
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సత్తెనపల్లి డీఎస్పీ, సీఐ
సాక్షి, గుంటూరు(పిడుగురాళ్ల) : కళ్లల్లో కారం కొట్టి రూ.లక్ష నగదు గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ వైన్ షాపులో కోనంకి గ్రామానికి చెందిన అన్నదమ్ములు దుర్గారావు, సైదారావు పని చేస్తుంటారు. బుధవారం అర్ధరాత్రి విధులు ముగించుకుని కోనంకి గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎదురుగా ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు వారి కళ్లల్లో కారం కొట్టి బ్యాగులో ఉన్న రూ.లక్ష నగదును అపహరించుకు వెళ్లిపోయారు. దీంతో సైదారావు పిడుగురాళ్ల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. సైదారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం సత్తెనపల్లి డీఎస్పీ జగదీశ్వరరెడ్డి, పట్టణ సీఐ సురేంద్రబాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment