Shankar Naik
-
భూమిని ఆక్రమించారని కలుపు మందు తాగాడు
కారేపల్లి: తన భూమిని అన్యాయంగా ఆక్రమించి ట్రాక్టర్లతో దున్నుతున్నారంటూ ఓ రైతు కలుపు మందు తాగి ఆత్మహ త్యాయత్నం చేశాడు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయపల్లికి చెందిన పచ్చిపాల భద్రయ్య, ఆయన సోదరులు సోమయ్య, రామయ్య, మల్లయ్యకు ఆలియాతండాలో వ్యవసాయ భూమి ఉంది. ఇందులో భద్రయ్య మినహా మిగతా వారు ఆర్టీఐ మాజీ కమిషనర్ జి.శంకర్‌నాయక్‌కు భూమి అమ్ముకు న్నట్లు సమాచారం. అయితే, సర్వేనంబర్ 548లోని తన 1.20 ఎకరాల భూమిని శంకర్‌నాయక్ తప్పుడు పత్రాలతో బై నంబర్లు సృష్టించి పట్టా చేసుకున్నారని భద్రయ్య కొన్నే ళ్లుగా ఆరోపిస్తున్నాడు. మరోపక్క శంకర్‌నాయక్ తాను చట్ట ప్రకారమే భూమి కొన్నట్టు చెబుతున్నారు. దీనిపై ఇరు వర్గాలు తహసీల్దార్ మొదలు ఉన్నతాధికారుల వరకు ఫిర్యా దు చేసుకున్నారు. భద్రయ్య కోర్టును సైతం ఆశ్రయించినట్లు సమాచారం. ఈ క్రమంలో గురువారం శంకర్‌నాయక్ మను షులు ట్రాక్టర్లతో వివాదాస్పద భూమిని దున్నసాగారు. దీంతో రైతు భద్రయ్య, ఆయన భార్య భాగ్యమ్మ అడ్డుకున్నారు. ట్రాక్టర్ కదలకుండా భద్రయ్య అడ్డుగా పడుకోవడంతో పాటు తన వెంట తెచ్చుకున్న కలుపు మందు తాగి అస్వస్థత కు గురయ్యాడు. ఆయనను తొలుత ఇల్లెందుకు, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆలియాతండాకు వెళ్లి వివరాలు ఆరాతీశారు. ఇదే జిల్లా ప్రొద్దుటూరులో ఇటీవల భూవివాదంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకోగా ఇప్పుడు మరో రైతు ఆత్మహత్యకు యత్నించడం చర్చనీయాంశమైంది. తాజా ఘటనలో భద్ర య్య భార్య భాగ్యమ్మ ఫిర్యాదుతో పలువురిపై కేసు నమోదు చేసినట్లు కారేపల్లి ఎస్సై రాజారాం తెలిపారు. భద్రయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. -
మరోసారి పీఠమెక్కేదెవరో..?
సాక్షి, మహబూబాబాద్: మానుకోట పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు గతంలో ఎంపీగా గెలిచిన వారే. ఇందులో ఏ ఇద్దరిని చూసినా ఒకే పార్టీలో పనిచేసిన పరిచయాలు ఉన్నాయి. గతంలో పనిచేసిన అనుభవానికి.. ప్రస్తుత పార్టీల చరిష్మాతో ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ముగ్గురు సమర్థులే కావడంతో.. ఎంపీ పీఠం మళ్లీ ఎవరికి దక్కుతుందో అనేది పార్లమెంట్ పరిధిలో చర్చగా మారింది.ముగ్గురు ముగ్గురే..2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన బలరాంనాయక్ సమీప అభ్యర్థి కుంజ శ్రీనివాసరావుపై 68,957ఓట్ల మెజార్టీతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టారు. కేంద్ర కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన సీతారాంనాయక్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్‌పై 34,992 ఓట్ల మెజార్టీతో గెలిచారు.ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాలోత్ కవిత బలరాంనాయక్‌పై 1,46,663ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు అదే పార్టీ నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఇందులో కవిత, సీతారాంనాయక్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందగా.. వారిద్దరి చేతిలో బలరాంనాయక్ ఓటమిపాలవ్వడం గమనార్హం.ఒకరి ఓట్లకు మరొకరు గాలం..మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పాత వారే కావడంతో.. వారు పోటీ చేస్తున్న పార్టీతో పాటు.. ఇతర పార్టీల్లోని ఓటర్లకు గాల వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న కవిత.. 2009లో కాంగ్రెస్ నుంచి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ నాయకుడు శంకర్‌నాయక్ చేతిలో ఓడిపోయారు. తర్వాత కవిత బీఆర్ఎస్లో చేరి ఎంపీగా గెలిచారు.కాగా మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు కవితకు మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కవిత వర్గీయుల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ప్రస్తుతం ఆమె పోటీలో ఉండడంతో కాంగ్రెస్ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన రెడ్యానాయక్‌కు కవిత కూతురు కావడం.. ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులతో ఉన్న పాత పరిచయాలు కూడా ఇప్పుడు కవితకు ఓటు బ్యాంకుగా మారే అవకాశం లేకపోలేదు.అదేవిధంగా ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సీతారాంనాయక్ తెలంగాణ ఉద్యమకారుడిగా.. గిరిజన సామాజిక వర్గం నుంచి మేధావిగా గుర్తింపు పొందారు. ఈమేరకు 2014లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. కాగా ఎన్నికల వరకు బీఆర్ఎస్లో ఉన్న సీతారాంనాయక్‌కు మానుకోట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిచయాలు ఉన్నారు. ఇప్పుడు ఆయన వారి వద్దకు వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరుతూ.. బీఆర్ఎస్ ఓట్లకు గండి పెడుతున్నారు. ఇక బలరాంనాయక్‌కు అధికార పార్టీ ఎమ్మెల్యేలే అతిపెద్ద బలం.ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఆయన గెలుపును ఎమ్మెల్యేలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చే మెజార్టీతోనే అధినాయకుడి వద్ద మార్కులు పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఓటర్లతోపాటు.. బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆ పార్టీ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇలా ముగ్గురు అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల ఓట్లను చీల్చే అవకాశం ఉంది. -
సీఎం జగన్ కృషి వల్లే నాసిన్ ప్రాజెక్ట్ సాకారం: MLA శంకర్ నారాయణ
-
'ఏం పాపం చేశామని ప్రజలు మోసం చేశారు!' : బానోత్ శంకర్‌నాయక్
మహబూబాబాద్: పార్టీ శ్రేణులు కసిగా పనిచేయకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులు కన్నీరు కారుస్తున్నారని, ఓటు వేసే ముందు ఆలోచిస్తే బాగుండేదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిందని, ఏం పాపం చేశామని ఎన్నికల్లో ప్రజలు మోసం చేశారో తెలియడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది స్వార్థపరులు పార్టీలో లబ్ధిపొంది ఎన్నికల ముందు బయటకు వెళ్లిపోయారని, మరి కొంతమంది పార్టీలో ఉంటూ మోసం చేశారన్నారు. అలాంటి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇక మీదట పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండి, కసిగా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వోలం చంద్రమోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణ, నీలం దుర్గేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎండి.నజీర్అహ్మద్, ప్రధాన కార్యదర్శి కముటం శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, జాటోత్ హరీశ్‌నాయక్, ఊకంటి యాకూబ్‌రెడ్డి, సట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: పురపాలికల్లో మోగుతున్న అవిశ్వాస గంట -
నామినేషన్ నింపటం చేతకాని వాళ్లు కూడా నన్ను విమర్శిస్తున్నారు: బానోతు శంకర్ నాయక్
-
ముచ్చటగా మూడోసారి బరిలోకి.. ఈసారి ఓటమి తప్పదా?
పోరాటాల పురుటి గడ్డ మానుకోట. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న మానుకోట తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావంతో గులాబీ తోటకు అడ్డగా మారింది. ఎస్టీ రిజర్వుడు స్థానమైన మహబూబాబాద్ లో గిరిజన నేతల మద్య రాజకీయ పోరు రక్తికట్టిస్తుంది. పార్టీలు ఎన్ని ఉన్నా ప్రధానంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజేపి మద్యనే పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తుంటే, కాంగ్రెస్ బిజేపి ఇంకా అభ్యర్థి ఎంపికలో తలమునకలై పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాయి. పాతకాపుల మద్యనే మానుకోటలో పోటీ నెలకొన్న పాలిటిక్స్‌పై స్పెషల్ స్టోరీ. ప్రజానాయకుడిగా పేరు ఒకప్పటి మానుకోట మహబూబాబాద్‌గా మారి జిల్లా కేంద్రంగా అవతరించింది. నియోజకవర్గాల పునఃర్విభజనతో ఎస్టీ రిజర్వుగా మారిన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు మండలాలు 155 గ్రామ పంచాయితీలు 238734 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ కు చెందిన శంకర్ నాయక్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అవిర్బావంతో 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన శంకర్ నాయక్ రెండోసారి 2018లో గెలిచి ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. విమర్శలకు తోడు గ్రూప్ రాజకీయాలు ముచ్చటగా మూడో సారి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలుస్తున్న శంకర్ నాయక్ ఈసారి ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిన శంకర్ నాయక్‌కు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని బట్టి గెలుపుఓటములు ఆధారపడి ఉన్నాయి. రెండు సార్లు ఎమ్మెల్యే అయిన శంకర్ నాయక్ బినామీ పేర్లమీద ఆస్థులు కూడబెట్టారనే విమర్శలు ఉన్నాయి. విమర్శలకు తోడు పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ రవీందర్ రావుతో సఖ్యత లేకపోవడం, మంత్రి సత్యవతి రాథోడ్‌తో అంటిముట్టనట్లు వ్యవహరించడం అతనికి ప్రతికూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చదవండి: కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న మాట నిజమే: ఈటల శంకర్ నాయక్‌కు చెక్ పడే పరిస్థితులు ఒకదశలో ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటు స్వపక్ష పార్టీ నాయకులే రోడ్డెక్కారు. అధిష్టానం పెద్దలు పార్టీనాయకుల మద్య సయోద్యకుదుర్చి మూడో సారి శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వడంతో అభ్యర్థిని మార్చాలనే డిమాండ్‌తో ఆందోళనకు సైతం జరిగాయి. పార్టీ పెద్దల జోక్యంతో ప్రస్తుతం అంతా సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా రగిలిపోతున్న నాయకులతో శంకర్ నాయక్‌కు చెక్ పడే పరిస్థితులు ఉత్పన్నమవుతాయనే ప్రచారం సాగుతుంది. తనకే టికెట్ వస్తుందనే ధీమా ఇక కాంగ్రెస్‌లో అదే పరిస్థితి నెలకొంది. టిక్కెట్ రేసులో కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, డాక్టర్ మురళి నాయక్ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో బలరాం నాయక్ పోటీ చేసి శంకర్ నాయక్‌పై 13వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతోపాటు అధిష్టానం పెద్దల ఆశిస్సులు ఉండడంతో ఈసారి సైతం తనకే టికెట్ వస్తుందనే దీమాతో ఉన్నారు. గట్టి పోటీ బలరాం నాయక్ అభ్యర్థి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గెలుపుకు తిరుగుండదని ఇరు పార్టీల నాయకులు బావిస్తున్నారు. బలరాం నాయక్ కంటే స్థానిక డాక్టర్ ప్రజలతో తత్సంబందాలు ఉన్న మురళీ నాయక్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపితే గట్టి పోటీ ఉంటుందని బావిస్తున్నారు. బలరాంనాయక్ ను కాదని మురళీనాయక్‌కు టికెట్ దక్కే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నామమాత్రంగానే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్ పోటీ చేయనున్నారు. గత 2018 ఎన్నికల్లో పోటీ చేసిన హుస్సెన్ నాయక్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. యూత్ పాలోయింగ్ ఎక్కువగానే ఉన్నప్పటికి ఓట్లను రాబట్టుకోవడంలో విఫలం అవుతున్నారనే భావన ప్రజల్లో ఉంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపద్యంలో హుస్సెన్ నాయక్ పోటీ నామమాత్రంగా మారనుంది. చదవండి: ఈనెల 16న బీఆర్ఎస్ భారీ సభ.. మేనిఫెస్టో విడుదల ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్యనే నువ్వానేనా అన్నట్లు పోటీ సాగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత, గ్రూప్ రాజకీయాలను విపక్షాలు అనుకూలంగా మలుచుకునే పనిలో పడి ఎత్తుకు పై ఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్‌లో సైతం గ్రూప్ రాజకీయాలు, అభ్యర్థి విషయంలో క్లారిటీ లేక పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అది కాస్త శంకర్ నాయక్‌కు అనుకూలంగా మారే పరిస్థితులున్నాయి. -
మహబూబాబాద్ (ఎస్టి) నియోజకవర్గం గతంలో గెలిచిన అభ్యర్థులు వీరే..మరి ఇప్పుడు..?
మహబూబాబాద్ (ఎస్టి) నియోజకవర్గం మహబూబాబాద్ గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన శంకర్ నాయక్ రెండోసారి విజయం సాదించారు. ఈయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, కేంద్ర మాజీ మంత్రి బలరామ్ నాయక్ పై 13534 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. శంకర్ నాయక్ కు 85397 ఓట్లు రాగా, బలరాం నాయక్ కు 71863 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జె.హుస్సేన్ నాయక్ కు 11600 పైగా ఓట్లు వచ్చాయి. 2014లో మహబూబాబాద్ గిరిజన నియోజకవర్గంలో శంకర్ నాయక్ కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాలోతు కవిత ను 9315 ఓట్ల తేడాతో ఓడిరచారు. కవిత మాజీ మంత్రి రెడ్యా నాయక్ కుమార్తె. తెలంగాణ ఉద్యమ ప్రభావం ఈ నియోజకవర్గంలో ఉండి కవిత ఓడిపోతే, ఈమె తండ్రి రెడ్యా నాయక్ డోర్నకల్ నుంచి కాంగ్రెస్ ఐ పక్షాన గెలుపొందడం విశేషం. ఆ తర్వాత ఇద్దరూ టిఆర్ఎస్లో చేరిపోయారు. కవిత 2019 ఎన్నికలలో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009 నుంచి మహబూబాబాద్ నియోజకవర్గం గిరిజనులకు రిజర్వు అయింది. మహబూబాబాద్‌లో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, టిడిపి రెండుసార్లు, సిపిఐ రెండుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు, ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు పిడిఎఫ్, ఎస్.పి.ఎఫ్ చెరోసీటు గెలుచుకున్నాయి. 1972 నుంచి 1989 వరకు వరుసగా ఐదుసార్లు జన్నారెడ్డి జనార్థనరెడ్డి గెలుపొందారు. 2004లో ఇక్కడ గెలిచిన టిడిపి నేత వి.నరేందర్‌రెడ్డి ఈ నియోజకవర్గం 2009లో రిజర్వు కావడం వల్ల పోటీచేయ లేకపోయారు. మహబూబాబాద్‌లో ఆరుసార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, మూడుసార్లు బ్రాహ్మణ,ఒకసారి ఎస్.సి, ఒకసారి ఇతరులు గెలుపొందారు. మహబూబాబాద్ (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కేసీఆర్ సర్కార్‌పై వైఎస్ షర్మిల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళపై పాలకులు ఇంత నీచంగా మాట్లాడిస్తారా అంటూ మండిపడ్డారు. ఇక, వైఎస్ షర్మిల ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వం అణిచివేత ధోరణితో వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ నేతల అక్రమాలను ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. ఒక మహిళపై పాలకులు ఇంత నీచంగా మాట్లాడిస్తారా?. ప్రశ్నినందుకు శంకర్ నాయక్ దాడికి ప్లాన్ చేశాడు. కనిపించిన భూములన్నీ కబ్జా చేస్తున్నారు. శంకర్ నాయక్ ఆగడాలను ప్రజలు గమనించాలి. పాలకపక్షం కుట్రతోనే పాదయాత్రను అడ్డుకుంది’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
RTI Act: సామాన్యుడి వజ్రాయుధం
ఎన్నో ఏళ్ళ ఉద్యమాల ఫలితంగా 2005 అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం భారత్‌లో అమలులోకి వచ్చింది. ప్రభుత్వాలు ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండటానికీ, పౌరులకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికీ ఈ చట్టం రూపొందింది. తెలంగాణ సమాచార కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2017 సెప్టెంబర్ 9న వేరయింది. ఈ సమయంలో బదిలీ అయిన పిటీషన్లు 6,825 కలుపుకొని... తెలంగాణ రాష్ట్రంలో దాఖలైన మొత్తం దరఖాస్తులు 38,000. అందులో ఇప్పటివరకూ 32,000 పరిష్కారం అయ్యాయి. పెండింగ్‌లో ఉన్నవి కేవలం 6,000 మాత్రమే. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పుడు కూడా కొంతకాలం టెలిఫోన్ ద్వారా కేసులు విచారించి, పరిష్కరించిన చరిత్ర మన కమిషన్‌ది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ప్రకారం ఒక బోర్డు ఏర్పాటై ఉంటుంది. దాని మీద ప్రజా సమాచార అధికారి ఫోన్ నంబర్ ఉంటుంది. తమకు కావలసిన సమాచారం కోసం ఆ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి 10 రూపాయలు చెల్లించి లేక తెల్ల రేషన్ కార్డు ఉంటే ఒక జిరాక్స్ పెట్టి సెక్షన్ 6(1) కింద దరఖాస్తు చేసుకుంటే చాలు. గ్రామపంచాయతీ కార్యాలయంలో అయితే ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మండల స్థాయిలో రూ. 5, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలలో రూ. 10 రుసుం చెల్లించాలి. (క్లిక్ చేయండి: జడ్జి ప్రశ్నలకు జవాబులున్నాయా?) మీరు దరఖాస్తు చేసుకున్న నాటినుంచి సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లో అందులో కోరిన సమాచారం ఇవ్వాలి. 8, 9 సెక్షన్ల కింద మినహాయింపు పొందిన సమాచారం తప్ప... మిగతా సమా చారాన్ని ఇవ్వాలి. సమాచారాన్ని నిరాకరిస్తే మొదటి అప్పిలేట్ అధికారికి సెక్షన్ 19 (1) కింద దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ కూడా సమాచారం నిరాకరిస్తే సెక్షన్ 19 (3), సెక్షన్ 18(1) కింద సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మొత్తం మీద సమాచార హక్కు చట్టాన్ని సామాన్యుడి చేతిలో వజ్రాయుధంగా చెప్పవచ్చు. – డాక్టర్ గుగులోతు శంకర్ నాయక్, తెలంగాణ సమాచార కమిషనర్ (అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు) -
శంకర్ నాయక్ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
-
వాలెంటైన్స్ డే: మంత్రి కొప్పుల ఈశ్వర్ లవ్ స్టోరీ
► జగిత్యాల జిల్లాలో.. ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే, ప్రేమ విషయం పెద్దలకు చెప్పలేక యువతి ఉరివేసుకుంది. ఇది తెలిసి.. దుబాయ్‌లో ఉన్న ప్రియుడు ‘నువ్వు లేక నేను లేను’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ► పెద్దలు పెళ్లికి అంగీకరించరనే కారణంతో ఆ ప్రేమికులిద్దరూ కలిసి బావిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం వడ్లతండాలో చోటుచేసుకున్న ఘటన ఇది. ► నిజామాబాద్ జిల్లాలో.. వారిద్దరివీ వేర్వేరు కులాలు.. ప్రేమతో ఒక్కటవ్వాలనుకున్నారు. కానీ, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఒకరు.. కాదని మరొకరు అభిప్రాయ భేదాలకు గురై.. చివరకు ఇద్దరూ ఉరివేసుకున్నారు. కేవలం పెద్దలు పెళ్లికి అంగీకరించరనే భయంతోనే గడిచిన మూడు నెలల్లో పదిహేనుకుపైగా ప్రేమజంటలు ఆత్మహత్యలకు పాల్పడ్డాయి. చనిపోవడానికి కూడా ధైర్యం కావాలి.. అదే ధైర్యాన్ని వారు పెద్దల్ని ఒప్పించడానికి లేదా కలిసి బతకడానికి చూపాలని అంటున్నారు ఒకప్పటి ప్రేమికులు. కులమతాలు వేరైనా.. ‘ప్రేమ కోసం ధైర్యంగా నిలబడ్డాం. ఆ ధైర్యంతోనే ఇరుపక్షాల పెద్దల్ని ఒప్పించాం. ఇప్పుడెలాంటి స్పర్థలు లేకుండా ఆనందంగా ఉన్నాం’ అంటున్నాయి ‘ప్రేమ–పెళ్లి’లో సక్సెస్ అయిన జంటలు. నొప్పించకుండా పెద్దలను ఒప్పించగలగాలి.. అందుకోసం ఎన్నాళ్లైనా వేచిచూడగలగాలి.. ఇలాంటివి లోపించే నేటి ప్రేమలు విషాదాంతమవుతున్నాయని చెబుతున్న వీరు.. నాడు తామేం చేశామన్న సంగతిని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ తో పంచుకున్నారు. చనిపోవడానికైనా ధైర్యం కావాలి.. ఆ ధైర్యంతోనే కలిసి బతకొచ్చు ప్రేమలో సఫలం కావడానికి మేం చేసింది ఇదీ.. ‘ప్రేమికుల దినోత్సవం’ సందర్భంగా నాటి ప్రేమజంటలు చెబుతున్న సక్సెస్ స్టోరీస్ పెద్దల అంగీకారంతో.. జగిత్యాల: ‘ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. పెద్దల్ని ఒప్పించి చేసుకున్నా.. ఒకరినొకరు అర్థం చేసుకోవడమనేది ముఖ్యం’ అంటున్నారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు. 37 ఏళ్ల కిందట వీరు పెద్దల సమక్షంలో ఆషాఢమాసంలో కులాంతర వివాహం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన స్నేహలత తండ్రి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఆ సమయంలో సింగరేణిలో పనిచేస్తూ కమ్యూనిస్ట్ పారీ్టలో ఉన్న కొప్పుల ఈశ్వర్ స్నేహలతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె అసలు పేరు కోకిలాదేవి. కమ్యూనిస్ట్ ఉద్యమ సమయంలో చనిపోయిన తన తోటి సహచరి స్నేహలత పేరును ఈశ్వర్ తన సతీమణికి పెట్టుకున్నారు. ఉద్యమం కలిపింది.. తొర్రూరు: ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు చెందిన సబీహాబాను, మహబాబూబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మంగళపల్లి శ్రీనివాస్ 25 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆదివాసీలు, గిరిజనుల సమస్యలపై శ్రీనివాస్‌తో కలిసి సబీహాబాను ఉద్యమాలు చేపట్టింది. ఆ ఉద్యమ సాహచర్యం కాస్తా ప్రేమ.. పెళ్లికి దారితీసింది. ఇంటర్ వరకు చదివిన సబీహాబానును హిందీలో పీజీ చదివించి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించేలా శ్రీనివాస్ సహకరించాడు. ప్రస్తుతం ఆమె చెర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేస్తున్నారు. శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాల్లో చేరి తొర్రూరు జెడ్పీటీసీగా గెలుపొందారు. వీరికి ఇంజనీరింగ్ చదివే వాసే, 9వ తరగతి చదివే అమన్ సంతానం. ‘ప్రేమించడం తప్పుకాదు. నేడు దాన్ని సాధించేందుకు ఎంచుకునే మార్గాలే అభ్యంతరకరంగా ఉంటున్నా’యనేది వీరిమాట. ఒప్పించే చేసుకున్నాం మంచిర్యాలటౌన్: ‘మాది ప్రేమ వివాహమే. అయితే పెద్దల్ని ఒప్పించి చేసుకున్నాం’ అంటున్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి. ‘మాది కర్ణాటకలోని బెల్గాం జిల్లా గోకాక్ గ్రామం. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్ ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీసర్కిల్‌లో 2002లో చేరాను. అప్పుడే ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన సీవీ శంకర్‌రెడ్డి పరిచయమయ్యారు. మా ఇద్దరి భాషలు, రాష్ట్రాలు వేరు. అయినా ప్రేమ చిగురించింది. అయితే అది చదువుకు, లక్ష్యానికి అడ్డురాకూడదని నిర్ణయించుకున్నాం. 2002–03లో కోచింగ్ పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లాం. ప్రేమ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పాం. అలా పెద్దలను ఒప్పించి 2007లో పెళ్లి చేసుకున్నాం. 2009లో ఐపీఎస్‌కు, 2010లో ఐఏఎస్‌కు ఎంపికయ్యా. ఆయనకు తెలంగాణ టూరిజంలో ఉద్యోగం వచి్చంది. ప్రస్తుతం ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరక్టర్. ఇప్పుడు మాకో పాప. పేరు ఆధ్య. మా అత్తగారు నన్ను కోడలిగా కాకుండా కూతురుగా చూసుకుంటుంది. అలాంటి మంచి కుటుంబాన్ని నా భర్త అందించారు. ఒప్పించడానికి నాలుగేళ్లు.. కోదాడ: ‘ప్రేమించినంత తేలిక్కాదు తల్లిదండ్రులను ఒప్పించడం. అందుకు ఓపికుండాలి.. నమ్మివచ్చిన భాగస్వామికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. మేం ప్రేమ వివాహం చేసుకున్నాక తల్లిదండ్రులను ఒప్పించడానికి నాలుగేళ్లు పట్టింది. అందరం కలిసిపోయాం. పిల్లలతో ఆనందంగా ఉన్నా’మని చెబుతున్నారు కోదాడకు చెందిన కందుల మధు– విజయలక్ష్మి దంపతులు. ఉస్మానియా యూనివర్సిటీలో 2010లో ఎంబీఏ చదివే రోజుల్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సామాజికవర్గాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల తరువాత వీరి అన్యోన్య దాంపత్యాన్ని చూసిన ఇరుపక్షాల పెద్దలు ఇప్పుడు దగ్గరయ్యారు. నలభై ఐదేళ్ల క్రితం.. డోర్నకల్: ‘నలభై ఐదేళ్ల క్రితం.. ఇప్పటితో పోలిస్తే ఆ కాలంలో కట్టుబాట్లు ఎక్కువ. పెద్దలు కొందరు సరేనన్నారు. మరికొందరు కాదన్నారు. అయినా ధైర్యంగా పెళ్లి చేసుకుని నిలబడ్డాం’ అంటున్నారు డోర్నకల్ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన దేవకృపామణి, ఉప్పరి నారాయణ. వీరి కులమతాలు వేర్వేరు. పక్కపక్కిళ్లలో ఉండటం, ఒకే పాఠశాల, కళాశాలలో చదువుతున్న క్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటామంటే ఇరుపక్షాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పెళ్లి చేసుకుని ఒక్కటవ్వడమే కాక.. అందరినీ మెప్పించాలని ధైర్యంచేసి 1976, నవంబర్ 19న పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇరు కుటుంబాలు కలసిపోయాయి. పిల్లల్లేకున్నా ఒకరికొకరుగా జీవితం సాగిస్తున్నారు నారాయణ, కృపామణి దంపతులు. ‘ప్రస్తుతం ప్రేమ పేరుతో జరుగుతున్న హింస, పెళ్లి చేసుకోలేమనే భయంతో ప్రాణాలు తీసుకోవడం వంటి సంఘటనలు వింటుంటే బాధ కలుగుతుంది. ధైర్యంగా ముందడుగు వేస్తే అన్నీ సర్దుకుంటాయి’ అంటున్నారు వీరు. నాలుగేళ్లకు ఒప్పించాం.. మహబూబాబాద్: తమ ప్రేమ.. పెళ్లి వైపు నడిపించిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్. ‘32 ఏళ్ల క్రితం నేను వరంగల్ ఆర్ఈసీ (ప్రస్తుతం నిట్)లో చదువుకుంటున్న సమయంలో ఒక ఫెస్ట్‌లో మెడిసిన్ చదువుతున్న సీతామహాలక్ష్మి (గుంటూరు జిల్లా తెనాలి) పరిచయమైంది. అదికాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేర్వేరు. ఆమె ఇంట్లో విషయం తెలియడంతో.. మా ఇద్దరి మధ్య మాటలు బందయ్యాయి. అప్పట్లో ఇప్పటి మాదిరి సమాచార వ్యవస్థ లేదు. మా ప్రేమను కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్లం. ఇద్దరం ప్రభుత్వోద్యోగాలు సాధించి పెద్దల్ని ఒప్పిద్దామనుకుంటే అప్పుడూ నిరాకరణే ఎదురైంది. వాళ్ల అంగీకారం కోసం నాలుగేళ్లు వేచిచూశాం. అయితే, మా ప్రేమలోని నిజాయితీని తరువాత పెద్దలు గుర్తించారు. చివరకు 1994లో వారే దగ్గరుండి పెళ్లి చేశారు. నేను ఆర్అండ్బీ డీఈగా ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సీతామహాలక్ష్మి ఎంతో సహకరించింది. ఆమె డాక్టర్. సూర్యచంద్ర, తేజస్వి.. మాపిల్లలు. ప్రేమకు కులమతాలు అడ్డుకాదు. కాకపోతే, జీవితంలో స్థిరపడి, పరస్పరం నమ్మకం, భరోసా ఏర్పడ్డాకే పెళ్లి చేసుకోవాలి. తొందరపడి ప్రేమలోకి దిగి.. పెద్దల భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రేమికులను చూస్తే బాధ కలుగుతుంది’. ఒప్పించి.. మెప్పించాం కోల్‌సిటీ (రామగుండం): ‘మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే కనుక పెద్దలను ఒప్పించాలి’ అంటున్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన డాక్టర్లు మహేందర్‌కుమార్, లావణ్య. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన మహేందర్కుమార్కు, గోదావరిఖని లక్ష్మీనగర్‌కు చెందిన లావణ్యకు సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో 2006లో సీటొచి్చంది. చదువులో చురుగ్గా ఉండే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే కులాలు వేర్వేరు. మహేందర్ దాపరికం లేకుండా ఇంట్లో విషయం చెప్పి ఒప్పించాడు. లావణ్యా అలాగే చేసింది. చదువుకు తమ ప్రేమ అడ్డుకాకుండా.. ఇద్దరూ డాక్టర్లయ్యాక 2012 నవంబర్ 29న పెద్దల సమక్షంలో ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు నేటి ప్రేమల గురించి మాట్లాడుతూ– ‘ప్రేమలో పరిపక్వత ఉండాలి. పేరెంట్స్‌ను ఒప్పించి పెళ్లి చేసుకోగలమనే నమ్మకం ఉండాలి. మా కాలేజీలో దాదాపు 50 ప్రేమజంటల్ని చూశాం. కేవలం ఆరుజంటలే పెళ్లి చేసుకున్నాయి’ అని చెప్పారీ దంపతులు. మహేందర్ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, డీడీవోగా, డాక్టర్ లావణ్య జగిత్యాల జిల్లా మల్యాల పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్, డీడీవోగా పని చేస్తున్నారు. -
డ్రైవర్‌గా ఎమ్మెల్యే.. కండక్టర్‌గా ఎంపీ
మహబూబాబాద్ అర్బన్ : మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ ఆర్టీసీ డ్రైవర్ అవతారమెత్తారు. స్థానిక ఆర్టీసీ డిపోలో ఆదివారం ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కలసి మేడా రం శ్రీసమ్మక్క–సారలమ్మ జాతరకు బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ బస్సును బస్టాండ్ ఆవరణలో కొద్దిదూరం నడిపారు. ఎంపీ మాలోతు కవిత టికెట్లు ఇచ్చి ప్రయాణికులను ఉత్సాహపరిచారు. మేడారానికి వెళ్లే ప్రతీ భక్తుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సురక్షితంగా అమ్మవార్లను దర్శించుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే ఆకాంక్షించారు. -
ఎంపీ, ఎమ్మెల్యే గొడవతో అధికారికి గుండెపోటు
వరంగల్: మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయాక్ల మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరుకుంది. నూతన రిజిస్ట్రార్ కార్యాలయ ప్రారంభోత్సవంలో రభస చోటుచేసుకుంది. సోమవారం ప్రారంభోత్సవం చేయొద్దని ఎంపీ సీతారాంనాయక్ గట్టిగా వాదించారు. ప్రారంభోత్సవం సోమవారం చేసి తీరాల్సిందేనని ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్టుపట్టారు. ఎంపీ, ఎమ్మెల్యేల గొడవతో సబ్ రిజిస్ట్రార్‌కు గుండె పోటు వచ్చింది. వెంటనే అయన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
అట్టుడికిన గూడూరు
చర్చావేదిక భగ్నం ఇరువైపులా మోహరించిన టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్న పోలీసులు గూడూరు : టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో గూడూరు మం డల కేంద్రం ఆదివారం అట్టుడికింది. అవినీ తిపై చర్చకు సిద్ధమంటూ కొద్దిరోజులుగా ఇరుపార్టీల నాయకుల ప్రకటనలతో వేడెక్కుతున్న వాతావరణం చర్చకు నిర్ణయించిన 12వ తేదీన మరింత రాజుకుంది. మండ ల కేంద్రం ఇరుపార్టీల నినాదాలతో హోరెత్తింది. వారిని అదుపు చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. వివాదం మొదలైందిలా.. మండల కేంద్రంలో ఈ నెల 6 న జరిగిన కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత మానుకోట ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌పై పలు అవినీతి ఆరోపణలు చేసిన విష యం తెలిసిందే. దీంతో మరుసటి రోజు టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి భరత్కుమార్రెడ్డితోపాటు మండల నాయకులు ఎమ్మెల్యే అనుమతితో ఆమెపై ప్రతి విమర్శలు చేస్తూ పలు ఆరోపణలతో పత్రికా ప్రకటన విడుదల చేశారు. మరుసటి రోజు కాంగ్రెస్ మండల నాయకులు శంకర్‌నాయక్‌పై ఆరోపణలు నిరూపిస్తామని.. దమ్ముటే ఈ నెల 12న చర్చకు సిద్ధమా అంటూ ప్రకటించారు. దీంతో తాము చర్చకు సిద్ధమేనంటూ శనివారం స్థానిక మండల నాయకులతో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ప్రకటన ఇప్పించారు. దీంతో మండల కేంద్రంలో ఆదివారం ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదపులో ఉంచేం దుకు సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్సై అరుణ్‌కుమార్ సిబ్బందితో ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఉద్రిక్తత ఆదివారం ఉదయం నుంచి టీఆర్ఎస్, కాంగ్రె స్ కార్యాలయాల వద్ద నాయకులు, కార్యకర్తలతో సందడి నెలకొంది. ఆందోళన చేయాలని, అవసరమైతే ఘర్షణలకు సిద్ధమేనంటూ జెండాలు తొడిగిన కర్రలను రెండు పార్టీల వారు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే గూడూరుకు వస్తున్న విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు పార్టీ జెండాలతో కార్యాలయం నుంచి అంగడి మైదానానికి బయల్దేరారు. మార్గమధ్యంలో వారు కాంగ్రెస్ కార్యాలయ సమీపంలోకి చేరుకోగానే కొందరు కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు చేస్తుం డగా పోలీసులు వారిని వారించారు. వారు వెళ్లాక.. తామూ అంగడి మైదానం వెళతామం టూ నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాయిడి రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ఎం డీ ఖాసీం, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ దేషిడి మన్మో హన్‌రెడ్డి, కోమాండ్ల రమణారెడ్డి, ఇతర నాయకులు బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా బయల్దేరారు. దీంతో వారిని సీఐ వెంకటేశ్వర్రావు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపటి తర్వాత పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి లేకుండా మండల నాయకులతో తనకు చర్చేంటి అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాయిడి రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ ఎండీ ఖాసీం విలేకరులతో మాట్లాడుతూ చర్చకు సిద్ధమంటూ పోలీసుల అండతో తమను అడ్డుకోవడం ఎమ్మెల్యేకు తగదన్నారు. -
ముగ్గురిని బలిగొన్న డ్రైవర్ అత్యాశ
మహబూబాబాద్ టౌన్ : ఆటో డ్రైవర్ అత్యాశ ముగ్గురిని బలిగొంది. వారికి ఆ ప్రయూణమే వారికి ఆఖరి ప్రయూణమైంది. పరిమితికి మించి ప్రయూణికులను తరలిస్తున్న ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఆటో నుజునుజ్జుకాగా అందులో ప్రయూణిస్తున్న ముగ్గురు ప్రయూణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని కంబాలపల్లి శివారులో బుధవారం జరిగిన ఈ సంఘటన బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం... రెడ్యాల శివారు సికింద్రాబాద్ తండాకు చెందిన నారాయణ తన ఆటోలో 11 మంది ప్రయాణికులను ఎక్కించుకుని మహబూబాబాద్‌కు బయల్దేరాడు. మార్గమధ్యంలో కంబాలపల్లి వద్ద మరో ఐదుగురిని ఆటోలో ఎక్కించుకున్నాడు. పరిమితికి మించి ప్రయూణికులను ఎక్కించడంతో ఆటో కంబాలపల్లి దాటగానే అదుపుతప్పి కుడివైపునకు దూసుకుపోయి ఓ చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రెడ్యాల గ్రామశివారు కొల్లగుంటి తండాకు చెందిన హోంగార్డు బానోత్ ఈర్యా(45) అక్కడికక్కడే మృతి చెందాడు. రెడ్యాల శివారు సోమ్లాతండాకు చెందిన రైతు బానోత్ పంతుల్యా(60) మానుకోట ఏరియూ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందగా, కంబాలపల్లికి చెందిన కొల్లు రత్తమ్మ(65) ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. ఈ ఘటనలో మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. రూరల్ ఎస్సై పవన్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని కొందరిని తన వాహనంలో, మరికొందరిని వెంటనే 108లో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. హోంగార్డు కుటుంబానికి డీఎస్పీ పరామర్శ మృతుడు హోంగార్డు బానోత్ ఈర్యా టౌన్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తిస్తుండేవాడు. అతడి మృతదేహాన్ని మానుకోట డీఎస్పీ పుల్లా శోభన్‌కుమార్ సందర్శించారు. హోం గార్డు కుటుంబాన్ని ఆదుకునే విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ఆటో ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని వెల్లడించారు. మృతదేహాలను సందర్శించిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మృతదేహాలను ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ సందర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు మాచర్ల ఉప్పలయ్య, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, డోలి లింగుబాబు, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, ఎండీ ఫరీద్, తూము వెంకన్న, జెర్రిపోతుల వెంకన్న ఉన్నారు. వీధినపడ్డ హోంగార్డు కుటుంబం హోంగార్డు ఈర్యా మృతితో ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె రోడ్డునపడ్డారు. తండ్రి మృతదేహంపై పడి పిల్లలు విలపించిన తీరు చూసి అక్కడివారితోపాటు డీఎస్పీ సైతం చలించిపోయారు. మరో మృతుడు బానోత్ పంతుల్యాకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కొల్లు రత్తమ్మకు భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. క్షతగాత్రులు వీరే.. ఈ ప్రమాదంలో గూడూరు మండలం బొద్దుగొండ శివారు సురేశ్‌నగర్ తండాకు చెందిన వాంకుడోత్ రాంజీ, రెడ్యాల గ్రామశివారు సోమ్లాతండాకు చెందిన భూక్య బాసు, కంబాలపల్లి శివారు పూరీ తండాకు చెందిన కొర్ర సునీల్, రెడ్యాల శివారు వెంకట్‌రెడ్డిపల్లికి చెందిన కళ్లెం ఉపేంద్రమ్మ, కంబాలపల్లికి చెందిన యానాల భాగ్యమ్మ, యానాల మైథిలీ, యానాల భవ్య, బొద్దుగొండ శివారు ఎర్రగుంటతండాకు చెందిన వాంకుడోత్ వెంకటేశ్, కంబాలపల్లికి చెందిన పెద్ది భద్రమ్మ, రెడ్యాల శివారు సోమ్లాతండాకు చెందిన భూక్య లలిత, భూక్య వెన్నెల, భూక్య సోమ్లా, బానోత్ మదన్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా డ్రైవర్ నారాయణ పరారీలో ఉన్నట్లు తెలిసింది.