క్రికెట్ సీనియర్ క్రీడాకారుడి దారుణ హత్య | Cricket senior player assassination | Sakshi
Sakshi News home page

క్రికెట్ సీనియర్ క్రీడాకారుడి దారుణ హత్య

Published Thu, Mar 20 2014 3:18 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

క్రికెట్ సీనియర్ క్రీడాకారుడి దారుణ హత్య - Sakshi

క్రికెట్ సీనియర్ క్రీడాకారుడి దారుణ హత్య

కొడకండ్ల, న్యూస్‌లైన్ : తమ్ముడి ప్రేమ వ్యవహారానికి సొంత అన్న బలయ్యాడు. ఈ సంఘటన మం డలంలోని అవుతాపురం గ్రామ శివారు దుర్గమ్మగుడి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. జనగామ డీఎస్పీ సురేందర్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హన్మకొండలోని వడ్డేపల్లికి చెందిన మెకానిక్ యాకుబ్‌అలీ, సర్వర్‌బీ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇందులో పెద్ద కుమారుడు మృతుడు మహ్మద్ ఫరూక్(26) రంజీ క్రికెట్ క్రీడాకారుడిగా కొనసాగుతూ ఇంటివద్దే ఉంటున్నాడు.

 

రెండో కుమారుడు ఫిరోజ్ ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్‌లో నివాసముం టుండగా, చిన్న కుమారుడు ఫయాజ్ కూడా ఇంటివద్దే ఉంటున్నాడు. అయితే మృతుడు ఫరూక్ సోదరుడు ఫయాజ్ వడ్డేపల్లిలో గతనెల 19వ తేదీన హత్యగావించబడిన రౌడీషీటర్ షరీఫ్ కూతురును కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఫయాజ్ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు మంగళవారం జనగామకు వెళ్లాడు. అనంతరం తాను ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు.

అయితే ఇంటి నుంచి పారిపోయిన ఇద్దరి ని పట్టుకునేందుకు తమతో రావాలని అమ్మాయి సోదరుడు గౌస్‌పాషా, ఆమె మామయ్య ఖాదర్‌పాషా, బాబాయి గౌస్‌పాషాలు.. ఫయాజ్ అన్న ఫరూక్, ఆయన తండ్రి యాకుబ్‌పాషా, బావ మజీ ద్, అతడి స్నేహితుడు ప్రస్తుతం జనగామలో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న అక్రంను కోరి అక్కడికి వెళ్లారు.

ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులు జనగామకు వస్తున్నారనే విషయం తెలుసుకున్న ప్రేమజంట వెంటనే అక్కడి నుంచి అన్నారంషరీఫ్‌కు వెళ్లారు. అయితే జనగామకు వెళ్లిన తర్వాత వారు కనపడలేదు. దీంతో అమ్మాయి అన్న, మామ, బావలు.. నీ తమ్ముడితోనే తమకు ఇన్ని సమస్యలు వచ్చాయంటూ ఫరూక్‌తో గొడవపడ్డారు. అనంతరం వారంతా ఒక్క ఫరూక్‌నే వెంట పెట్టుకుని అన్నారంషరీఫ్‌కు రెండు కార్లలో బయలుదేరారు. ఈ సందర్భంగా ఫరూక్ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను కూడా లాక్కుని స్విచ్‌ఆఫ్ చేశారు.


 అయితే అన్నారం షరీఫ్‌కు బయలుదేరిన వారిలో తన దగ్గరి మిత్రుడు అక్రం కూడా ఉండడంతో ఫరూక్ వారిపై ఎలాంటి అనుమానం చెందలేదు. ఈ క్రమంలో సదరు అమ్మాయి అన్న, ఆయన వెంట వచ్చిన బంధువులు మండల పరిధిలోని అవుతాపురం గ్రామ శివారు వద్ద ఫరూక్‌ను అర్ధరాత్రి తల్వార్లతో గొంతుకోసి హత్య చేసి కుంట లో పడేశారు. అయితే బుధవారం ఉదయం పనులపై వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పాలకుర్తి సీఐ తిరుపతి, కొడకండ్ల ఎస్సై ఎం. శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

అనంతరం అక్కడ లభించిన ఏటీఎం, మందుల చిట్టీ ఆధారంగా మృతదేహం ఫరూక్‌గా కనుగొని కేసు నమోదు చేసుకున్నారు.కాగా, అవుతాపురం లో జరిగిన హ్యతను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా, మృతు డు ఇటీవలే రంజీ జట్టు తరుపున మలేషియా వెళ్లి వచ్చినట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement