ఈ సారి పాలకుర్తి నియోజకవర్గ రాజకీయ చరిత్రను మలుపు తిప్పేది ఎవరు..? గ‌త చ‌రిత్ర ఇదే.. | Who Will Turn The Political History Of Palakurti Constituency This Time | Sakshi
Sakshi News home page

ఈ సారి పాలకుర్తి నియోజకవర్గ రాజకీయ చరిత్రను మలుపు తిప్పేది ఎవరు..? గ‌త చ‌రిత్ర ఇదే..

Published Thu, Aug 10 2023 1:19 PM | Last Updated on Thu, Aug 17 2023 1:21 PM

Who Will Turn The Political History Of Palakurti Constituency This Time - Sakshi

పాలకుర్తి నియోజకవర్గం

2009లో నియోజకవర్గ పునర్ విభజనలో చెన్నూరు నియోజకవర్గం రద్దై పాలకుర్తి నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.

పాలకుర్తిలో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీచేసిన సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకరరావు మరోసారి విజయం సాదించడం ద్వారా ఆయన ఆరు సార్లు గెలిచినట్లయింది. 2014 ఎన్నికలలో టిడిపి పక్షాన గెలిచిన దయాకరరావు ఆ తర్వాత పరిణామాలలో టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. తిరిగి ఈ ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసి తన సమీప కాంగ్రెస్‌ ప్రత్యర్ధి జంగా రాఘవరెడ్డిపై 53053 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. తదుపరి ఎర్రబెల్లి ముఖ్యమంత్రి కెసిఆర్‌ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. దయాకరరావు ఐదుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి టిఆర్‌ఎస్‌ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి ఎమ్‌.పిగా కూడా నెగ్గారు.

దయాకరరావుకు 117504 ఓట్లు రాగా, రాఘవ రెడ్డికి 64451 ఓట్లు వచ్చాయి.ఇక్కడ ఎస్‌.ఎఫ్‌ బి అభ్యర్ధిగా పోటీచేసిన ఎల్‌. విజయ్‌కు మూడువేలకు పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఎర్రబెల్లి దయాకరరావు 2014 ఎన్నికలనాటికి  తెలంగాణ టిడిపి వర్కింగ్‌ అద్యక్షుడుగా ఉన్నారు. 2014 ఎన్నికలలో తన సమీప కాంగ్రెస్‌ ఐ ప్రత్యర్ధి, మాజీ ఎమ్మెల్యే డి.శ్రీనివాసరావును 4313 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసిన మాజీ  ఎమ్మెల్యే డాక్టర్‌ ఎన్‌.సుదాకరరావుకు 52253 ఓట్లు వచ్చాయి. దయాకరరావు అంతకుముందు వర్ధన్నపేటలో మూడుసార్లు గెలిచారు.

నియోజకవర్గాల పునర్విభజనలో వర్దన్నపేట రిజర్వుడ్‌ కావడంతో పాలకుర్తికి మారారు. ఒకసారి లోక్‌సభకు (ఉపఎన్నికలో) గెలుపొందారు. దుగ్యాల శ్రీనివాస రావు గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా టిఆర్‌ఎస్‌ తరపున ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ ఐకి  మద్దతు ఇచ్చారు. శ్రీనివాసరావు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అనర్హతకు గురి అయిన తొమ్మిది మందిలో ఒకరుగా ఉన్నారు.

అయితే తీర్పు రావడానికి  ఒకరోజు ముందుగానే ఎమ్మెల్యే పదవికి దుగ్యాల రాజీనామా చేశారు. చెన్నూరు నియోజకవర్గం రద్దు కావడంతో దుగ్యాల పాలకుర్తిలో పోటీచేశారు.  దయాకరరావు టిడిపి తరపున ప్రభుత్వ విప్‌గా గతంలో పనిచేశారు. సుధాకరరావు గతంలో టిడిపి ఎమ్మెల్యేగా ఒకసారి ఎన్నికయ్యారు. తదుపరి టిఆర్‌ఎస్‌లో చేరారు. పాలకుర్తి, అంతకుముందు ఉన్న చెన్నూరు నియోజకవర్గాలలో కలిపి పదమూడు సార్లు  వెలమ సామాజికవర్గ నేతలు గెలుపొందితే, ఒకసారి మాత్రం రెడ్డి గెలిచారు.

చెన్నూరు(2009లో రద్దు)

రద్దయిన చెన్నూరు నియోజకవర్గానికి 12సార్లు ఎన్నికలుజరిగితే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ కలిసి నాలుగుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్‌ఎస్‌ ఒకసారి సోషలిస్టు ఒకసారి, పిడిఎఫ్‌ ఒకసారి గెలిచాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. రాష్ట్రంలో ఏడుసార్లు  నెగ్గిన అతికొద్ది మంది నేతలలోఒకరైన ఎన్‌.యతిరాజారావు చెన్నూరు నుంచే గెలుపొందారు.

ఒక ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత కూడా ఈయన పొందారు. ఈయన భార్య విమలాదేవి, కుమారుడు డాక్టర్‌ ఎన్‌. సుధాకరరావు కూడా ఒక్కోసారి గెలిచారు. యతిరాజారావు మరో కుమారుడు ప్రవీణ్‌రావు 2009లో ప్రజారాజ్యం పక్షాన పోటీచేసి ఓడిపోయారు.  1972లో ఇండిపెండెంటుగా గెలిచిన మధుసూధనరెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించింది. యతిరాజారావు గతంలో ఎన్‌.టి.ఆర్‌ క్యాబినెట్‌లో పనిచేశారు.

పాలకుర్తి నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement