Gelatin sticks
-
జిలెటిన్ స్టిక్స్ పేల్చి వీఆర్ఏ దారుణ హత్య
వేముల : వైఎస్సార్ జిల్లా వి.కొత్తపల్లెలో వీఆర్ఏ యలంకూరి నరసింహులు(49)ను జిలెటిన్ స్టిక్స్‌తో పేల్చి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. మృతుడి భార్య సుబ్బలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు.. గ్రామంలో నరసింహులు వీఆర్ఏగా విధులు నిర్వహిస్తూ ముగ్గురాయి మైనింగ్‌లో కూలీ పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో నరసింహులు భార్య సుబ్బలక్ష్మితో అదే గ్రామానికి చెందిన బాబు సన్నిహితంగా ఉండేవాడు.ఈ విషయంపై నరసింహులు, బాబు తరచూ గొడవపడేవారు. ఆదివారం రాత్రి ఎప్పటిలాగే భోజనం చేసి ఇంటి ముందు రేకుల షెడ్డులో చెరో మంచంలో నరసింహులు, భార్య సుబ్బలక్ష్మి పడుకున్నారు. నరసింహులుపై కక్ష పెంచుకున్న బాబు.. ఎలాగైనా హత్య చేయాలని పథకం రచించాడు. ఆదివారం రాత్రి జెలిటిన్ స్టిక్స్‌కు వైరు అమర్చి నరసింహులు ఇంటి ముందు ఉన్న పాడుబడ్డ ఇంట్లోంచి పేల్చి వేశాడు. పేలుడు ధాటికి నరసింహులు పైకి ఎగిరి రేకులకు తగిలి కిందపడ్డాడు.పేలుడుకు సుబ్బలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వేంపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరసింహులు మృతి చెందాడు. సుబ్బలక్ష్మిని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, ఆర్కే వ్యాలీ సీఐ నాగరాజు, రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, వేంపల్లె ఎస్ఐ తిరుపాల్ నాయక్‌లతో కలిసి ఆదివారం రాత్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. మృతుడి కుమారుడు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
వరంగల్‌లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
వరంగల్: బాంబులతో వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల కూల్చివేత జరుగుతుండగా.. బాంబుల మోతతో నగరం దద్దరిల్లింది. పెద్ద శబ్దాలకు చుట్టుపక్క ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిన్న తప్పిదం జరిగినా భారీ నష్టం వాటిళ్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఉండటం గమనార్హం.ఇక.. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల తొలగింపు పనులు చకచకా సాగుతున్నాయి. రూ.70 కోట్లతో అధునాతన బహుళ అంతస్తుల బస్‌స్టేషన్ నిర్మాణంలో భాగంగా సిటీ బస్‌స్టేషన్‌ను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత బాంబుల (జిలెటిన్ స్టిక్స్)తో భవనాలను కూల్చి వేశారు. పురాతన భవనాలు దృఢంగా ఉండటంతో ఎక్స్కవేటర్లతో కూల్చడం సాధ్యం కాకపోవడంతో, కూల్చివేతలకు పేలుడు పదార్థాలు ఉపయోగించారు. -
1,300 కిలోల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ రూరల్ : పోలీసులు 1300 కిలోల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారయ్యారు. బుధవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాంనాథ్ కేకన్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. మరిపెడ ఎస్సై తాహేర్ బాబా ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వీరారం క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులను గమనించిన బొలెరో వాహన డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చి వెంటనే వాహనం ఆపి తనిఖీ చేయ గా, అందులో బాక్సులు కనిపించాయి. అందులో పేలుడు పదార్థాలకు సంబంధించిన జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు లభించాయి. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట గ్రామానికి చెందిన కస్తూరి కుమార్, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం దంటకుంట తండాకు చెందిన బాదావత్ కిశోర్‌లను అదుపులోకి తీసుకున్నారు. కుమార్‌కు వెంకటరమణ ఎంటర్ ప్రైజెస్ పేరు మీద లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ ప్రకారం కేవలం నిర్ణీత పరిధిలో మాత్రమే పేలుడు పదార్థాలను అమ్ముకోవాలి. కానీ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమంగా పేలుడు పదార్థాలను అనుమతి లేని వారికి అమ్ముతూ పట్టుబడ్డారు. కాగా, ఈ ఘటనలో జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట కస్తూరి సారయ్య పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, తొర్రూరు డీఎస్పీ సురేష్, మరిపెడ సీఐ హతీరాం, ఎస్సై తాహేర్ బాబా, పోలీసు సిబ్బంది క్రాంతికుమార్, వెంకన్న పాల్గొన్నారు. -
‘ప్రదీప్ శర్మకు నా భర్త కలెక్షన్ ఏజెంట్’
ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద కలకలం సృష్టించిన పేలుడు పదార్థాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ).. మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర్మను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ మహిళ ఎన్ఐఏ అధికారుల వద్దకు వచ్చి తన భర్త ప్రదీప్ శర్మకు కలెక్షన్ ఏజెంట్‌గా పని చేసేవాడని తెలిపింది. గుంజన్ సింగ్(30) అనే మహిళ తన భర్త అనీల్ సింగ్ ప్రదీప్ శర్మకు సంబంధించిన అసాంఘిక కార్యకలపాల్లో పాలు పంచుకునేవాడని.. అతడికి కలెక్షన్ ఏజెంట్‌గా పని చేసేవాడని ఆరోపించింది. ఈ సందర్భంగా గుంజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘పెళ్లైన నాటి నుంచి నా భర్త తనకు పోలీసులతో మంచి సంబంధాలున్నాయని చెప్పి నన్ను పలుమార్లు బెదిరించాడు. పరంవీర్ సింగ్ కోసం పని చేసిన ప్రదీప్ శర్మ, బచ్చి సింగ్‌తో తనకు మంచి సంబంధాలున్నాయనేవాడు. అంతేకాక వారికి సంబంధించిన అక్రమ నగదు లావాదేవీలను నా భర్త చూసుకునేవాడు. ఓసారి ఏకంగా నా తలకు తుపాకీ గురి పెట్టి నన్ను బెదిరించాడు. పోలీసులతో అతడికి ఉన్న సంబంధాల వల్లే నా భర్త ఇంతకు తెగించి ఉంటాడని నేను భావిస్తున్నాను’’ అని తెలిపింది. ఇప్పటికే గుజన్ తన భర్త మీద ఓ సారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కలకలం కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ గురువారం ప్రదీప్ శర్మను అదుపులోకి తీసుకుని ఆరు గంటలపాటు విచారించింది. సచిన్ వాజేకు చెందిన ఆధారాలను నాశనం చేసేందుకు ప్రదీప్ ఆయనకు తోడ్పడినట్లు అధికారులు చెబుతున్నారు. కారుబాంబు వ్యవహారానికి ముందు జరిగిన ప్రణాళికా సమావేశంలో ప్రదీప్ కూడా పాల్గొన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది. అంబానీ ఇంటి ఎదుట బాంబు దొరికిన రెండు రోజుల తర్వాత విచారణలో భాగంగా ఎన్ఐఏ ప్రదీప్ శర్మను కూడా ప్రశ్నించింది. 1983 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ శర్మ దాదాపు 100 మంది నేరస్తులను ఎన్కౌంటర్ చేశారు చదవండి: మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ అరెస్టు -
వైఎస్ఆర్ జిల్లా మామిళ్లపల్లె శివారులో పేలుడు
-
ముఖేశ్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలు
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించింది. దక్షిణ ముంబైలోని ముఖేష్ నివాసం యాంటీలియా సమీపంలోనే గురువారం సాయంత్రం స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. యాంటీలియా సెక్యూరిటీ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఈ వాహనంలో జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 20 జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు తేలిందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పేలుడు పదార్థాలు ఉన్న స్కార్పియోను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. దాని యజమాని ఎవరు? అందులో పేలుడు పదార్థాలు పెట్టిందెవరు? ఎందుకోసం పెట్టారు? అనేది తేల్చేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం
-
తిరుమలలో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల కలకలం
సాక్షి, తిరుమల: పేలుళ్లకు వాడే నిషేధిత జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు తిరుమలలో కలకలం రేపాయి. తిరుమలలో 24 జిలెటిన్ స్టిక్స్, మరో 38 డిటోనేటర్ల సంచిని స్వాధీనం చేసుకున్నట్లు టీటీడీ సీవీఎస్వో ఆకే రవికృష్ణ ఆదివారం మీడియాకు వెల్లడించారు. వీటిని కొండలు, బండలు పేల్చే క్వారీల్లో వాడుతుంటారు. వీటిని తిరుమలలో వాడకూడదని టీటీడీ నిబంధనలు విధించింది. అయినప్పటికీ పాపవినాశనం మార్గంలో నిర్మాణంలో ఉన్న మూడోదశ తిరువేంకటపథం రింగ్‌రోడ్డు నిర్మాణంలో వీటిని వాడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో టీటీడీ సీవీఎస్వో ఆదేశాల మేరకు విజిలెన్స్ వింగ్ విభాగం ఏవీఎస్వో శ్రీనాథరెడ్డి, వీఐ లక్ష్మీకాంత్, సిబ్బంది బృందం నిఘా పెట్టింది. ఆదివారం రింగ్‌రోడ్డు ప్రాంతంలోని కొండమీద జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు గుర్తించిన సిబ్బంది స్వాధీనం చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు రవికృష్ణ తెలిపారు. -
కొంచెమే ధ్వంసమైంది
- రాజధానిలో అక్రమ నిర్మాణం కూల్చివేతకు జీహెచ్ఎంసీ విఫలయత్నం - ఉన్నచోటే కుప్పకూల్చేందుకు ‘ఇంప్లోజన్’ పద్ధతిన ప్రయోగం - పిల్లర్లకు రంధ్రాలు చేసి జిలెటిన్ స్టిక్స్‌తో కూల్చే యత్నం - కూలింది గ్రౌండ్ ఫ్లోరే... మిగతా నాలుగంతస్తులు పక్కకొరిగిన వైనం సాక్షి, హైదరాబాద్: రాజధానిలో అక్రమంగా చేపట్టిన ఓ ఐదంతస్తుల భవన నిర్మాణాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం (ఇంప్లోజన్) సాయంతో కూల్చేందుకు జీహెచ్ఎంసీ తొలిసారిగా చేసిన ప్రయత్నం పాక్షికంగానే ఫలించింది. మొత్తం నిర్మాణాన్ని రెండు మూడు నిమిషాల్లో ఉన్నచోటే కుప్పకూలుస్తామని ప్రకటించడంతో, భవనమంతా పేకమేడలా కూలుతుందనే ప్రచారం జరిగింది. కానీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మూడింటిదాకా ఏడు గంటలపాటు ప్రయత్నించినా నిర్మాణం పాక్షికంగానే కూలింది. గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా, మొదటి అంతస్తులో పిల్లర్ల వరకు మాత్రం కూలడంతో మిగతా అంతస్తులన్నీ ఒకవైపు దిగబడి మొత్తం నిర్మాణం ప్రమాదకరంగా మారింది. దీనిపై నగర మేయర్ బొంతు రామ్మోహన్ స్పందిస్తూ, ఇంప్లోజన్ పద్ధతిన కూల్చివేతను పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే చేపట్టామని చెప్పారు. పైలట్‌గా మరో రెండు 3 భవనాలను ఈ పద్ధతిన కూల్చాక పూర్తి స్థాయి కూల్చివేతలు జరుగుతాయన్నారు. ఏడు గంటల ఉత్కంఠ.. మాదాపూర్‌లోని సున్నం చెరువు బఫర్ జోన్లో సియట్ కాలనీ ప్లాట్ నెంబర్ 22లో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన జగన్మోహన్రెడ్డి ఐదంతస్తులతో భారీ భవనాన్ని నిర్మిస్తున్నాడు. జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టడంతో దీన్నిప్పటికే రెండుసార్లు పాక్షికంగా కూల్చేశారు. అయినా నిర్మాణపు పనులు ఆపలేదు. దాంతో నిర్మాణాన్ని పూర్తిగా నేలమట్టం చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయిం చింది. అక్రమ నిర్మాణాలను త్వరితగతిన కూల్చేసేందుకు ఇంప్లోజన్ విధానాన్ని అవలంబించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్న నేపథ్యంలో ఉత్తమ్ బ్లాస్టెక్ సంస్థ అందుకు ముందుకొచ్చింది. జరిగిందిదీ... కూల్చివేతకు సోమవారం ముహూర్తంగా నిర్ణయించారు. పోలీస్ బందోబస్తుతో ఉదయం ఎనిమిదింటికే రంగంలోకి దిగారు. భవనానికి మొత్తం 18 పిల్లర్లుండగా గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తుల్లోని 12 పిల్లర్లకు రంధ్రాలు చేసి మధ్యాహ్నం రెండింటిదాకా వాటిలో 60 జిలిటెన్ స్టిక్స్ (డిటోనేటర్లు) అమర్చారు. అనంతరం బొంతు, చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి, వెస్ట్ జోనల్ కమిషనర్ బి.వి.గంగాధర్‌రెడ్డి సమక్షంలో మధ్యాహ్నం 2.53కు భవనాన్ని పేల్చివేశారు. పెద్ద శబ్దంతో పాటు పరిసరాల్లో పూర్తిగా దుమ్ము అలముకుంది. కానీ పొరుగునున్న మరో భవనానికి ముప్పు తప్పించేందుకు ఒకవైపు పిల్లర్లలో జిలెటిన్లు అమర్చలేదు. దాంతో గ్రౌండ్ ఫ్లోర్‌లోని పిల్లర్లే పూర్తిగా ధ్వంసమయ్యాయి. తొలి అంతస్తులో పిల్లర్లు విరిగినా శ్లాబ్ అలాగే ఉండటంతో భవనం నిలువుగా నేలమట్టం కావడానికి బదులుగా ఒకవైపు కుంగి ప్రమాదకరంగా మారింది. మిగతా 4 అంతస్తులను జేసీబీలు, కూలీల సాయంతో తొలగించాలి. పొరుగు భవనానికి అన్ని అనుమతులూ ఉన్నందున దానికి నష్టం వాటిల్లొద్దనే అదున్నవైపు జిలెటిన్లు పెట్టలేదని అధికారులంటున్నారు. అయితే ఆ భవనమూ బఫర్ జోన్లోనే ఉండటం విశేషం! దానికి అనుమతులెలా ఇచ్చారని ప్రశ్నించగా, అది బఫర్‌జోన్‌లో ఉందని ఇప్పుడే తెలిసిందన్నా రు! అందులోని వారినీ ఖాళీ చేయిస్తా మన్నారు. ఇంతా చేసి, కూల్చేసిన భవనం ఎవరిదో చెప్పడానికి కూడా అధికారులు వెనకాముందాడారు! ‘‘యజమాని ఎవరో మాకు తెలియదు. నిర్మాణం అక్రమం గనుక కూల్చేస్తున్నాం’’ అంటూ సరిపెట్టారు!! పొరుగు భవనాలకు ఇబ్బంది ఉండదు పాక్షికంగా కూలిన ఈ నిర్మాణాన్ని రెండు మూడు రోజుల్లో మొత్తం నేలమట్టం చేస్తాం. ఇంప్లోజన్ ద్వారా కూల్చేస్తే పక్క భవనాలకు ఏ నష్టమూ ఉండదు. గత మూడేళ్లలో అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్, భుజ్ తదితర పట్టణాల్లో ఇలాగే పలు భవనాలు, పారిశ్రామిక నిర్మాణాలను కూల్చేశాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ప్రయత్నం ఇదే తొలిసారి. – వి.శ్రీకాంత్, ఉత్తమ్ బ్లాస్టెక్ ఎండీ అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకే.. అక్రమ నిర్మాణాలను తక్కువ ఖర్చుతో కూల్చేందుకే ఆధు నిక పరిజ్ఞానం వైపు వెళ్లాం. 75% విజయవంతమయ్యాం. నగరంలో మిగతా జోన్లలో ఇదే తరహా కూల్చివేతలుం టాయి. ఈ విధానాన్ని సాంకేతిక నిపుణు లతో అధ్యయనం చేయిస్తాం. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తాం. నాలాలపై అక్రమ భవనాల కూల్చివేతకూ ఇంప్లోజన్ విధానాన్ని పరిశీలిస్తాం. – బొంతు రామ్మోహన్,జీహెచ్ఎంసీ మేయర్ -
సీఎం పర్యటనలో కలకలం
-బుక్కపట్నంలో చంద్రబాబు టూర్ -200 జిలెటిన్ స్టిక్స్ లభ్యం అనంతపురం: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కలకలం రేగింది. పుట్టపర్తి-బుక్కపట్నం రోడ్డు మార్గంలో సుమారు 200 జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు బుధవారం గుర్తించారు. చంద్రబాబు బుక్కపట్నంలో జరగనున్న జన్మభూమి కార్యక్రమంలో బుధవారం పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డు మార్గంలో బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టినపుడు ఈ జిలెటిన్ స్టిక్స్ బయటపడ్డాయి. జిలెటిన్ స్టిక్స్ హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పేలుళ్లకు ఉపయోగించేందుకు తెచ్చి ఉంటారని, మిగిలిపోయినవి పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాలం చెల్లిన జిలెటిన్ స్టిక్స్ కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
క్వారీలో పేలుడు..మహిళ మృతి
కొడకండ్ల మండలం రామవరం గాయత్రి క్వారీలో ఆదివారం పేలుడు సంభవించింది. ఇద్దరు దంపతులు క్వారీలో రాళ్లకు డ్రిల్లింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో కుంచం సుజాత(30) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. బండరాళ్ల మధ్య ఉంచిన పాత జిలెటిన్ స్టిక్స్ పేలి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరి స్వస్థలం నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచాడు గ్రామం. కూలీ పనుల నిమిత్తం అక్కడకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేలిన జిలెటిన్‌స్టిక్స్..ఒకరి మృతి
జగిత్యాల: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం మోతె గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బండరాళ్ల మధ్య పెట్టిన జిలెటిన్‌స్టిక్స్ అకస్మాత్తుగా పేలి శ్రీనివాస్(25) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా..అశోక్(30) అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన అశోక్‌ను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి స్వస్థలం ధర్మపురి మండలం చిన్నాపూర్ గ్రామం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తుంగతుర్తిలో పేలుడు పదార్ధాలు స్వాధీనం
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి, రావులపల్లిలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 858 జెలెటిన్ స్టిక్స్, 915 ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నుంచి సరఫరా జరిగినట్లు సమాచారం. -
పాల్వంచలో జిలిటెన్ స్టిక్స్ లభ్యం
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలో సోమవారం పోలీసులు జిలిటెన్ స్టిక్స్‌ను గుర్తించారు. మండల కేంద్రంలో లక్ష్మీదేవిపల్లి డిగ్రీ కాలేజీ ఎదుట ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు కింద 8 జిలిటెన్ స్టిక్స్‌ను పోలీసులు కనుగొన్నారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో మావోయిస్ట్‌లే ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జిలిటెన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
25 జిలెటిన్ బాక్సులు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్
