
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళపై పాలకులు ఇంత నీచంగా మాట్లాడిస్తారా అంటూ మండిపడ్డారు.
ఇక, వైఎస్ షర్మిల ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్‌ఎస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వం అణిచివేత ధోరణితో వ్యవహరిస్తోంది. బీఆర్‌ఎస్ నేతల అక్రమాలను ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. ఒక మహిళపై పాలకులు ఇంత నీచంగా మాట్లాడిస్తారా?. ప్రశ్నినందుకు శంకర్ నాయక్ దాడికి ప్లాన్ చేశాడు. కనిపించిన భూములన్నీ కబ్జా చేస్తున్నారు. శంకర్ నాయక్ ఆగడాలను ప్రజలు గమనించాలి. పాలకపక్షం కుట్రతోనే పాదయాత్రను అడ్డుకుంది’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment