thugs attack
-
సీతానగరం ఘటనలో మృగాళ్ల గుర్తింపు
తాడేపల్లి రూరల్/గుంటూరు ఈస్ట్: ప్రేమికుడి కాళ్లు, చేతుల్ని కట్టేసి.. కదిలితే పీక కోస్తామని బెదిరించి.. అతడి కళ్లెదుటే నర్సింగ్ విద్యార్థినిపై అకృత్యానికి తెగబడిన మృగాళ్లు ఎవరనేది పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితులు షేర్ కృష్ణ, వెంకటేష్‌లను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలు అన్వేషిస్తున్నాయి. ఈ నెల 19న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కర ఘాట్ సమీపంలో కృష్ణా నది ఒడ్డున ప్రేమ జంటపై ఇద్దరు దుండగులు దాడి చేసి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన విషయం విదితమే. విజయవాడ గాంధీనగర్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న యువకుడు, ఓ నర్సింగ్ విద్యార్థిని కొంతకాలంగా ప్రేమించుకుంటుండగా.. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు వివాహం చేయాలని నిశ్చయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహం వాయిదా పడగా.. ఆ జంట ఏకాంతంగా మాట్లాడుకునేందుకు కృష్ణా నది ఒడ్డున రైల్వే బ్రిడ్జి వద్ద గల పుష్కర ఘాట్‌కు వెళ్లగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కీలక ఆధారాల సేకరణ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితులిద్దరూ పాత నేరస్తులేనని గుర్తించారు. వారిలో ఒక యువకుడు ప్రకాశం జిల్లా చినగంజాం నుంచి వచ్చి తాడేపల్లిలోని మహానాడు ప్రాంతంలో కొంతకాలంగా నివాసం ఉంటున్నట్టు సమాచారం. మరో యువకుడి స్వస్థలం తాడేపల్లి. బోసు బొమ్మ సెంటర్ సమీపంలోనే అతడు నివాసం ఉంటున్నట్టు తెలిసింది. రైల్వే ట్రాక్‌ను అడ్డాగా చేసుకుని వారిద్దరూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. రైల్వే ట్రాక్‌ల వెంబడి తిరుగుతూ సీతానగరం బ్రిడ్జి వద్ద రైలు ఆగి.. తిరిగి బయలుదేరే సమయంలో ఆ యువకులిద్దరూ రైలు బోగీల్లోని తలుపులు, కిటీకీల వద్ద కూర్చునే ప్రయాణికుల నుంచి సెల్ఫోన్లు, మెడలోని గొలుసుల్ని లాఘవంగా తస్కరించి ఉడాయిస్తుంటారు. వాటిని తాకట్టు పెట్టగా.. లేదా విక్రయించగా వచ్చే డబ్బుతో మద్యం, గంజాయి తాగుతుంటారని సమాచారం. వారిద్దరూ రైల్వే ట్రాక్ వెంబడి ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళతారని, ఏదైనా పెద్ద నేరం చేసినప్పుడు రెండు మూడు నెలల వరకు కనిపించరని స్థానికులు చెబుతున్నారు. కేసులో అనుమానితులు షేర్ కృష్ణ, వెంకటేశ్ విక్రయించిన సెల్‌ఫోన్ ఆధారంగా... అత్యాచారానికి పాల్పడిన తరువాత నిందితులిద్దరూ పడవలో కృష్ణా నది మీదుగా విజయవాడ వైపు చేరి అక్కడి నుండి రైల్వే ట్రాక్ మీదుగా తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌కు చేరుకున్నట్టు గుర్తించారు. అక్కడ కోర్టు వేలంలో ఉన్న ఓ భవనంలో తలదాచుకున్నట్టు సమాచారం. అనంతరం బకింగ్‌హామ్ కెనాల్‌పై గల రైల్వే బ్రిడ్జిపై మీదుగా చెన్నై రూట్లోని ట్రాక్ మీదుగా నడుచుకుంటూ వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. రైల్వే పోలీసులు వీరువురినీ వెంబడించడంతో పరారాయ్యరు. తాడేపల్లిలోని బోసుబొమ్మ సెంటర్లో టైలరింగ్ చేసే ఓ మహిళ వద్ద వారు ఓ ఫోన్ తాకట్టు పెట్టినట్టు సమాచారం అందడంతో పోలీసులు ఆమెను విచారించారు. ఆమె ఆ ఫోన్‌ను పోలీసులకు అప్పగించింది. కానీ ఆ ఫోన్ అత్యాచారానికి గురైన యువతిది కాదని తేలింది. కాగా.. అదే ప్రాంతంలో నివసిస్తున్న తాపీమేస్త్రి కుటుంబానికి నిందితులు రెండు ఫోన్లు విక్రయించినట్టు తెలుసుకున్న పోలీసులు ఆ కుటుంబం నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి తమ ఫోన్లేనని అత్యాచారానికి గురైన యువతి, ఆమె ప్రియుడు గుర్తించారు. దాంతో ఆ ఇద్దరు యువకులే ఈ దురాగతానికి పాల్పడినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. వారిలో ఓ యువకుడు ఈ నెల 17న రోడ్డుపై మద్యం సేవిస్తూ గొడవ చేయగా.. తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో బుద్ధిచెప్పి విడిచిపెట్టినట్టు కూడా తెలిసింది. పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిందితులిద్దరి కోసం పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలిస్తున్నారు. ఓ నిందితుడి స్వస్థలం చినగంజాం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టిసారించారు. నిందితులు హైదరాబాద్‌కు పరారయ్యాయనే సమాచారంతో ఓ బృందాన్ని అక్కడికి పంపారు. కృష్ణా, విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, రైల్వే గోడౌన్లు, రైల్వే ట్రాక్ వెంబడి నిర్జన ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిందితులకు కఠిన శిక్షలు తప్పవు : హోం మంత్రి నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని హోం మంత్రి మంగళవారం మరోసారి పరామర్శించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిందితుల్ని ఇప్పటివరకు పట్టుకోలేదంటూ ప్రతిపక్షాలు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఎవరిని పడితే వారిని కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని.. అసలైన నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మహిళల భద్రత విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అందుకోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. హోం మంత్రి వెంట కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే ముస్తఫా, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ఉన్నారు. -
బాలికను నిర్బంధించి 4 లక్షల సొత్తు చోరీ
నెల్లూరు(క్రైమ్): ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇద్దరు దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. దాదాపు 4 లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని మూలాపేట రాజుగారివీధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. రాజుగారివీధిలో నివాసముంటున్న సుజాత, ఖాదర్‌మస్తాన్ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు. ఈ నెల 30వ తేదీ రాత్రి సుజాత కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లగా, ఖాదర్‌మస్తాన్ ఇంట్లో లేడు. కుమార్తె హాల్లో ఉండగా, కుమారుడు బాత్రూమ్లో స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్ ధరించి ఇంట్లోకి చొరబడ్డారు. దుండగుల్లో ఒకరు బాలిక అరవకుండా ఆమె గొంతు నొక్కిపట్టాడు. మరో దుండగుడు ఇంటి ప్రధాన తలుపుతో పాటు బాత్రూమ్కు గడియ పెట్టాడు. ఆ తర్వాత బీరువాలోని సుమారు రూ.2 లక్షలకు పైగా విలువ చేసే 8.5 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదును దోచుకున్నారు. అనంతరం బాలికను వదిలేసి ఇంటికి బయట గడియ పెట్టి దుండగులు పరారయ్యారు. బాలిక బాత్రూమ్ గడియ తీసి జరిగిన విషయాన్ని తన సోదరుడితో చెప్పింది. జరిగిన విషయాన్ని తల్లికి ఫోన్ ద్వారా తెలియజేశారు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న సుజాత.. దుండగుల చర్యలతో గాయపడిన కుమార్తెను సమీపంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించింది. దోపిడీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. బాగా తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
విశాఖ ఏజెన్సీ ఘాట్ రోడ్డులో దుండగుల హల్చల్
సీలేరు (పాడేరు): విశాఖ ఏజెన్సీ సీలేరు పోలీస్‌స్టేషన్ పరిధి ధారాలమ్మ ఘాట్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి దుండగులు అరాచకం సృష్టించారు. ఆలయం సమీపంలోని రెండో మలుపు వద్ద దారి కాచి, అటుగా వచ్చిన కార్లపై దాడి చేసి బంగారం, నగదు, సెల్ ఫోన్లు దోచుకున్నారు. సీలేరు ఎస్ఐ రంజిత్ అందించిన వివరాలు.. మంగళవారం రాత్రి పంచాయతీరాజ్ జేఈ జ్యోతిబాబు సీలేరులో సచివాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించి రాత్రి 9 గంటలకు తిరిగి చింతపల్లికి కారులో వెళుతున్నారు. ధారాపురం ఘాట్‌రోడ్డు వద్ద రాత్రి 11.30గంటల సమయంలో ముసుగు ధరించిన ఐదుగురు దుండగులు వచ్చి కారును అడ్డగించారు. అనుమానం వచ్చి వేగంగా వెనక్కి తిప్పేందుకు ప్రయత్నిస్తుంటే.. ఇనుపరాడ్లతో అద్దాలు ధ్వంసం చేశారు. అయితే ఆయన తప్పించుకుని వెళ్లిపోయారు. బుధవారం తెల్లవారు జామున 4.30 ప్రాంతంలో పాల్వంచ నుంచి సీలేరు మీదుగా లంబసింగికి కారులో ఐదుగురు వెళుతుండగా.. నాటు తుపాకులు, కత్తులతో బెదిరించి వారి వద్ద నుంచి రూ.35 వేల నగదు, నాలుగు సెల్ఫోన్లు దోచుకున్నారు. దుండగులు ధ్వంసం చేసిన కారు అద్దాలు అది జరిగిన మరో అరగంటలో సీలేరుకు చెందిన సత్యనారాయణ అనే వ్యాపారి.. భార్య ఈశ్వరమ్మతో కలిసి కారులో వెళ్తుండగా ఐదుగురు వచ్చి.. తాము పోలీసులమని, తనిఖీలు చేయాలని చెప్పారు. కారు అద్దాలు దించేలోగా ఇద్దరి మెడలోని ఐదు తులాల బంగారం గొలుసులను లాక్కుని పారిపోయారు. ఈ ఘటనలో మహిళ మెడకు గాయాలయ్యాయి. వెనుక నుంచి బస్సు వస్తుండటంతో దుండగులు పరారయ్యారు. దాడికి పాల్పడిన వారంతా ఒడిశాకి చెందిన వారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అతడే ఒక సైన్యంలా..!
భువనేశ్వర్: ఓ జవాన్ తెగువ.. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరి ప్రాణాలను కాపాడగలిగింది. ఒడిశాలోని కియోంజర్ 2వ ప్రత్యేక భద్రతా దళానికి చెందిన జవాన్ హిమాంశు శేఖర పాత్రో కటక్ నుంచి భువనేశ్వర్‌కి బస్సులో ఆదివారం ఉదయం బయలుదేరాడు. డెంకనాల్ జిల్లా సమీపంలోకి రాగానే కొంతమంది దుండగులు బస్సుని ఆపారు. డ్రైవర్ తలపై తుపాకీ గురిపెట్టి బెదిరించారు. ప్రయాణికులు భయపడుతుండగా బస్సులో ఉన్న జవాన్ సాహసించి ఒక్కసారిగా దుండగుల వైపు దూకాడు. వారి చేతిలోని తుపాకీని స్వాధీనం చేసుకుని వారికే గురిపెట్టాడు. దీంతో భయపడిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగంతకులు ఎవరు, ఎందుకు దాడి చేశారనే దానిపై విచారిస్తున్నట్లు డెంకనాల్ జిల్లా ఇన్చార్జ్ పోలీస్ సూపరింటెండెంట్ జగ్మోహన్ మీనా తెలిపారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. చదవండి: (ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో దద్దరిల్లిన తుపాకీలు) ఘటనాస్థలంలో నిలిచిపోయిన బస్సు జవాన్‌కు డీజీపీ సత్కారం.. దుండగుల బారి నుంచి ప్రయాణికులను కాపాడిన జవాన్ పాత్రోని ఒడిశా డీజీపీ అభయ్ విందుకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జవాన్‌కు డీజీపీ ప్రశంసా పత్రం అందజేసి సత్కరించారు. హిమాంశు చాలా ధైర్యవంతుడని, సాదాసీదా వ్యక్తిత్వంతో విధి నిర్వహణలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందాడని డీజీపీ ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లో సమయ స్ఫూర్తితో స్పందించి, బస్సు ప్రయాణికుల ప్రాణాలను రక్షించడంలో జవాన్ అంకితభావం స్ఫూర్తిదాయకమని డీజీపీ అన్నారు. దుండగుల నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీ -
టీఆర్ఎస్ నేతను బెదిరించిన దుండగులు
సాక్షి, పెద్దపల్లి: కాల్వ శ్రీరాంపూర్‌లో టిఆర్ఎస్ నాయకుడిని దుండగులు తుపాకితో బెదిరించిన వైనం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. టిఆర్ఎస్ నాయకుడు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ దేవయ్యను మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు తుపాకీతో హత్యాయత్నానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన దేవయ్య అగంతకుల చేతిలోని తుపాకీ లాక్కొని బయటికి విసిరి వేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ఇంటి బయటక బురదలో పడటంతో అగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఎందుకోసం దేవయ్యపై దాడికి యత్నించారో స్పష్టత లేదు. అయితే దేవయ్యకు స్థానికంగా కొందరితో భూవివాదం ఉన్నట్లు తెలుస్తుంది. జరిగిన సంఘటనపై సమాచారం ఇవ్వడంతో పోలీసులకు అక్కడి చేరుకుని తుపాకి స్వాధీనం చేసుకున్నారు. భూ వివాదం నేపథ్యంలోనే దేవయ్యను హతమార్చేందుకు వచ్చారా, లేక మావోయిస్టుల కదలికల నేపథ్యంలో దేవయ్య టిఆర్ఎస్ నాయకుడు కావడంతో టార్గెట్ చేసి వచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం దేవయ్య ప్రాణ భయంతో పోలీసుల రక్షణలో ఉండగా... నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తుపాకితో భయపెట్టడంతో కాల్వ శ్రీరాంపూర్ ప్రజలతో పాటు అక్కడి టీఆర్ఎస్ నాయకులు భయాందోళన గురవుతున్నారు. -
పంజాబ్‌లోని పాటియాలాలో దుండగుల ఘాతుకం
-
డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ అనే కానిస్టేబుల్‌పై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. బైక్‌పై రాంగ్ రూట్లో వచ్చిన ఇద్దరు దుండగులు కర్రలతో కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో ప్రవీణ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటను స్థలానికి చేరుకొని కానిస్టేబుల్‌ను హుటాహుటిన డిఆర్డీఏ ఆపోలో ఆసుపత్రికి తరలించారు. ఫలక్‌నుమా ఏసీపీ మజీద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దాడి చేసిన వ్యక్తులు ఎవరు..? ఎందుకు దాడిచేశారు..? రాంగ్ రూట్లో వెళ్తున్నారని ప్రశ్నించినందుకు దాడి చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. -
ముసుగులు ధరించి.. రాడ్లతో దాడి చేసి..
సాక్షి, కర్నూలు : కర్నూలు శివారు ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసుల నిఘా లేకపోవడంతో పేట్రేగిపోతున్నారు. ముసుగులు ధరించి.. వాహనాలపై వెళుతున్న వారిని అడ్డగించి బలవంతంగా సొమ్ము లాక్కుంటున్నారు. అడ్డుచెబితే రాడ్లతో దాడి చేస్తున్నారు. ఇటువంటి ఘటనే ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కర్నూలు శివారులోని దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డి కుమార్తె సావిత్రి హైదరబాద్ నుంచి కర్నూలు బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడ నుంచి ద్విచక్రవాహనంపై తండ్రి, కుమార్తె దిన్నెదేవరపాడుకు బయలు దేరారు. సరిగ్గా దిన్నెదేవరపాడు సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ముసుగులు ధరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంలో వెంబడించారు. వాహనాన్ని అడ్డుకుని సావిత్రి మెడలోని చైన్‌ను బలవంతంగా లాక్కున్నారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన మహేశ్వర రెడ్డిపై రాడ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన అతని వద్ద ఉన్న పర్సును లాక్కొని అక్కడ నుంచి పరారయ్యారు. బాధితులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కర్నూలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కర్నూలు శివారు ప్రాంతాల్లో సరైన నిఘా లేకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నయన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. -
కారం కొట్టి రూ.లక్ష చోరీ
సాక్షి, గుంటూరు(పిడుగురాళ్ల) : కళ్లల్లో కారం కొట్టి రూ.లక్ష నగదు గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ వైన్ షాపులో కోనంకి గ్రామానికి చెందిన అన్నదమ్ములు దుర్గారావు, సైదారావు పని చేస్తుంటారు. బుధవారం అర్ధరాత్రి విధులు ముగించుకుని కోనంకి గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎదురుగా ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు వారి కళ్లల్లో కారం కొట్టి బ్యాగులో ఉన్న రూ.లక్ష నగదును అపహరించుకు వెళ్లిపోయారు. దీంతో సైదారావు పిడుగురాళ్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. సైదారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం సత్తెనపల్లి డీఎస్పీ జగదీశ్వరరెడ్డి, పట్టణ సీఐ సురేంద్రబాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
2 నౌకలపై దాడి
దుబాయ్/టెహ్రాన్/ఓస్లో: యుద్ధమేఘాలు కమ్ముకున్న గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తత చెలరేగింది. ఇరాన్‌కు సమీపంలో ఉన్న ‘గల్ఫ్ ఆఫ్ ఒమన్’ ప్రాంతంలో గురువారం రెండు చమురు నౌకలపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. ఈ దుర్ఘటనలో రెండు నౌకలు మంటల్లో చిక్కుకోగా, ఇరాన్ నేవీ 44 మంది సిబ్బందిని రక్షించింది. నార్వేకు చెందిన ‘ఫ్రంట్ ఆల్టేర్’ నౌక ఇథనాల్‌ను ఖతార్ నుంచి తైవాన్‌కు ఇరాన్ సమీపంలోని హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతానికి చేరుకోగానే ఉదయం ఒక్కసారిగా మూడు పేలుళ్లు సంభవించాయి. నౌకలో మంటలు చెలరేగడంతో 23 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. అలాగే సౌదీఅరేబియా నుంచి సింగపూర్‌కు ఇదేమార్గంలో మిథనాల్‌ను తీసుకెళుతున్న ‘కొకువా కరేజియస్’ నౌకపై గంట వ్యవధిలో మరోదాడి జరిగింది. ఈ రెండు నౌకల నుంచి ప్రమాద హెచ్చరికలను అందుకున్న ఇరాన్ నేవీ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని 44 మంది సిబ్బందిని కాపాడింది. ఖండించిన ఐరాస: ప్రపంచంలో మూడోవంతు చమురును తరలించే హోర్ముజ్ జలసంధి వద్ద దాడి జరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 3 శాతానికిపైగా ఎగబాకాయి. లండన్‌కు చెందిన బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 61.99 డాలర్లకు చేరుకోగా, న్యూయార్క్ వెస్ట్ టెక్సాస్ బ్యారెల్ చమురు ధర 3.1 శాతం పెరిగి 52.74 డాలర్లకు పెరిగింది. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ ఖండించారు. గల్ఫ్‌లో మరో ఉద్రిక్తత తలెత్తితే ప్రపంచం తట్టుకోలేదని హెచ్చరించారు. -
బస్సు డ్రైవర్‌ను చితకబాదిన అల్లరిమూక
-
పాకిస్తాన్‌కు వెళ్లిపోండి!
గురుగ్రామ్: హోలీ పండుగ రోజున హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ ముస్లిం కుటుంబంపై దాదాపు 25 మంది దుండగులు దాడి చేసి ‘మీరంతా పాకిస్తాన్ వెళ్లిపొండి’ అని బెదిరించారు. పోలీసులు ఇప్పటివరకూ దాడికి పాల్పడ్డ నిందితులందరినీ అరెస్ట్ చేయకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. యూపీలోని భాగ్‌పట్ జిల్లాకు చెందిన సాజిద్ తన కుటుంబ సభ్యులతో కలిసి హరియాణాలోని ధుమస్‌పూర్ గ్రామంలో సొంతిల్లు కట్టుకని ఉంటున్నారు. గురువారం హోలీ రోజున సాజిద్, అతని చుట్టాల పిల్లలు ఇంటి దగ్గర్లో ఆడుకుంటున్నారు. అక్కడకు బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు..‘ఏయ్.. ఇక్కడ మీరేం చేస్తున్నారు? పాక్‌కు వెళ్లి క్రికెట్ ఆడుకోండి’ అని అవమానించారు. దీన్ని గమనించిన సాజిద్ అక్కడకు వెళ్లి ఇద్దరు యువకులను నిలదీయడంతో ఆయనపై దాడిచేశారు. తర్వాత కర్రలు, కత్తులు, రాడ్లతో చేరుకున్న 20–25 మంది సాజిద్ ఇంట్లోకి దూసుకొచ్చి దాడిచేశారు. చివరకు ఇంట్లోని విలువైన వస్తువులను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనను పలు రాజకీయపార్టీలు ఖండించాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ మహేశ్ కుమార్(24) నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ దినేశ్ శర్మ తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. మరోవైపు ఈ దాడికి పాల్పడిన దుండగుల్ని ఆదివారంలోగా అరెస్ట్ చేసి చర్యలు తీసుకోకపోతే పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయిస్తామని ముస్లిమ్ ఏక్తా మంచ్ హెచ్చరించింది. -
ఇంజినీరింగ్ కళాశాలలో దుండగుల అరాచకం
తూర్పుగోదావరి, రాజానగరం: తూర్పు గానుగూడెంలోని ఓ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలోని విద్యార్థినుల హాస్టల్లోకి ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి, అరాచకం సృష్టించారు. దీనిపై విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కళాశాల ప్రహరీపై ఇనుప ముళ్ల కంచె వేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న వాచ్మన్లను తొలగించి, కొత్తవారిని నియమించాలని డిమాండ్ చేశారు. ఇందుకు కళాశాల యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమించారు. తమ డిమాండ్ల అమలుకు రెండు రోజుల వ్యవధి ఇచ్చారు. లేకుంటే తిరిగి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. విద్యార్థినులుండే హాస్టల్లోకి గుర్తు తెలియని ఇద్దరు యువకులు ప్రవేశించి, విద్యార్థినులతో అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో ఒక విద్యార్థిని బయటకు వచ్చి కేకలు వేయడం, ఇతర గదుల్లో ఉన్న విద్యార్థినులంతా బయటకురావడంతో దుండగులు పరారయ్యారు. అయితే ఈ సంఘటనలో వాచ్‌మన్ తమను కించపరిచేలా మాట్లాడాడని ఆరోపిస్తూ విద్యార్థినులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రాజానగరం పోలీసులు అక్కడకు చేరుకుని, సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఈ సంఘటనపై ఫిర్యాదు చేయాలని కోరారు. విద్యార్థినులు ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేయగా, చివరకు కళాశాల యాజమాన్యం తరఫున ప్రిన్సిపాల్ శ్రీధర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల హాస్టల్లోకి ఆదివారం రాత్రి ఒక దొంగ ప్రవేశించి, బెదిరించాడని, ఇతర విద్యార్థినులు రావడంతో పారిపోయాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థినుల డిమాండ్ మేరకు ప్రహరీపై ఇనుప కంచె వేయడానికి, సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్ ఏర్పాటు చేయడానికి, కొత్త వాచ్మన్లను నియమించడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. దీంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. -
యువతి,యువకుడిపై దుండగుల అమానుష దాడి
-
జనగామలో కాల్పుల కలకలం
సాక్షి, కొడకండ్ల : జనగామ జిల్లా కొడకండ్లలో కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని దుండగులు వైన్స్ షాప్ సిబ్బందిని తుపాకితో బెదిరించి రూ. 6.70లక్షల నగదును లాక్కెళ్లారు. మంగళవారం రాత్రి వైన్స్ షాప్ మూసివేసి ఇంటికి వెళ్తున్న షాపు యజమానులను దుండగులు అడ్డగించారు. తుపాకితో గాల్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపి వారి వద్ద నుంచి 6.70లక్షల రూపాయాలను ఎత్తుఎళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పదోతరగతి విద్యార్థినిపై బ్లేడ్ బ్యాచ్ దాడి
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాట్రేనికోడ మండలంలోని చెయ్యేరుకి చెందిన పదోతరగతి విద్యార్థినిపై గుర్తు తెలియని దుండగులు బ్లేడుతో దాడి చేశారు. విద్యార్థిని పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు విద్యార్థినిపై బ్లేడుతో దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకొని విద్యార్థిని పాఠశాలలోకి పరుగెత్తింది. దీంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. విద్యార్థిని చేతికి స్వల్ప గాయాలయ్యాయని, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
సైనిక కవాతుపై ఉగ్ర దాడి
టెహ్రాన్: ఇరాన్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. వార్షిక సైనిక కవాతు జరుగుతుండగా నలుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 29 మంది చనిపోగా, 57 మంది గాయపడ్డారు. ఇరాక్‌కు సరిహద్దుగా ఉన్న కుజెస్తాన్ ప్రావిన్స్‌లోని ఆవాజ్ పట్టణంలో శనివారం ఈ ఘటన జరిగింది. మృతిచెందినవారిలో సైనికులతో పాటు కవాతు వీక్షించడానికి వచ్చిన ప్రజలు, అధికారులున్నారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురిని భద్రతా బలగాలు అక్కడే మట్టుబెట్టగా, ఒకరు గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయాడు. అమెరికా మిత్ర దేశమే దాడికి బాధ్యత వహించాలని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ అన్నారు. సౌదీ అరేబియా పాత్ర ఉంది.. 1980–88 మధ్య ఇరాక్‌తో జరిగిన యుద్ధానికి స్మారకంగా ఇరాన్ ఏటా సైనిక కవాతు నిర్వహిస్తోంది. ప్రేక్షకులు కూర్చున్న స్టాండ్ వెనక వైపు నుంచి దుండగులు లోనికి చొరబడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. సంఘటనా స్థలంలో సాయం కోసం అరుస్తున్న బాధితుల చిత్రాలను పలు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. తమ శత్రువైన సౌదీ అరేబియా ఈ దాడికి నిధులు సమకూర్చిందని ఇరాన్ సైన్యం ఆరోపించింది. -
విజయవాడ: అర్ధరాత్రి దంపతులపై దుండగుల దాడి
-
అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి..
-
అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచి..
సాక్షి, హైదరాబాద్: రోజు రోజుకూ నగరంలో దుండగుల అగడాలు పెరిగిపోతున్నాయి. ఓ వ్యాపారిపై చాదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్ర కత్తులతో దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముగశిర్ అనే వ్యక్తికి కోఠిలో కార్ డెకరేషన్ షాపు ఉంది. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో బైక్‌పై ఇంటికి వెళ్తున్న అతనిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అతని వద్ద ఉన్న నగదు బ్యాగ్‌ను లాక్కొనే ప్రయత్నాం చేశారు. ఆ వ్యాపారి బ్యాగ్‌ను ఇవ్వకపోవడంతో కత్తులతో పొడిచి నగదు బ్యాగ్‌తో పరారయ్యారు. అందరూ చూస్తుండగానే దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్రం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ మాట్లాడుతూ.. త్వరలోనే దుండగులను అదుపులోకి తీసుకుంటామన్నారు. వారి కోసం అన్ని వైపుల గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నామని అన్నారు. వ్యాపారి బ్యాగ్‌లో రూ. 1.90 లక్షలు ఉన్నట్లు ఆయన తెలిపారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన నాగరత్నమ్మ
* 17 రోజులపాటు కోమాలో * దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన వృద్ధ దంపతులు * భార్య మృతి,భర్త పరిస్థితి విషమం తెనాలి రూరల్: దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన వృద్ధ దంపతుల్లో భార్య మృతి చెందింది. ఇంట్లో ఉన్న సొత్తును అపహరించుకెళ్లేందుకు వచ్చిన దుండగులు ఒంటరిగా ఉన్న దంపతులపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపర్చారు. 17 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన భార్యను మృత్యువు కబళించింది. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బలభద్రుని వెంకటనారాయణశాస్త్రి, నాగరత్నమ్మ (85) తమ స్వగృహంలో నివసిస్తుండేవారు.మే నెల 29వ తేదీన వీరిపై గుర్తు తెలియని దుండగులు విచక్షనా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. మరుసటి రోజు 30వ తేదీ మధ్యాహ్నం వీరికి బట్టలు ఉతికేందుకు వచ్చే బాజి ఇంటికి వచ్చి చూడగా, గ్రిల్స్ లోపలి వైపు తాళం వేసి ఉంది. ఎంత సేపు పిలిచినా స్పందన లేకపోవడంతో అక్కడికి సమీపంలో నివసించే దంపతుల కుమారుడి కుటుంసభ్యులకు తెలియజేసింది. వారు వచ్చి పిలిచినా ఫలితం లేదు. అనుమానం వచ్చి ఇంటి వెనుకకు వెళ్లి చూడగా, తలుపు తీసి ఉంది. లోపల వెంకటనారాయణశాస్త్రి, నాగరత్నమ్మ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న దంపతులు ఇద్దర్నీ తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి గుంటూరు సమగ్ర వైద్యశాలకు వైద్యులు పంపారు. ఘటన జరిగిన నాటి నుంచి దంపతులిరువురూ కోమాలో ఉన్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలకు మార్చి చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నాగరత్నమ్మ మృతి చెందింది. మృతదేహానికి గుంటూరు సమగ్ర వైద్యశాలలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించి, సాయత్రం నాలుగు గంటల ప్రాంతంలో స్వగ్రామం నందివెలుగుకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దుండుగల దాడిలో గాయపడిన వెంకటనారాయణ శాస్త్రి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కళ్లు తెరచి చూడటం మినహా మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు చెప్పారు. పోలీసులకు సవాలుగా మారిన కేసు.. 17 రోజులు గడిచినా కేసులో పురోగతి లేదు. దంపతుల్లో ఎవరైనా పూర్తి స్పృహలోకి వచ్చి సమాచారం చెబితే గానీ కేసు ముందుకు కదలని పరిస్థితి. రూరల్ జిల్లా ఎస్పీ నారాయణ్‌నాయక్ ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గుంటూరు సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసరావును దర్యాప్తు చేసేందుకు నియమించారు. మరో వైపు తెనాలి డీఎస్పీ జీవీ రమణమూర్తి, తాలూకా సీఐ యు. రవిచంద్ర కేసు గురించి ప్రతి రోజు సమీక్షిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. గ్రామంలో బేలుదారి పనికి వచ్చిన వారే చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి, ఈ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. -
అంధుడిపై దాడి
దుగ్గిరాల(గుంటూరు): గుర్తుతెలియని దుండగులు ఓ అంధుడిపై దాడి చేశారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని రామ్‌నగర్‌లో గురువారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. దుగ్గిరాలకు చెందిన ఏసుపాదం(55) అనే అంధ వృద్ధుడు రామ్‌నగర్‌లో జీవనం సాగిస్తున్నాడు. కాగా, కొంతమంది గుర్తు తెలియని దుండగులు గురువారం తెల్లవారుజామున అతనిపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు. ఈ దాడిలో ఆ అంధుడు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తం మడుగులో ఉన్న అతన్ని తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. అతనిపై దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, ఏసుపాదం భార్య కూడా అంధురాలే కావడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.