మద్యం విక్రయిస్తే ఉపేక్షించం
అనుమతి లేకుండా మద్యం విక్రరుుస్తే ఉపేక్షించం
అనుమతులు లేకుండా రెస్టారెంటుల్లో మద్యం తాగడంగానీ, విక్రయిచడంగానీ చేస్తే ఉపేక్షించబోమని ఎస్‌ఐ సీహెచ్ ప్రతాప్‌కుమార్ తెలిపారు. గుంటూరు సౌత్‌జోన్ డీఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ప్రత్తిపాడులోని రెస్టారెంట్లు నిర్వాహకులతో మాట్లాడారు.
రాత్రి పదిన్నర గంటల తరువాత రెస్టారెంట్లు తెరిచి ఉండటానికి వీలులేదన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించాలని చెప్పారు. రెస్టారెంటు ఎదుట మద్యం తాగరాదన్న బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుని, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
విద్వేషాలకు పోకండి
విద్వేషాలకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రతాప్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలో హైపర్‌సెన్సిటివ్ గ్రామాలైన తిమ్మాపురం, వంగిపురంల్లో ఆయన బుధవారం పర్యటించారు. స్థానికులు, గ్రామ పెద్దలతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, గొడవలు జరిగితే సమాచారం అందించాలని కోరారు.