కరీంనగర్: జిల్లా హౌసింగ్బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఇంట్లో నిల్వఉంచిన జిలెటిన్ స్టిక్స్ సంబంధిత రసాయన పదార్థాలతో బొమ్మలను తయారు చేస్తున్న క్రమంలో ఈ పేలుడు ఘటన సంభవించినట్టు తెలుస్తోంది. కాగా, గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.