
బస్సులో సందడి చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ
మహబూబాబాద్ అర్బన్ : మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ ఆర్టీసీ డ్రైవర్ అవతారమెత్తారు. స్థానిక ఆర్టీసీ డిపోలో ఆదివారం ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కలసి మేడా రం శ్రీసమ్మక్క–సారలమ్మ జాతరకు బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ బస్సును బస్టాండ్ ఆవరణలో కొద్దిదూరం నడిపారు. ఎంపీ మాలోతు కవిత టికెట్లు ఇచ్చి ప్రయాణికులను ఉత్సాహపరిచారు. మేడారానికి వెళ్లే ప్రతీ భక్తుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సురక్షితంగా అమ్మవార్లను దర్శించుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే ఆకాంక్షించారు.