
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాట్రేనికోడ మండలంలోని చెయ్యేరుకి చెందిన పదోతరగతి విద్యార్థినిపై గుర్తు తెలియని దుండగులు బ్లేడుతో దాడి చేశారు. విద్యార్థిని పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు విద్యార్థినిపై బ్లేడుతో దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకొని విద్యార్థిని పాఠశాలలోకి పరుగెత్తింది. దీంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. విద్యార్థిని చేతికి స్వల్ప గాయాలయ్యాయని, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment