Kodakandla
-
సీఐ ఔదార్యం.. పోలీసుల చేయూత..
వరంగల్: కొడకండ్ల మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన కోక సోమయ్య ఇల్లు భారీ వర్షాలకు కూలిపోగా.. అతడికి పోలీసులు చేయూత అందించారు. సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో సోమయ్యకు కొడకండ్ల, పాలకుర్తి ఎస్సైలు శ్రవణ్, తాళ్ల శ్రీకాంత్, రమేష్‌నాయక్ శుక్రవారం రూ.5 వేలు విలువైన నగదు, బియ్యం, సామగ్రి సాయం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
జనగామ: కిడ్నాపైన బాలుడు షబ్బీర్ హత్య.. వరసకు బావే నిందితుడు
సాక్షి, జనగామ: జనగామ జిల్లా కొడకండ్లలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడి కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. కిడ్నాప్ అయిన బాలుడు షబ్బీర్(5) దారుణ హత్యకు గురయ్యాడు. కిడ్నాపర్ మహబూబ్ బాలుడిని చంపి బావిలో పడేశాడు. నిందితుడు మహబూబ్‌ను సూర్యపేట జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సినిఫక్కీలో వెంబడించి తిరుమలగిరి సమీపంలో మహబూబ్‌ను అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు మహబూబ్.. బాలుడి తండ్రి జమాల్‌కు వరుసకు అల్లుడుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామానికి చెందిన మహ్మద్ జమీల్ కుటుంబం ఏడాది కాలంగా కొడకండ్లలో నివాసం ఉంటుంది. జమీల్ సమీపంలోని తిర్మలగిరి కర్రకోత మిషన్‌లో పనిచేస్తుండగా ఇతర కుటుంబీకులు అల్యూమినియం వస్తువులు తయారు చేస్తుంటారు. రోజూ మాదిరిగానే జమీల్ పనికి వెళ్లాడు. ఆ సమయంలో అతడి పెద్ద కుమారుడైన షాబీర్ గుడిసె బయట ఆడుకొంటూ కనిపించకుండా పోయాడు. దీంతో తల్లి జరీనాతోపాటు మిగతా కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలోనే బాలుడు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. చదవండి: మెడిసిన్ చదివి రెండేళ్లుగా ఇంటి వద్దే.. సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని వెళ్లి -
రైతు రాజ్యమే లక్ష్యం
సాక్షి, వరంగల్: ‘కొడకండ్లలో రైతువేదికను ప్రారంభిస్తే రాజ్యం తెచ్చినంత సంతోషంగా ఉంది. తెలం గాణలో రైతురాజ్యం సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. చైతన్యదీపికలుగా రైతు వేదికలు పనిచేస్తాయని, ఇవి రైతు విప్లవానికి నాంది అవు తాయని చెప్పారు. దేశంలో ఎక్కడా రైతులకు సంఘాలు, వేదికలు లేవని, కేవలం రైతులను సంఘటితం చేయడం, వారి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రూ.600 కోట్లతో 2,601 రైతు వేదికల్ని నిర్మించామని తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్లలో క్లస్టర్ స్థాయిలో నిర్మించిన రైతువేదికను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఐదువేల మందితో ఏర్పాటుచేసిన ‘ఆత్మీయ రైతు సమ్మేళనం’ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘రైతు వేదిక నా గొప్ప కల. రైతాంగం ఒకచోట కూర్చొని మాట్లాడు కోవాలి. నియంత్రిత సాగుపై మాట్లాడినట్లే చర్చ చేయాలి. రైతు వేదిక ఒక ఆటంబాంబు. ఒక శక్తి’ అని సీఎం పేర్కొన్నారు. ‘ధరణి పోర్టల్, రైతు వేదికలు, రైతుబంధు, రైతుబీమా వట్టిగా పెట్ట లేదు. రైతులందరూ సంఘటితం కావాలనే ఉద్దేశం తోనే వీటన్నింటినీ చేపట్టాం. రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలి. కూరగాయలు, ధాన్యం ధరలు దళారుల చేతుల్లోకి పోవద్దు. వీటన్నింటిలో కీలకపాత్ర పోషించే రైతు వేదికలు దేశానికి ఆదర్శంగా నిలవబోతున్నాయి. తెలంగాణలో రైతురాజ్యం వచ్చి తీరుతది. తెలంగాణ రైతాంగమంతా కొన్ని విషయాలను సీరియస్‌గా తీసుకోవాలి. నేను సీఎం అయ్యేనాటికి వ్యవసాయ శాఖను చంపేశారు. కానీ ఇప్పుడు అన్ని పోస్టులు భర్తీ చేశాం. వ్యవసాయ శాఖ అద్భుతంగా పనిచేస్తోంది’ అని సీఎం అన్నారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. చిత్రంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రులు నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే రాజయ్య తదితరులు రైతువేదికలు రైతు ప్రగతి కేంద్రాలు రైతులంతా సంఘటితమై సాగులోని లాభనష్టాలు, వాడే పురుగుమందులు, మార్కెట్లో డిమాండ్, పంటను క్రమపద్ధతిలో మార్కెట్‌కు తరలించడం వంటివి రైతువేదికలో చర్చించుకోవాలని సీఎం సూచించారు. వీటిలో రైతుబంధు సమితి సభ్యులు కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. ప్రపంచం మొత్తమ్మీద ప్రభుత్వం రైతులకు వేదికలు నిర్మించడం తెలంగాణలోనే జరిగిందన్నారు. రైతువేదికల్లో టీవీలు ఏర్పాటుచేసి సీఎం, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తల సూచనలు నేరుగా రైతులకు అందిస్తామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయిపూర్ రైతులు స్వచ్ఛందంగా సంఘం ఏర్పాటుచేసుకోవడంతో తక్కువ ధరకు ఎరువులు, పంట విక్రయ సమయంలోనూ మంచి ధర సాధిస్తున్నారన్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ ‘దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలను రైతుల కోసం అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతుల నుంచి ఎటువంటి దరఖాస్తు రాకుండానే వారి సంక్షేమంపై ఆలోచించి రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలను ప్రవేశపెట్టాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘రైతుబంధు ద్వారా ఇప్పటివరకు రైతుల ఖాతాలో నేరుగా సుమారు రూ.28 వేల కోట్లు జమ చేశాం. కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు ఆగదు. ఏటా రూ.1,200 కోట్లు ఖర్చుచేసి రైతుకు భద్రత కల్పించేందుకు రైతుబీమా అమలు చేస్తున్నాం. దేశంలో పూర్తిస్థాయిలో మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం మనదే. దేశవ్యాప్తంగా కొనుగోలు చేసిన ధాన్యంలో 55% వాటాతో తెలంగాణ రికార్డు సృష్టించింది అని కేసీఆర్ వివరించారు. భూమి కౌలు, ఇల్లు కిరాయి ఒకటే.. రైతుల భూహక్కులను సంపూర్ణంగా రక్షించేందుకు, వారి సమస్యలు తొలగించేందుకు వీలుగా ధరణి పోర్టల్ రూపొందించామని సీఎం తెలిపారు. ‘పట్టాదారు రైతుల సంరక్షణ మా అజెండా. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఎట్టి పరిస్థితుల్లో పట్టాదారు పాస్ పుస్తకాల్లో అనుభవదారుడు కాలమ్ రాయబోము. అనుభవదారుడిగా ఒక వ్యక్తి మూడేళ్లుంటే అతడికి భూమిపై హక్కు వస్తుంది. కోర్టులో కేసులువేసి అసలుదారుడిని ఇబ్బంది పెడుతున్నారు. పట్టణాల్లో ఇల్లు కిరాయికి ఇచ్చే సమయంలోనూ కిరాయిదారు అనే ప్రస్తావన పత్రాల్లోనూ, మరెక్కడా ఉండదు. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాల్లో సైతం అవసరం లేదు. భూమి కౌలుకివ్వడం ఇంటిని కిరాయికివ్వడం వంటిదే’ అని సీఎం వివరించారు. పల్లె ప్రగతి ద్వారా 12,751 గ్రామ పంచాయతీలకు ప్రతీనెలా సకాలంలో నిధులు విడుదల చేస్తుండడం, సర్పంచ్‌లు, పంచాయతీ సిబ్బంది తీసుకుంటున్న చర్యలతో ప్రజారోగ్యం మెరుగుపడుతోందన్నారు. రైతు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి కేంద్ర ప్రభుత్వం పూర్తి రైతు వ్యతిరేక వైఖరి అవలంభిస్తుందని, రైతులంతా దీనిపై సమష్టిగా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులపై కేంద్రానికి ప్రేమ లేదన్నారు. ప్రపంచంలోని దేశాలు రైతులకు సబ్సిడీలు ఇస్తుంటే మన కేంద్ర ప్రభుత్వం మాత్రమే అందించవద్దని చెబుతోందన్నారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్‌సీఐ భయంకరమైన ఆంక్షలు విధించిందని, ధాన్యం కేవలం రూ.1,888కే కొనుగోలు చేయాలని, అధిక ధరకు కొంటే తాము సేకరించబోమంటూ దుర్మార్గ వైఖరి అవలంభిస్తుందన్నారు. ఎఫ్‌సీఐ నిబంధనతో సన్న వడ్లకు వెంటనే అధిక ధర ప్రకటించలేకపోతున్నామని, తప్పనిసరిగా మరోమార్గంలో ఆయా రైతులకు అధిక లాభం కలిగేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టం సైతం పూర్తి రైతు వ్యతిరేకంగా ఉందన్నారు. నూతన వ్యవసాయ చట్టాన్ని టీఆర్ఎస్, తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. సదరు దుర్మార్గపు చట్టం నుంచి రక్షించుకోవడానికి రైతు వేదికలు అవసరమైన సమయంలో తమ పాత్ర పోషించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. యాసంగిలోనూ సహకరించండి వానాకాలంలో నియంత్రిత సాగుకు సహకరించిన రైతులు యాసంగిలోనూ సంపూర్ణంగా సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలతో మక్క పంటకు మద్దతు ధర లభించడం లేదని, అయినా కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మక్కలపై సుంకం 50% నుంచి 15% తగ్గించిందని సీఎం మండిపడ్డారు. వానాకాలంలో మక్కల సాగు బాగా తగ్గినా సాగు చేసిన కొందరు నష్టపోవద్దని రూ.600 కోట్లు నష్టం వస్తున్నా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. యాసంగిలో మాత్రం మక్క కాకుండా, కంది, శనగలు, పామాయిల్ వంటివి సాగు చేస్తే ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని భరోసానిచ్చారు. త్వరలోనే తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరందిస్తామని తెలిపారు. దళితులు, గిరిజనుల అభివృద్ధికి సైతం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి అమలుచేస్తామని, ఇప్పటికే రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించి మంచి విద్య అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమం, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, ప్రభుత్వ విప్ బి.వెంకటేశ్వర్లు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, జనగామ జిల్లా కలెక్టర్ కె.నిఖిల, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది కిరికిరిగాళ్ల ముచ్చట ‘నియంత్రిత సాగు విధానంతో రైతులకు లాభం చేకూర్చాలని మేం పనిచేస్తుంటే కొంతమంది దుర్మార్గంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ దొంగ ముచ్చట్లు చెబుతున్నాడు. కిరికిరిగాళ్ల ముచ్చట్లు ఎట్ల ఉంటయో షబ్బీర్ అలీ కథ చూస్తే అర్థమైతది. షబ్బీర్ అలీ అనే కాంగ్రెస్ నాయకుడికి మెదక్ జిల్లా నార్సింగి మండలం జాప్తి శివనూరులోని సర్వే నంబర్ 408 నుంచి 413 వరకు భూములు ఉన్నాయి. అందులో వరి పంట కోసి గడ్డి కాలపెట్టిండు. సీఎం సన్నరకం పెట్టమంటే పెట్టిన.. నష్టపోయానని ఆయన ఫాంహౌస్‌లో పనిచేసే ఎలక్ట్రీషియన్ గణేశ్‌తో చెప్పించిండు. ఇదీ షబ్బీర్ అలీ కథ. ఇంత దొంగ ముచ్చట్లా? సోషల్ మీడియా కాదు.. యాంటీ సోషల్ మీడియా అయిపోయింది. ప్రతిపక్షాలకు దొంగ మాటలు మాట్లాడటం అలవాటైనా గుండెల నిండా నిజాయితీ ఉన్న సీఎంను ఎవరూ ఏం చేయలేరు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పింఛన్లపై బీజేపీవి అబద్ధాలు ‘బీజేపీ నాయకులు పింఛన్ల విష యంలో పచ్చి అబద్ధాలు మాట్లాడు తున్నారు. పెన్షన్లకు కేంద్రం అధిక మొత్తంలో డబ్బు చెల్లిస్తున్నట్లు ఎవడైనా మొగోడు రుజువుచేస్తే ఒక్కటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతా. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.. పీకేది లేదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయకులు ఘోరాతి ఘోరమైన అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో 38.65 లక్షల మందికి అన్ని రకాల పెన్షన్లు ఇస్తున్నాం. ఈ పెన్షన్లలో కేంద్రం గుండుగుత్తగా 7 లక్షల మందికి మాత్రమే ఇస్తుంది. అదీ రూ.200 మాత్రమే. సంవత్సరానికి కలిపి కేంద్రం ఇచ్చేది రూ.105 కోట్లు అయితే రాష్ట్రం రూ.10 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లు ఇస్తోంది. ఈ లెక్కలన్నీ ‘కాగ్’ అధికారికంగా విడుదల చేసింది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నా : కేసీఆర్
సాక్షి, జనగామ : రైతు పెద్దవాడే కానీ కూర్చొని మాట్లాడుకునేందుకు స్థలమే లేదని, అందుకే రైతు వేదికలను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణలో తొలి రైతు వేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జనగాం జిల్లా కొడకండ్లలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతు వేదిక ఏర్పాటు వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయం అన్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా రైతులకు ఒక వేదిక లేదని, తెలంగాణాలోనే తొలిసారి రైతుల కోసం భవనాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఉద్యమ సమయంలో రైతుల బాధలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతులను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. (చదవండి : రైతన్నకు ‘వేదిక’) ఇతర దేశాల్లో మాదిరి మన దేశంలో రైతులకు సబ్సిడీ అందడం లేదని విమర్శించారు. రాష్ట్రాలకు అందించాలనుకున్నా కేంద్రం ఆక్షలు అడ్డుపతున్నాయని ఆరోపించారు. ధాన్యానికి ఎక్కువ ధరలు ఇస్తామంటే ఎఫ్‌సీఐ వడ్లు కొనుగోలు నిలిపివేసిందన్నారు. రైతులను నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ధాన్యం సన్నవైనా, దొడ్డవైనా రూ.1,880లకే కొనుగోలు చేస్తామని ఎఫ్‌సీఐ చెబుతోందని, అంత కంటే ఎక్కువైతే ధాన్యం సేకరించేదే లేదని ఆంక్షలు విధించిందని గుర్తు చేశారు. కేంద్రం రైతులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. కేంద్రంపై రైతులు పిడికిలి పట్టి ఉద్యమించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచే ఉద్యమం ప్రారంభం కావాలన్నారు. రైతు సంఘటితం కావడానికి రైతు వేదిక ఉపయోగపడాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
దక్షిణాదిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో కొడాక్, థామ్సన్ బ్రాండ్ల టీవీల తయారీ లైసెన్సున్న ‘సూపర్ ప్లాస్ట్రానిక్స్’... మరో ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఉత్తరాదిన మూడు ప్లాంట్లున్న ఈ కంపెనీ నాల్గవ యూనిట్‌ను దక్షిణాదిన ఏర్పాటు చేస్తామని తెలియజేసింది. ఇందుకోసం ఏపీ, తెలంగాణ, తమిళనాడు పరిశీలనలో ఉన్నాయని సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘కొత్త ప్లాంటు వార్షిక సామర్థ్యం 2 లక్షల యూనిట్లు ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైతే ఎక్కువ ప్రోత్సాహకాలిస్తుందో అక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం కంపెనీ వార్షిక తయారీ సామర్థ్యం 9 లక్షల యూనిట్లపైనే. కొడాక్, థామ్సన్ బ్రాండ్లలో 2017–18లో 2.1 లక్షల యూనిట్లు విక్రయించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 4.8 లక్షల యూనిట్లకు చేరుతుంది. కొడాక్ బ్రాండ్‌లో 14 మోడళ్లున్నాయి. ఈ ఏడాది కొత్తగా 8 మోడళ్లు మార్కెట్లోకి విడుదల చేస్తాం. టీవీల విపణిలో సూపర్ ప్లాస్ట్రానిక్స్‌కు 4 శాతం మార్కెట్ వాటా ఉంది. 2022 నాటికి వాటాను రెండింతలు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆన్లైన్లో ప్రస్తుతం టాప్–2 ప్లేయర్‌గా ఉన్నాం’ అని వివరించారు. -
జనగామలో కాల్పుల కలకలం
సాక్షి, కొడకండ్ల : జనగామ జిల్లా కొడకండ్లలో కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని దుండగులు వైన్స్ షాప్ సిబ్బందిని తుపాకితో బెదిరించి రూ. 6.70లక్షల నగదును లాక్కెళ్లారు. మంగళవారం రాత్రి వైన్స్ షాప్ మూసివేసి ఇంటికి వెళ్తున్న షాపు యజమానులను దుండగులు అడ్డగించారు. తుపాకితో గాల్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపి వారి వద్ద నుంచి 6.70లక్షల రూపాయాలను ఎత్తుఎళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
క్రికెట్ సీనియర్ క్రీడాకారుడి దారుణ హత్య
కొడకండ్ల, న్యూస్‌లైన్ : తమ్ముడి ప్రేమ వ్యవహారానికి సొంత అన్న బలయ్యాడు. ఈ సంఘటన మం డలంలోని అవుతాపురం గ్రామ శివారు దుర్గమ్మగుడి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జనగామ డీఎస్పీ సురేందర్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హన్మకొండలోని వడ్డేపల్లికి చెందిన మెకానిక్ యాకుబ్‌అలీ, సర్వర్‌బీ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇందులో పెద్ద కుమారుడు మృతుడు మహ్మద్ ఫరూక్(26) రంజీ క్రికెట్ క్రీడాకారుడిగా కొనసాగుతూ ఇంటివద్దే ఉంటున్నాడు. రెండో కుమారుడు ఫిరోజ్ ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్‌లో నివాసముం టుండగా, చిన్న కుమారుడు ఫయాజ్ కూడా ఇంటివద్దే ఉంటున్నాడు. అయితే మృతుడు ఫరూక్ సోదరుడు ఫయాజ్ వడ్డేపల్లిలో గతనెల 19వ తేదీన హత్యగావించబడిన రౌడీషీటర్ షరీఫ్ కూతురును కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఫయాజ్ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు మంగళవారం జనగామకు వెళ్లాడు. అనంతరం తాను ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. అయితే ఇంటి నుంచి పారిపోయిన ఇద్దరి ని పట్టుకునేందుకు తమతో రావాలని అమ్మాయి సోదరుడు గౌస్‌పాషా, ఆమె మామయ్య ఖాదర్‌పాషా, బాబాయి గౌస్‌పాషాలు.. ఫయాజ్ అన్న ఫరూక్, ఆయన తండ్రి యాకుబ్‌పాషా, బావ మజీ ద్, అతడి స్నేహితుడు ప్రస్తుతం జనగామలో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న అక్రంను కోరి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులు జనగామకు వస్తున్నారనే విషయం తెలుసుకున్న ప్రేమజంట వెంటనే అక్కడి నుంచి అన్నారంషరీఫ్‌కు వెళ్లారు. అయితే జనగామకు వెళ్లిన తర్వాత వారు కనపడలేదు. దీంతో అమ్మాయి అన్న, మామ, బావలు.. నీ తమ్ముడితోనే తమకు ఇన్ని సమస్యలు వచ్చాయంటూ ఫరూక్‌తో గొడవపడ్డారు. అనంతరం వారంతా ఒక్క ఫరూక్‌నే వెంట పెట్టుకుని అన్నారంషరీఫ్‌కు రెండు కార్లలో బయలుదేరారు. ఈ సందర్భంగా ఫరూక్ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను కూడా లాక్కుని స్విచ్ఆఫ్ చేశారు. అయితే అన్నారం షరీఫ్‌కు బయలుదేరిన వారిలో తన దగ్గరి మిత్రుడు అక్రం కూడా ఉండడంతో ఫరూక్ వారిపై ఎలాంటి అనుమానం చెందలేదు. ఈ క్రమంలో సదరు అమ్మాయి అన్న, ఆయన వెంట వచ్చిన బంధువులు మండల పరిధిలోని అవుతాపురం గ్రామ శివారు వద్ద ఫరూక్‌ను అర్ధరాత్రి తల్వార్లతో గొంతుకోసి హత్య చేసి కుంట లో పడేశారు. అయితే బుధవారం ఉదయం పనులపై వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పాలకుర్తి సీఐ తిరుపతి, కొడకండ్ల ఎస్సై ఎం. శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం అక్కడ లభించిన ఏటీఎం, మందుల చిట్టీ ఆధారంగా మృతదేహం ఫరూక్‌గా కనుగొని కేసు నమోదు చేసుకున్నారు.కాగా, అవుతాపురం లో జరిగిన హ్యతను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా, మృతు డు ఇటీవలే రంజీ జట్టు తరుపున మలేషియా వెళ్లి వచ్చినట్లు తెలిసింది.