
సాక్షి, వరంగల్: వనభోజనానికి వచ్చిన కుటుంబాల్లో విషాదచాయాలు అలుముకున్నాయి. వనభోజనానికి వచ్చిన ఆరుగురు బాలురు బుధవారం గ్రామానికి సమీపంలోని కుంటలో ఈతకు దిగారు. ప్రమాదవశాత్తూ వారు మునిగి చనిపోయారు. ఈ సంఘటన జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కొత్తపేటలో చోటుచేసుకుంది.
ఈతకు దిగిన వారిలో నలుగురి మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన బాలురు నదీమ్ షా(16), మొమిన్(14), రసూల్(13), రంజాన్(16)లుగా గుర్తించారు. వీరి మరణంతో ఆ గ్రామం కన్నీటి సుడుల్లో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరిని కలిచి వేసింది
Comments
Please login to add a commentAdd a comment