ఆదిలాబాద్: జిల్లాలోని రిజర్వుడ్ వైన్‌షాపులను లాటరీ విధానంలో ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు అధికారికంగా ప్రకటన జారీ చేయాల్సి ఉంది. కలెక్టర్ రాహుల్‌రాజ్ గురువారం రిజర్వేషన్ షాపుల గుర్తింపునకు లాటరీ తీసి ఆయా షాప్ నంబర్లను ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 40 వైన్‌షాపులుండగా ఇందులో 15 రిజర్వ్ కాగా, 25 జనరల్ కేటగిరీలో ఉన్నాయి.
రిజర్వ్ చేసిన 15 షాపుల్లో గౌడ్స్‌కు జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి షాపు–1 వచ్చింది. ఎస్సీలకు 5 షాపులు కేటాయించగా, ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్‌లోని షాపు నంబర్ 9, రైల్వేగేటు సమీపంలోని షాపు నంబర్ 10, బేలలోని షాపు నంబర్ 11, భీంపూర్ మండల కేంద్రంలోని షాపు నంబర్ 18, బజార్‌హత్నూర్ మండలం గిర్నూర్‌లోని షాపు నంబర్ 29 కేటాయించారు. ఎస్టీలకు తొమ్మిది షాపులు రిజర్వ్ కాగా, ఇవన్నీ ఉట్నూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వచ్చాయి.
నేడు నోటిఫికేషన్ జారీ..
నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం జారీ చేయనుంది. వెంటనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనుంది. ఈనెల 18న సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తుకు గడువు ఉంది. 21న లాటరీ పద్ధతిలో వైన్‌షాపులను కేటాయిస్తారు. దరఖాస్తు వివరాలు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే వెల్లడించనున్నట్లు డీపీఈవో హిమశ్రీ ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment