వరంగల్: వరంగల్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు వరదతో ఏకమై ప్రవహిస్తున్నాయి. కురవి మండలం గుండ్రాతి మడుగు గ్రామ సమీపంలోని పెద్దతండా వద్ద మున్నేరువాగు పొంగి ప్రవహిస్తోంది. అలాగే, మంగపేట మండలం రాజుపేట ముసలమ్మవాగు ఉప్పొంగటంతో గ్రామంలోని నలబై ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. వరద తీవ్రత ఇంకా పెరుగుతోంది. అలాగే, భూపాలపల్లి- పరకాల మార్గంలో వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి.