Palakurthi Assembly Constituency
-
ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయా?: ప్రియాంక ఫైర్
సాక్షి, పాలకుర్తి: తెలంగాణలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలువురు ఢిల్లీ నేతలు తెలంగాణకు వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి తెలంగాకు వచ్చారు. ప్రచారంలో పాల్గొని ప్రియాంక కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లాలోని పాలకుర్తిలో కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడుతూ.. ‘యువశక్తి, నారీశక్తిని చూస్తే.. గర్వంగా అనిపిస్తోంది. పాలకుర్తిలో ఒక కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తే.. మరో కుటుంబం ప్రజల భూములు లాక్కుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడింది. త్యాగాల మీద ఏర్పాటైన రాష్ట్రం అభివృద్ధి చెందాలని భావించాం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరి ఆకాంక్షలు నెరవేరాలి. ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయో.. లేదో.. ప్రజలు ఆలోచించాలి. యువత సాధించుకున్న ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఈ పదేళ్లలో ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉంది. ఈ ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో ఎంతో అవినీతి జరిగింది. ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ కావడంతో యువత నిరాశకు గురయ్యారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక యువతి ఆత్మహత్య చేసుకుంటే ఆమె చావు గురించి ఈ ప్రభుత్వం వ్యంగ్యంగా మాట్లాడింది. ఆ యువతి పరీక్షకు దరఖాస్తు చేసుకోలేదని మాట్లాడారు. కాంగ్రెస్ గెలిస్తే.. నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయి. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. పేపర్ లీకేజీలను అరికడతాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల కష్టాలు తొలగిపోతాయి. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.2,500 వేస్తాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. జీఎస్టీ వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయి. వస్తువుల ధరలు తగ్గాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి. కేసీఆర్ సర్కార్‌కు కాలం చెల్లిపోయింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. అలాగే, హుస్నాబాద్ సభలో ప్రియాంక మాట్లాడుతూ..‘ప్రజలు కోసం బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పగలరా?. ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు ఉద్యోం ఇచ్చారా? ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదవి ఇచ్చుకున్నారు. కానీ, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎంతో కష్టపడి మీ పిల్లలను చదివించుకుంటున్నారు. వారి కష్టం వృథా అయిపోతోంది. ఇలాంటి ప్రభుత్వం మరో ఐదేళ్లు కావాలా?. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌లు అవినీతితో కురుకుపోయాయి’ ప్రధాని మోదీ దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నాడు. అదానీ ఒక్క రోజ సంపద రూ.1600కోట్లు. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీనే. ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో 40-50 స్థానాల్లో పోటీచేస్తే తెలంగాణలో మాత్రం ఏడు స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఒవైసీ ఎప్పుడూ రాహుల్ గాంధీనే తిడుతుంటారు. ఇప్పటికైనా బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న దోస్తీని గుర్తించాలి. అని అన్నారు. -
తెలంగాణ ఆత్మగౌరవం మరోసారి నిలబెట్టాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఓటు వేయకపోతే ప్రజలు ఐదేళ్లపాటు శిక్ష అనుభవించాల్సి వస్తుందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం జనగాం జిల్లా పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు హాజరై కేసీఆర్ ప్రసంగించారు. పాలకుర్తి బహిరంగ సభలో కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై సెటైర్లు సంధించారు. ‘‘మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్‌కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన పన్నులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నడని అంటున్నడు. రైతు బంధు దుబారానా?.. రైతు బంధు ఉండాలా? వద్దా? ఉండుడు కాదు.. దయాకర్‌ను గెలిపిస్తే రైతు బంధు రూ.16వేలకు పెంచుతాం. అదే కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు మాయమైపోతది.. ..ఇంకోకాయన మాట్లాడుతున్నడు. ఆయన టీపీసీసీ చీఫ్. కేసీఆర్‌కు ఏం పని లేదు. 24 గంటలు ఇచ్చి వేస్ట్ చేస్తున్నడు అని. కరెంట్ ఎన్ని గంటలు అవసరం. 24 గంటలు అవసరం. కానీ, కాంగ్రెస్ గెలిస్తే అది జరగదు. చెప్పేటోళ్లు ఎల్లయ్య.. మల్లయ్య కాదు.. ఆ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అమెరికాలో చెప్పిండు, ఇక్కడా టీవీ ఇంటర్వ్యూల్లో బల్లగుద్ది చెబుతున్నారు. కేసీఆర్‌కు ఏం తెల్వది. 10 హెచ్‌పీ మోటర్తో నడిపిస్తే మూడు గంటల కరెంట్ చాలంటున్నడు. మనం ఇక్కడ వాడేది 3, 5 హెచ్‌పీ మోటర్లు. మరి 10హెచ్‌పీ మోటర్ మీ అయ్య కొనిస్తడా? అని రేవంత్‌ను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికలొస్తే ఇలాంటోళ్ల మాటలు విని గోల్మాల్కావడం కాదు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ అడుగుతుంది. ఒక్కసారి కాదు 11, 12సార్లు అధికారం ఇచ్చిండ్రు. ఏం చేసిండ్రు. కడుపులో సల్ల కదలకుండా జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటేయండి. ప్రలోభాలకు లోనై ఓటేయొద్దు. ప్రజలు గెలిస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది. అని సభకు హాజరైన ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారాయన. మంది మాటలు విని ఆగం కావొద్దు కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ధైర్యంగా పని చేసి అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే పని చేయలేదని నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఏది ఏమైనా కరెంటు సమస్య పరిష్కరించాలని స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం. సమస్యను పరిష్కరించి చూపించాం. గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచుకున్నాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా దళితులను ఆదుకుందా? కాంగ్రెస్ పాలనలో తాగు, సాగు నీరు, కరెంటు సంగతి మీకు తెలుసు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక హక్కు.. ఓటు. ఇది ఎలాపడితే అలా వేసేది కాదు. ఎన్నికలు అనగానే ఎందరో వస్తుంటారు.. ఏవేవో మాట్లాడుతుంటారు. నియోజకవర్గం బాగుపడాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మంది మాటలు విని ఆగం అయితే ఐదేళ్లపాటు కష్టాల పాలవుతాం. అందుకే ఓటు వేసే ముందు అన్ని ఆలోచించి వేయాలి. అభివృద్ధిలో రాష్ట్రం ముందుకు వెళ్లాలి... వెనక్కి పోవద్దు. తెలంగాణ ఆత్మగౌరవం మరోసారి నిలబెట్టాలని కోరుతున్నా. జానారెడ్డి సీఎం అవుతానని కలలు కంటున్నారు. గతంలో జనారెడ్డికి మీరు ఓటుతో బుద్ధి చెప్పారు. నాగార్జునసాగర్‌లో భగత్‌ను 70వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వాళ్లు 196 కేసులు వేశారు పదేళ్లుగా తెలంగాణలో సంక్షేమ పాలన అందించామని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ అన్నారు. ‘‘ఈసారి ఎన్నికలను మనం సీరియస్‌గా తీసుకోవాలి. ప్రజలు ఓటు వేసే ముందు.. పార్టీల చరిత్ర కచ్చితంగా చూడాలి. అభ్యర్థి గురించి ఆలోచించాలి. ఎవరి చేతిలో పెడితే రాష్ట్రం బాగుపడుతుందో ఆలోచన చేయాలి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ, పదేళ్లుగా రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించాం. విధివంచితులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. సామాజిక బాధ్యతలో భాగంగానే పింఛన్లు పెంచాం. మళ్లీ అధికారంలోకి రాగానే రూ.5వేల వరకు పింఛన్ పెంచుతాం. జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేశాం. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు కృష్ణా నీళ్లు రావాలి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకొస్తే ఆపేందుకు కాంగ్రెస్ వాళ్లు 196 కేసులు వేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం వల్ల లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది’’ అని సీఎం కేసీఆర్ వివరించారు. -
పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌తో టుడేస్ లీడర్
-
టార్గెట్ ఎర్రబెల్లి.. ఝాన్సీరెడ్డి బదులు యశస్వినీ!
సాక్షి, హన్మకొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం గడుస్తున్న కొద్దీ కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం మరోసారి హైలైట్ అయ్యింది. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో పాలకుర్తి విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. పాలకుర్తి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బరిలో దిగుతారని అందరూ ఆశించారు. అయితే. చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో స్క్రీనింగ్ కమిటీ ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి పౌరసత్వం విషయంలో సమస్య కారణంగా ఆమెకు బదులుగా ఝాన్సీ కోడలు యశస్వినీ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు స్క్రీనింగ్ కమిటీ యశస్వినీ పేరును ప్రతిపాదించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్న ఎర్రబెల్లికి ఈసారి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ భారీ కసరత్తే చేస్తోంది. ఆయనను ఈసారి ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబసభ్యులను బరిలోకి దింపనున్నారు. ఝాన్సీరెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతోపాటు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి సహకారం కూడా ఉంది. మంత్రి ఎర్రబెల్లికి సైతం జనం నుంచి వ్యతిరేక ఉండడంతో నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌కు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. మీరా నీతులు చెప్పేదంటూ.. -
ఈసారి పాలకుర్తిలో వాడివేడి పోటీ.. అధికార పార్టీపై హాస్తం వ్యూహాలు..!
పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్న ఎర్రబెల్లికి ఈసారి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ బారీ కసరత్తే చేస్తుంది. ఆయనను ఈసారి ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబసభ్యులను బరిలోకి దింపనున్నారు. ఝాన్సీరెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశిస్సులతోపాటు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి సహకారం ఉంటుంది. మంత్రి ఎర్రబెల్లికి సైతం జనం నుంచి వ్యతిరేక ఉండడంతో నియోజకవర్గానికే పరిమితం అవుతున్నాడు. రాజకీయపరమైన అంశాలు పాలకుర్తి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దయాకర్ రావు కలిసి వచ్చే అంశం నియోజకవర్గ ప్రజలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండడం. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీగా నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం. మహిళలకు కుట్టు మిషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఫ్రీగా కుట్టు మిషన్ ఇవ్వడం. మహిళలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీ మిల్స్ ఏర్పాటు చేయడం. జూనియర్ డిగ్రీ కాలేజీలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం కలిసి వచ్చే అంశాలు. కాంగ్రెస్ పార్టీ నుండి అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి , నియోజకవర్గ లోకల్‌గా కలిసి వచ్చే అంశం. ఆమె గతంలో నిరుపేదలకు చేసిన సేవలు కూడా ప్రభావితం చేస్తాయి అని చెప్పవచ్చు. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న నాయకులు ఆమెతో కలిసి వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే నెమరు కొమ్ముల సుధాకర్ రావు ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వకపోవడంతో తనతో ఉన్న కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. పాలకుర్తిలో బిజెపి ప్రభావం పెద్దగా చెప్పుకోదగినంత ఏమీ లేదు. గతంలో రెండు సార్లు పెద్దగాని సోమయ్య పోటీ చేశాడు కానీ ఇప్పటివరకు మళ్లీ ఏ వ్యక్తికైనా బిజెపి నుండి అభ్యర్థిగా నిర్ణయించలేదు.. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు : పాలకుర్తి నియోజకవర్గం లోకల్ నాన్ లోకల్ అంశం, ఈ ఎలక్షన్లో రెడ్డి సామాజిక వర్గం ప్రభావితం చూపే అవకాశం ఉంది. నాలుగో సారి ఎన్నికల బరిలో మంత్రి దయాకర్ రావు ప్రజల నుంచి సహజంగా వచ్చే వ్యతిరేకత. మూడోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చే వ్యతిరేకత ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు బీఆర్ఎస్ ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బీజేపీ పార్టీ పెద్దగాని సోమయ్య వృత్తిపరంగా ఓటర్లు: రైతులు. వ్యాపారులు. మతం/కులాల వారిగా ఓటర్లు: హిందుఓటర్లు అందులో రెడ్డి సామాజికవర్గం ఓట్లు ప్రభావం చూపుతాయి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: పాలకుర్తి నియోజకవర్గం మూడు జిల్లాలకు విస్తరించి ఉంది. వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. అడవులు లేవు పర్యాటక కేంద్రంగా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ టెంపుల్, వల్మిడి సీతారామచంద్ర స్వామి టెంపుల్, బొమ్మెర పోతన స్మారక మందిరం. -
ఈ సారి పాలకుర్తి నియోజకవర్గ రాజకీయ చరిత్రను మలుపు తిప్పేది ఎవరు..? గత చరిత్ర ఇదే..
పాలకుర్తి నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో చెన్నూరు నియోజకవర్గం రద్దై పాలకుర్తి నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. పాలకుర్తిలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు మరోసారి విజయం సాదించడం ద్వారా ఆయన ఆరు సార్లు గెలిచినట్లయింది. 2014 ఎన్నికలలో టిడిపి పక్షాన గెలిచిన దయాకరరావు ఆ తర్వాత పరిణామాలలో టిఆర్ఎస్లో చేరిపోయారు. తిరిగి ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి జంగా రాఘవరెడ్డిపై 53053 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. తదుపరి ఎర్రబెల్లి ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. దయాకరరావు ఐదుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి టిఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి ఎమ్.పిగా కూడా నెగ్గారు. దయాకరరావుకు 117504 ఓట్లు రాగా, రాఘవ రెడ్డికి 64451 ఓట్లు వచ్చాయి.ఇక్కడ ఎస్.ఎఫ్ బి అభ్యర్ధిగా పోటీచేసిన ఎల్. విజయ్‌కు మూడువేలకు పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఎర్రబెల్లి దయాకరరావు 2014 ఎన్నికలనాటికి తెలంగాణ టిడిపి వర్కింగ్ అద్యక్షుడుగా ఉన్నారు. 2014 ఎన్నికలలో తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి, మాజీ ఎమ్మెల్యే డి.శ్రీనివాసరావును 4313 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుదాకరరావుకు 52253 ఓట్లు వచ్చాయి. దయాకరరావు అంతకుముందు వర్ధన్నపేటలో మూడుసార్లు గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనలో వర్దన్నపేట రిజర్వుడ్ కావడంతో పాలకుర్తికి మారారు. ఒకసారి లోక్‌సభకు (ఉపఎన్నికలో) గెలుపొందారు. దుగ్యాల శ్రీనివాస రావు గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ తరపున ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐకి మద్దతు ఇచ్చారు. శ్రీనివాసరావు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అనర్హతకు గురి అయిన తొమ్మిది మందిలో ఒకరుగా ఉన్నారు. అయితే తీర్పు రావడానికి ఒకరోజు ముందుగానే ఎమ్మెల్యే పదవికి దుగ్యాల రాజీనామా చేశారు. చెన్నూరు నియోజకవర్గం రద్దు కావడంతో దుగ్యాల పాలకుర్తిలో పోటీచేశారు. దయాకరరావు టిడిపి తరపున ప్రభుత్వ విప్‌గా గతంలో పనిచేశారు. సుధాకరరావు గతంలో టిడిపి ఎమ్మెల్యేగా ఒకసారి ఎన్నికయ్యారు. తదుపరి టిఆర్ఎస్లో చేరారు. పాలకుర్తి, అంతకుముందు ఉన్న చెన్నూరు నియోజకవర్గాలలో కలిపి పదమూడు సార్లు వెలమ సామాజికవర్గ నేతలు గెలుపొందితే, ఒకసారి మాత్రం రెడ్డి గెలిచారు. చెన్నూరు(2009లో రద్దు) రద్దయిన చెన్నూరు నియోజకవర్గానికి 12సార్లు ఎన్నికలుజరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి నాలుగుసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి సోషలిస్టు ఒకసారి, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. రాష్ట్రంలో ఏడుసార్లు నెగ్గిన అతికొద్ది మంది నేతలలోఒకరైన ఎన్.యతిరాజారావు చెన్నూరు నుంచే గెలుపొందారు. ఒక ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత కూడా ఈయన పొందారు. ఈయన భార్య విమలాదేవి, కుమారుడు డాక్టర్ ఎన్. సుధాకరరావు కూడా ఒక్కోసారి గెలిచారు. యతిరాజారావు మరో కుమారుడు ప్రవీణ్‌రావు 2009లో ప్రజారాజ్యం పక్షాన పోటీచేసి ఓడిపోయారు. 1972లో ఇండిపెండెంటుగా గెలిచిన మధుసూధనరెడ్డి ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించింది. యతిరాజారావు గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో పనిచేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..