోని ప్రజాప్రతినిధులు శనివారం గంగమ్మ పూజలు నిర్వహించారు. శామీర్‌పేట్ కట్టమైసమ్మ దేవాలయం వద్ద అమ్మవారికి జెడ్పీటీసీ బాలేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింహ, ఐలయ్య, భూమయ్య, రవి పాల్గొన్నారు. అలియాబాద్ శ్రీరామాలయం వద్ద పొంగిపొర్లుతున్న వాగులో సర్పంచ్ గాదేగౌరికుమారి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ హృదయ్‌కుమార్, వార్డుసభ్యులు పాల్గొన్నారు. -
33వ రోజూ ఆందోళనల హోరు
ఏలూరు, న్యూస్‌లైన్ :జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం అవిశ్రాంతంగా కొనసాగుతోంది. సెలవులు, పండుగలు, ఇతర వ్యాపకాలేమీ లేకుండా అన్నివర్గాల ప్రజలు లక్ష్యసాధనలో మమేకం అవుతున్నారు. ఉద్యమస్ఫూర్తి ఎక్కడా తొణక్కుండా ఎన్జీవోలు, సమైక్యవాదులు కార్యాచరణలతో ముందుకుసాగుతున్నారు. 33వ రోజైన ఆదివారం జిల్లా వ్యాప్తంగా వినూత్న నిరసనలతో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు అలుపెరగకుండా ఉద్యమాన్ని కొనసాగించాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో ఏడో రోజు రిలే నిరాహార దీక్షల్లో రెవెన్యూ, ఆర్టీసీ, నీటిపారుదల శాఖ, రిటైర్డు ఉద్యోగులు కూర్చున్నారు. ఈ దీక్షలకు మద్దతు పలికిన చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ సమైక్యత అంటూనే ప్రజలను మోసగించడం ప్రజాప్రతినిధులకే చెల్లుతోందన్నారు. ఈ విధానాలకు స్వస్తి పలకకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఏలూరు రైల్వే స్టేషన్ నుంచి పాత బస్టాండ్ వరకు రైల్వే సీజనల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో, ఫోర్‌మెన్ వర్కర్స్ యానియన్ ఆధ్వర్యంలో నగరంలో మోటార్ సెకిళ్ళ ర్యాలీలు నిర్వహించారు. భీమవరం ప్రకాశంచౌక్ వద్ద విద్యార్థులు జాతీయ రహదారిని దిగ్బంధించి మానవహారంగా ఏర్పడ్డారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో జేఏసీ నాయకులు ముచ్చర్ల సంజయ్ నేతృత్వంలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ సెంటర్లో నిరవధిక నిరహార దీక్ష చేస్తున్న గెడ్డం బాబు, మాఘం వెంకటసుబ్బారావుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆచంటలో జేఏసీ ఆధ్వర్యంలో జరగుతున్న దీక్షలో నియోజకవర్గ పాత్రికేయులు పాల్గొన్నారు. పెనుగొండలో తాపీ పనివారు సోనియా, కేసీఆర్‌లకు సమాధులు కట్టి నిరసన తెలిపారు. యలమంచిలి మండలంలో ఉపాధ్యాయులు చేపట్టిన బైక్ ర్యాలీకి ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైఎస్సార్సీపీ నాయకుడు గుణ్ణం నాగబాబు స్వాగతం పలికారు. చించినాడ, దొడ్డిపట్లలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర కోరుతూ మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో ఉండి సెంటర్లో టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. పెదఅమిరం ఏసుక్రీస్తు సహవాస సంఘ చర్చి ఆధ్వర్యంలో 500 మంది విశ్వాసులు ర్యాలీ, రాస్తారాకో, మానవహార ం చేశారు. ఈ నిరసనలో పాతపాటి సర్రాజు, ఎమ్మెల్యే శివ పాల్గొన్నారు. ఆకివీడులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారాకో చేశారు. జంగారెడ్డిగూడెంలో వాక ర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ చేపట్టారు. కామవరపుకోటలో రోడ్‌పై జేఏసీ సభ్యులు క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. చింతలపూడిలో కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు, స్థానిక మార్కెట్ కమిటీ వద్ద నుంచి ఫైర్‌స్టేషన్ వరకు ర్యాలీ సాగింది. గోపాలపురంలో ఉపాధ్యాయులు 48 గంటల నిరవధిక నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. గోపాలపురం, నల్లజర్లలో టీడీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.