
సాక్షి, కొడకండ్ల : జనగామ జిల్లా కొడకండ్లలో కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని దుండగులు వైన్స్ షాప్ సిబ్బందిని తుపాకితో బెదిరించి రూ. 6.70లక్షల నగదును లాక్కెళ్లారు. మంగళవారం రాత్రి వైన్స్ షాప్ మూసివేసి ఇంటికి వెళ్తున్న షాపు యజమానులను దుండగులు అడ్డగించారు. తుపాకితో గాల్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపి వారి వద్ద నుంచి 6.70లక్షల రూపాయాలను ఎత్తుఎళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.