Mulug Assembly Constituency
-
రసవత్తరంగా ములుగు రాజకీయం!
నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్న మహిళ దళ నేత ములుగు ఎమ్మెల్యే( సీతక్క)కావడం గనార్హం. తిరుగులేని నాయకురాలుగా నాడు టీడీపీ నేడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజల ఆదారాభిమానాలు చూరగొన్న వ్యక్తి సీతక్క. మావోయిస్టు కుటుంబం నేపథ్యం ఉన్న జడ్పీ చైర్ పర్సన్ బడా నాగజ్యతికి బీఆర్ఎస్ నుండి టికెట్ దక్కంది. దాంతో ములుగు రాజకీయాలు వేడెక్కాయి. అక్కడ పోటీ హోరాహోరీగా రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే సీతక్క, బడా నాగజ్యోతీలు నువ్వా-నేనా అన్నట్టుగా బరిలోకి దిగనున్నారు. దాంతో ములుగు రాజకీయం ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : పోడు భూముల అంశం, తలాపునే గోదావరి ఉన్నా త్రాగు సాగు నీటి సమస్య ఎదుర్కోవడం. ఆదివాసి గిరిజన గూడాలకు ఇప్పటికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడం. గోదారి పరివాహక ముంపు ప్రాంతానికి కరకట్ట నిర్మాణం చేయకపోవడం. ఏటూరునాగారం డివిజన్ కేంద్రం, మల్లంపల్లి మండలం చేయాలనే డిమాండ్. నియోజకవర్గం గురించి ఆసక్తికర అంశాలు : మారుమూల ఏజన్సీ ఆటవీ ప్రాంతం. నక్సల్స్ ప్రభావితం గల నియోజకవర్గం, పర్యాటక ప్రాంతం. ఆసియాలోని అతి పెద్ద గిరిజన జాతర మేడారం ప్రధాన పార్టీల అభ్యర్థులు: కాంగ్రెస్ సీతక్క (సిట్టింగ్ ఎమ్మెల్యే) బీఆర్ఎస్ బడే నాగజ్యోతి (కన్ఫాం) బీజేపీ తాటి కృష్ణ (ఆశావాహులు) భూక్య జవహార్ లాల్ రాజు నాయక్ (ఆశావాహులు) వృత్తిపరంగా ఓటర్లు : వ్యవసాయంపై ఆదారపడ్డ ఆదివాసిగిరిజన ఓటర్లు ఎక్కువ మతం/కులం పరంగా ఓటర్లు : ఎస్టీ లంబాడా ఓటర్లు 34400 ఎస్టీ కోయ నాయకపోడు ఎరుకల గుత్తి కోయ 48250 ఓసి బిసి కలిపి మొత్తం ఓటర్లు 125525 నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు : ములుగు నియోజకవర్గం పూర్తిగా ఏజన్సీ ప్రాంత.. గోదావరి నది తీరంలో ఉంటుంది. నక్సల్స్ ప్రభావిత ఏరియా, తెలంగాణ రాష్ట్రంలోనే 80 శాతం అడవులు ఉన్న నియోజకవర్గం. మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలు కొలువైన ప్రాంతం. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ఉంది. మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వైష్ణవాలయం , పర్యాటక కేంద్రాలు లక్నవరం సరస్సు .రామప్ప సరస్సు రామప్ప దేవాలయం. -
ములుగు (ఎస్టి) నియోజకవర్గం గెలిచిన అభ్యర్థులు వీరే...
ములుగు (ఎస్టి) నియోజకవర్గం ములుగు గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన దళవాయి అనసూయ ఉరఫ్ సీతక్క రెండోసారి గెలిచారు. 2009లో ఆమె టిడిపి పక్షాన ఒకసారి గెలవగా, 2018లో కాంగ్రెస్ ఐలో చేరి విజయం సాదించారు. అనసూయ తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది, అప్పటి మంత్రి ఎ.చందూలాల్ పై 22671 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. సీతక్కకు 88971 ఓట్లు రాగా, చందూలాల్‌కు 66300 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన బి.లక్ష్మీనారాయణకు సుమారు 3500 ఓట్లు వచ్చాయి. 2014లో ములుగు నుంచి టిఆర్ఎస్ పక్షాన చందూలాల్ గెలిచారు. ఆయన మూడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో ఆయన టిడిపి నేతగా ఉండేవారు. 2014లో ఇక్కడ తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యను 16399 మెజార్టీతో ఓడిరచారు. అప్పట్లో సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టిడిపి నేత దళవాయి అనసూయ(సీతక్క) మూడోస్థానానికి పరిమితం అయ్యారు. అయితే ఆమె 2018లో కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. కాగా కాంగ్రెస్ ఐ మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్య భద్రాచలానికి మారి మూడోసారి విజయం సాదించడం విశేషం. ములుగులో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి పిడిఎఫ్ రెండుసార్లు గెలిచాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. ఇక్కడ మూడుసార్లు గెలిచిన జగన్నాయక్ మంత్రి పదవి కూడా నిర్వహించారు. అజ్మీరా చందూలాల్ ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిచి కొంత కాలం ఎన్.టిఆర్ క్యాబినెట్లో ఉన్నారు. తదుపరి 2014 ఎన్నికలలో గెలిచిన తర్వాత కెసిఆర్ క్యాబినెట్లో ఉన్నారు. రెండుసార్లు టిడిపి తరుపున లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. 2009లో ఆయన టిఆర్ఎస్ పక్షాన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. తిరిగి 2014లో ములుగులో మూడోసారి గెలుపొందారు. 2009లో గెలిచిన సీతక్క కొంత కాలం నక్సల్స్ కార్యకలాపాలలో కూడా చురుకుగా పాల్గొని ఆ తర్వాత ఆ పంధాను వీడి టిడిపిలో చేరారు. 2018లో మరోసారి కాంగ్రెస్ ఐ నుంచి గెలిచారు. ములుగు (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..