తిరుపతి: నగరి మండలం రామాపురంలో గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు ఉన్నట్టు అందిన సమాచారం మేరకు ఓ ఇంట్లో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో నిల్వ ఉంచిన 25 జిలెటిన్ బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
కరీంనగర్లో భారీ పేలుడు : ఇద్దరు మృతి
-
కరీంనగర్లో జిలెటిన్ స్టిక్స్ పేలి ఇద్దరు మృతి
కరీంనగర్: జిల్లా హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఇంట్లో నిల్వఉంచిన జిలెటిన్ స్టిక్స్ సంబంధిత రసాయన పదార్థాలతో బొమ్మలను తయారు చేస్తున్న క్రమంలో ఈ పేలుడు ఘటన సంభవించినట్టు తెలుస్తోంది. కాగా, గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
జిలెటిన్‌స్టిక్స్ పేలి యువకుడు మృతి
కైకొండాయిగూడెం (ఖమ్మం రూరల్): జిలెటిన్ స్టిక్స్ పేలిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి పంచాయతీలోని యల్లన్న నగర్‌కు చెందిన గండికోట సారయ్య, గండికోట లింగయ్య, ఆల కుంట ఉపేందర్ కలిసి మూడు రోజుల కిందట కైకొండాయిగూడెంలోని యల మద్ది నరేందర్ అనే క్వారీ లీజుదారుడి వద్ద రాళ్లు పగలగొట్టే పనికి కుదిరారు. వీరు ముగ్గురూ బుధవారం రాత్రి కంకర క్వారీలో పెద్ద పెద్ద బండరాళ్ళను పగలగొట్టేందుకు జిలెటిన్ స్టిక్స్ పేల్చారు. చిన్న బండరాళ్ళను పేల్చేం దుకు గురువారం తెల్లవారుజామున జిలెటిన్ స్టిక్స్ అమర్చుతున్నారు. ఈ క్రమంలో, అవి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలడంతో గండికోట సారయ్య(30) అక్కడికక్కడే మృతి చెందాడు. పేలుడుతో భీతిల్లిన గంటికోట లింగయ్య, ఆలకుంట ఉపేం దర్ అక్కడి నుంచి పారిపోయారు. దసరా పండుగకు డబ్బులు తెస్తానని... ఒకవైపు వ్యవసాయం కలిసిరావడం లేదు. మరోవైపు చేసేందుకు పనేమీ లేదు. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. ఏదో ఒక పని చేయకపోతే కష్టమనుకున్న సారయ్య, మరో ఇద్దరితో కలిసి ఈ పనికి కుదిరాడు. ‘‘దసరా పండుగ వరకైనా ఎంతోకొంత సంపాదిస్తే.. ఖర్చులకు, కొత్త బట్టలకు పనికొస్తాయని వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నాకూ, నా ఇద్దరు ఆడపిల్లలకు దిక్కెవరు..?’’ అంటూ, సారయ్య భార్య లక్ష్మి గండెలవిసేలా రోదిస్తోంది. జిలెటిన్ స్టిక్స్ పేల్చివేతకు అనుమతి లేదు కైకొండాయిగూడెంలోని కంకర కొట్టే క్వారీకి ఎలాంటి అనుమతులు లేవని మైనింగ్ ఏజీ లక్ష్మిప్రసాద్, తహశీల్దార్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. యలమద్ది నరేందర్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండానే కైకొండాయిగూడెంలోని తెల్ల రాయి గుట్టలున్న భూమిని లీజుకు తీసుకున్నాడని చెప్పారు. సంఘటన స్థలాన్ని రూరల్ ఎస్ఐ రవీందర్ పరిశీలించి వివరాలు సేకరించారు. సారయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గండికోట బాబు ఫిర్యాదుతో క్వారీ లీజుదారుడు యలమద్ది నరేందర్‌తోపాటు పనికి కుదిరిన ఆలకుంట ఉపేందర్, గండికోట లింగయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
చిత్తూరు జిల్లాలో పేలుడు పదార్థాలు స్వాధీనం
చిత్తూరు : చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం వరిగపల్లిలో పోలీసుల తనిఖీల్లో భారీగా మందుగుండు బయటపడింది. ఓ ప్రాంతంలో రహస్యంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్ధాలను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. 600 జిలెటిన్ స్టిక్స్, 5 బస్తాల నల్లమందు, 70 బస్తాల అమ్మోనియం నైట్రేట్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.