నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్:
జిల్లాలో మొత్తం 142 మద్యం దుకాణా లు ఉండగా, వీటిలో 121 దుకాణాలకు లెసైన్సులు ఇచ్చారు. మిగిలిన 21 దుకాణాలకు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు నోటిఫికేషన్ జారీ చేశారు. అయినా, వ్యాపారులు ముందు కు రావటంలేదు. దీంతో 12 దుకాణాలను డిమాండ్ ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు తరలించారు. మిగిలిన 9 దుకాణాలకు ఈ నెల ఏడున టెండర్లు పిలిచారు. ఈసారి కూడా ఏ ఒక్క వ్యాపారీ టెండర్ వేయలేదు. దీంతో ఆబ్కారీ శాఖ ఆశించిన ఆదాయానికి గండి పడింది. టెండర్ల గడువు చివరి రోజైతే, కనీసం ఒక్క టెండరైనా వేయాలని అధికారులు వ్యాపారులను బతిమాలినా ఫలితం లేకుండా పోయిం ది. బాల్కొండ మండలం ముప్కాల్, ఆర్మూర్ మండలం పెర్కిట్, మామిడిపల్లి, కోటగిరి, ధర్పల్లి, భీంగల్, కామారెడ్డి మండలం దేవుని పల్లి, భిక్కనూర్, బాన్స్‌వాడ మండలం తాడ్కో ల్ దుకాణాలు ఖాళీగా ఉన్నాయి.
నిర్వహణ భారం
మద్యం దుకాణాలు నడిపేందుకు మడిగెలు అద్దెకు తీసుకోవాలంటే నెల అద్దె భారీగా చెల్లిం చాలి. దానికి తోడు అడ్వాన్సులు, గ్రామాలలో ఏటా రూ.36 లక్షల లెసైన్సు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. వ్యాపారులకు మద్యం అమ్మకాలపై 25 శాతం కమీషన్, అది కూడ లెసైన్సు ఫీజు మొత్తానికి ఏడు రెట్లు అమ్మకాలు సాగించేంత వరకే ఇస్తారు. ఆ తరువాత జరిగే అమ్మకాలపై 14.5 శాతం పన్ను విధిస్తున్నారు. ఆబ్కారీ, పోలీసు మామూళ్లు, నజరానాలు, ఇతర ఖర్చు లు వెరసి ఖర్చు తడిసి మోపెడవు తోంది. లాభం మాట దేవుడెరుగు పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అనే పరిస్థితి నెలకొంది. అధికారు లు మద్యం దుకాణాలకు టెండర్ వచ్చేంత వరకు ఒక రకంగా, టెండర్ వచ్చాక మరొక రకంగా ప్రవర్తిస్తుండటంతో వ్యాపారులు భయపడి ముందుకు రావటం లేదని తెలుస్తోంది. ఈ సంవత్సరం లెసైన్సు రెన్యూవల్ పూర్తి అయి ఆరు నెలలు కావస్తోంది. ఖాళీగా ఉన్న దుకాణాలు తీసుకుంటే మిగిలిన నెలలకే లెసైన్సు ఫీజు ఉంటుంది. పర్మిట్ రూములకు రూ. రెండు లక్షలు చెల్లించవలసి ఉంటుంది. పర్మిట్ రూమ్‌కు కూడా మిగిలిన నెలలకు మాత్రమే రెంటల్ చెల్లిస్తామని వ్యాపారులు చెబుతున్నా అధికారులు అంగీకరించడం లేదు.
మళ్లీ టెండర్లు పిలుస్తాం
జిల్లాలో మిగిలిన మద్యం దుకాణాలకు మరోసారి టెండర్లు నిర్వహించనున్నట్లు ఆబ్కారీ సూపరింటెండెంట్ గంగారాం తెలిపారు. ఆయా ప్రాంతాలలో లాభాలు ఎక్కువగా లేకపోవటంతో టెండర్లు రావటంలేదన్నారు.
ఆ మద్యం దుకాణాలు ఇక బంద్!
Published Fri, Dec 13 2013 2:09 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement