వరంగల్: కొడకండ్ల మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన కోక సోమయ్య ఇల్లు భారీ వర్షాలకు కూలిపోగా.. అతడికి పోలీసులు చేయూత అందించారు. సీఐ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో సోమయ్యకు కొడకండ్ల, పాలకుర్తి ఎస్సైలు శ్రవణ్, తాళ్ల శ్రీకాంత్, రమేష్‌నాయక్ శుక్రవారం రూ.5 వేలు విలువైన నగదు, బియ్యం, సామగ్రి సాయం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment