Mahabubabad Assembly Constituency
-
మరోసారి పీఠమెక్కేదెవరో..?
సాక్షి, మహబూబాబాద్: మానుకోట పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు గతంలో ఎంపీగా గెలిచిన వారే. ఇందులో ఏ ఇద్దరిని చూసినా ఒకే పార్టీలో పనిచేసిన పరిచయాలు ఉన్నాయి. గతంలో పనిచేసిన అనుభవానికి.. ప్రస్తుత పార్టీల చరిష్మాతో ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ముగ్గురు సమర్థులే కావడంతో.. ఎంపీ పీఠం మళ్లీ ఎవరికి దక్కుతుందో అనేది పార్లమెంట్ పరిధిలో చర్చగా మారింది.ముగ్గురు ముగ్గురే..2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన బలరాంనాయక్ సమీప అభ్యర్థి కుంజ శ్రీనివాసరావుపై 68,957ఓట్ల మెజార్టీతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టారు. కేంద్ర కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన సీతారాంనాయక్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్‌పై 34,992 ఓట్ల మెజార్టీతో గెలిచారు.ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాలోత్ కవిత బలరాంనాయక్‌పై 1,46,663ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు అదే పార్టీ నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఇందులో కవిత, సీతారాంనాయక్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందగా.. వారిద్దరి చేతిలో బలరాంనాయక్ ఓటమిపాలవ్వడం గమనార్హం.ఒకరి ఓట్లకు మరొకరు గాలం..మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పాత వారే కావడంతో.. వారు పోటీ చేస్తున్న పార్టీతో పాటు.. ఇతర పార్టీల్లోని ఓటర్లకు గాల వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న కవిత.. 2009లో కాంగ్రెస్ నుంచి మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ నాయకుడు శంకర్‌నాయక్ చేతిలో ఓడిపోయారు. తర్వాత కవిత బీఆర్ఎస్లో చేరి ఎంపీగా గెలిచారు.కాగా మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు కవితకు మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కవిత వర్గీయుల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ప్రస్తుతం ఆమె పోటీలో ఉండడంతో కాంగ్రెస్ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన రెడ్యానాయక్‌కు కవిత కూతురు కావడం.. ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులతో ఉన్న పాత పరిచయాలు కూడా ఇప్పుడు కవితకు ఓటు బ్యాంకుగా మారే అవకాశం లేకపోలేదు.అదేవిధంగా ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సీతారాంనాయక్ తెలంగాణ ఉద్యమకారుడిగా.. గిరిజన సామాజిక వర్గం నుంచి మేధావిగా గుర్తింపు పొందారు. ఈమేరకు 2014లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. కాగా ఎన్నికల వరకు బీఆర్ఎస్లో ఉన్న సీతారాంనాయక్‌కు మానుకోట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిచయాలు ఉన్నారు. ఇప్పుడు ఆయన వారి వద్దకు వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరుతూ.. బీఆర్ఎస్ ఓట్లకు గండి పెడుతున్నారు. ఇక బలరాంనాయక్‌కు అధికార పార్టీ ఎమ్మెల్యేలే అతిపెద్ద బలం.ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఆయన గెలుపును ఎమ్మెల్యేలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చే మెజార్టీతోనే అధినాయకుడి వద్ద మార్కులు పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఓటర్లతోపాటు.. బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఆ పార్టీ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇలా ముగ్గురు అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల ఓట్లను చీల్చే అవకాశం ఉంది. -
బీఆర్ఎస్ను దరిదాపుల్లోకి కూడా రానివ్వం: మోదీ
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో బీజేపీ కొత్త చరిత్ర లిఖించబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పబోతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీర్ఆఎస్ తెలంగాణను నాశనం చేశాయని ధ్వజమెత్తారు. మహబూబాబాద్‌లో బీజేపీ బహరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. తెలంగాణకు తర్వాతి సీఎం బీజేపీ నుంచి రాబోతున్నారని తెలిపారు. తెలంగాణ తొలి బీజేపీ సీఎం.. బీసీకి చెందిన వ్యక్తి ఉంటారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ మంత్రి వర్గంలో అన్నీ వర్గాలకు స్థానం ఉంటుందన్నారు. బీజేపీతో ఎలాగైనా దోస్తీ చేయాలని కేసీఆర్ ఢిల్లీకి వచ్చారన్నారు ప్రధాని మోదీ. తాను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉండదలుచుకోలేదని చెప్పారు. ఎన్డీఏలో చేర్చుకోవట్లేదని బీఆర్ఎస్ నేతలు తనను తిట్టడం మొదలు పెట్టారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ను తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వమని.. ఇది మోదీ ఇచ్చే గ్యారంటీనన్నారు. తెలంగాణకు ఫాంహౌజ్ సీఎం అవసరం లేదని ప్రధాని మోదీ విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ మూఢనమ్మకాల రాష్ట్రంగా మార్చారని.. మూఢ నమ్మకాలతో సచివాలయాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేసిన స్కామ్‌లన్నింటిపైనా దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. స్కామ్ చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. బీఆర్ఎస్లో స్కామ్‌లు చేసిన వారిని జైలుకు పంపిస్తామన్నారు. ల్యాండ్, లిక్కర్, పేపర్ లీక్ మాఫియాలను జైలుకు పంపిస్తామని తెలిపారు. అణగారిన వర్గాలకు సంక్షేమం అందిస్తుంది బీజేపీనేనన్న మోదీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ, దళితులను మోసం చేసిందని దుయ్యబట్టారు. చదవండి: మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు: సచిన్ పైలట్ -
మహబూబాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీఆర్ఎస్ నేతలు
-
Mahabubabad: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్? ఈసారి ఉత్కంఠ!
అధికార పార్టీలో అసమ్మతి... వర్గ విభేదాలు... స్వార్థ రాజకీయాలు... మండల గ్రామస్థాయిలో అసంతృప్తుల విభేదాలు.. కీలకమైన నేతలు ఉండడంతో పార్టీకి తలవొంపులు తెచ్చే విధంగా ప్రవర్తించడం...గత పది సంవత్సరాల పాలనలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. ఎన్నికలను ప్రభావితం చేసే కీలకమైన అంశాలు: స్థానిక సంస్థల ప్రజా ప్రతి నిధులలో ఎంపిటిసిలు , సర్పంచుల అసంతృప్తి...దళిత బంధు లబ్ధిదారుల ఎంపికపై నిరాశ... డబల్ బెడ్ రూమ్...రైతు రుణమాఫీ.. ధరణి పోర్టల్ , పోడు భూముల పట్టాల పంపిణీలో గిరిజనేతరుల అసంతృప్తి ... గ్రామాలు , పట్టణాల అభివృద్ధి పై ప్రజల భిన్న అభిప్రాయాలు. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు: కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రం కావడంతో శరవేగంగా అభివృద్ది చెందుతుంది. ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేయగా ఈ సంవత్సరం నుంచి తరగతులు సైతం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలను సైతం మంజూరు చేసింది. హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఉంది 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అభ్యర్థులు : బీఆర్ఎస్ బానోత్ శంకర్ నాయక్ (కన్ఫాం) కాంగ్రెస్ : (ఆశవాహులు) బలరాం నాయక్ (మాజీ మంత్రి) మాజీ మంత్రి(TPCC నేత) డాక్టర్ మురళి నాయక్, నూనావత్ రాధా బీజేపీ : (ఆశవాహులు) యాప సీతయ్య జాటోత్ హుస్సేన్ నాయక్ వృత్తిపరంగా ఓటర్లు రైతులు కూలీలు ఎక్కువగా ఉంటారు. మతం కులం ఓటర్లు: ఎస్టి 95000 BC:76000 SC:32000 మైనార్టీ :16 ఓసి :14 నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు: మానుకోటగా పేరొందిన నియోజకవర్గంలో దట్టమైన అడవులు కొండలు గుట్టలు ఉన్నాయి.. ఆలయాలు అనంతరం టెంపుల్.. పర్యటక ప్రాంతం.. గూడూరు మండలం లోని గూడూరు జలపాతం -
మహబూబాబాద్ (ఎస్టి) నియోజకవర్గం గతంలో గెలిచిన అభ్యర్థులు వీరే..మరి ఇప్పుడు..?
మహబూబాబాద్ (ఎస్టి) నియోజకవర్గం మహబూబాబాద్ గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన శంకర్ నాయక్ రెండోసారి విజయం సాదించారు. ఈయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, కేంద్ర మాజీ మంత్రి బలరామ్ నాయక్ పై 13534 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. శంకర్ నాయక్ కు 85397 ఓట్లు రాగా, బలరాం నాయక్ కు 71863 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జె.హుస్సేన్ నాయక్ కు 11600 పైగా ఓట్లు వచ్చాయి. 2014లో మహబూబాబాద్ గిరిజన నియోజకవర్గంలో శంకర్ నాయక్ కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాలోతు కవిత ను 9315 ఓట్ల తేడాతో ఓడిరచారు. కవిత మాజీ మంత్రి రెడ్యా నాయక్ కుమార్తె. తెలంగాణ ఉద్యమ ప్రభావం ఈ నియోజకవర్గంలో ఉండి కవిత ఓడిపోతే, ఈమె తండ్రి రెడ్యా నాయక్ డోర్నకల్ నుంచి కాంగ్రెస్ ఐ పక్షాన గెలుపొందడం విశేషం. ఆ తర్వాత ఇద్దరూ టిఆర్ఎస్లో చేరిపోయారు. కవిత 2019 ఎన్నికలలో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009 నుంచి మహబూబాబాద్ నియోజకవర్గం గిరిజనులకు రిజర్వు అయింది. మహబూబాబాద్‌లో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, టిడిపి రెండుసార్లు, సిపిఐ రెండుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు, ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు పిడిఎఫ్, ఎస్.పి.ఎఫ్ చెరోసీటు గెలుచుకున్నాయి. 1972 నుంచి 1989 వరకు వరుసగా ఐదుసార్లు జన్నారెడ్డి జనార్థనరెడ్డి గెలుపొందారు. 2004లో ఇక్కడ గెలిచిన టిడిపి నేత వి.నరేందర్‌రెడ్డి ఈ నియోజకవర్గం 2009లో రిజర్వు కావడం వల్ల పోటీచేయ లేకపోయారు. మహబూబాబాద్‌లో ఆరుసార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, మూడుసార్లు బ్రాహ్మణ,ఒకసారి ఎస్.సి, ఒకసారి ఇతరులు గెలుపొందారు. మహబూబాబాద్ (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..