మహబూబాబాద్ (ఎస్టి) నియోజకవర్గం
మహబూబాబాద్ గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన శంకర్ నాయక్ రెండోసారి విజయం సాదించారు. ఈయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, కేంద్ర మాజీ మంత్రి బలరామ్ నాయక్ పై 13534 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. శంకర్ నాయక్ కు 85397 ఓట్లు రాగా, బలరాం నాయక్ కు 71863 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జె.హుస్సేన్ నాయక్ కు 11600 పైగా ఓట్లు వచ్చాయి.
2014లో మహబూబాబాద్ గిరిజన నియోజకవర్గంలో శంకర్ నాయక్ కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాలోతు కవిత ను 9315 ఓట్ల తేడాతో ఓడిరచారు. కవిత మాజీ మంత్రి రెడ్యా నాయక్ కుమార్తె. తెలంగాణ ఉద్యమ ప్రభావం ఈ నియోజకవర్గంలో ఉండి కవిత ఓడిపోతే, ఈమె తండ్రి రెడ్యా నాయక్ డోర్నకల్ నుంచి కాంగ్రెస్ ఐ పక్షాన గెలుపొందడం విశేషం.
ఆ తర్వాత ఇద్దరూ టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. కవిత 2019 ఎన్నికలలో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009 నుంచి మహబూబాబాద్ నియోజకవర్గం గిరిజనులకు రిజర్వు అయింది. మహబూబాబాద్‌లో కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి ఆరుసార్లు, టిడిపి రెండుసార్లు, సిపిఐ రెండుసార్లు, టిఆర్‌ఎస్ రెండుసార్లు, ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు పిడిఎఫ్, ఎస్.పి.ఎఫ్ చెరోసీటు గెలుచుకున్నాయి.
1972 నుంచి 1989 వరకు వరుసగా ఐదుసార్లు జన్నారెడ్డి జనార్థనరెడ్డి గెలుపొందారు. 2004లో ఇక్కడ గెలిచిన టిడిపి నేత వి.నరేందర్‌రెడ్డి ఈ నియోజకవర్గం 2009లో రిజర్వు కావడం వల్ల పోటీచేయ లేకపోయారు. మహబూబాబాద్‌లో ఆరుసార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, మూడుసార్లు బ్రాహ్మణ,ఒకసారి ఎస్.సి, ఒకసారి ఇతరులు గెలుపొందారు.
మహబూబాబాద్ (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment