
మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. క్వాలిటీ వాల్ కోటింగ్స్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేస్తున్నారు. మంటల్లో వాల్ పుట్టి ముడిసరుకు, పెయింట్స్ దగ్ధం అయ్యాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సుమారు రూ.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment