
సాక్షి, హైదరాబాద్: రోజు రోజుకూ నగరంలో దుండగుల అగడాలు పెరిగిపోతున్నాయి. ఓ వ్యాపారిపై చాదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్ర కత్తులతో దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముగశిర్ అనే వ్యక్తికి కోఠిలో కార్ డెకరేషన్ షాపు ఉంది. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో బైక్‌పై ఇంటికి వెళ్తున్న అతనిపై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అతని వద్ద ఉన్న నగదు బ్యాగ్‌ను లాక్కొనే ప్రయత్నాం చేశారు. ఆ వ్యాపారి బ్యాగ్‌ను ఇవ్వకపోవడంతో కత్తులతో పొడిచి నగదు బ్యాగ్‌తో పరారయ్యారు.
అందరూ చూస్తుండగానే దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్రం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
వెస్ట్‌జోన్ డీసీపీ మాట్లాడుతూ.. త్వరలోనే దుండగులను అదుపులోకి తీసుకుంటామన్నారు. వారి కోసం అన్ని వైపుల గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నామని అన్నారు. వ్యాపారి బ్యాగ్‌లో రూ. 1.90 లక్షలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment