సీరియస్‌గా సాగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అపశృతి చోటుచేసుకుంది. మ్యాచ్ అసిస్టెంట్ రిఫరీ తలపై ఒక ఆకతాయి బీర్ బాటిల్ విసరడంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ ఘటన బుండెస్‌లిగా లీగ్‌లో జరిగింది. బోచుమ్, బోరుస్సియా మోయెన్‌చెంగ్లాడ్‌బాచ్ మధ్య శుక్రవారం రాత్రి మ్యాచ్ జరిగింది. హాఫ్ టై ముగిసేసరికి గ్లాడ్‌బాచ్ 2-0తో ఆధిక్యంలో ఉంది. బోచుమ్ జట్టు ఓడిపోతుందన్న విషయాన్ని ఒక ఆకతాయి అభిమాని జీర్ణించుకోలేకపోయాడు.
ఇక రెండో హాఫ్ మొదలైన తర్వాత ఆట 71వ నిమిషంలో అసిస్టెంట్ రిఫరీ క్రిస్టియన్ గిట్టిల్‌మన్‌పై సదరు ఆకతాయి బీర్ బాటిల్‌ను విసిరాడు. అది వచ్చి నేరుగా రిఫరీ తలకు బలంగా తగిలింది. గ్రౌండ్‌లో కూలబడ్డ రిఫరీ నొప్పితో విలవిల్లాలాడు. విషయం తెలుసుకున్న ఇరుజట్ల ఆటగాళ్లు రిఫరీ వద్దకు వచ్చి అతనికి ఎలా ఉందోనని ఆందోళన పడ్డారు. దాదాపు 20 నిమిషాల చర్చ అనంతరం మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మ్యాచ్‌ను సజావుగా జరగనీయకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం కోసం రిఫరీని గాయపరిచినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లీగ్ తెలిపింది.
ఇదిలాఉంటే.. గ్లాడ్‌బాచ్‌కు చెందిన ఒక ఆటగాడు స్టాండ్స్‌లో ఉన్న సదరు ఆకతాయితో గొడవకు దిగాడు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు లేదా.. నీ బుద్దిని కాస్త అదుపులో ఉంచుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. ఇంతలో మిగతా ఆటగాళ్లు వచ్చి సర్దిచెప్పి అక్కడినుంచి తీసుకెళ్లారు. ఈ ఉదంతాన్ని ఇరు క్లబ్‌లు సోషల్ మీడియా వేదికగా ఖండించాయి. ''మేం రిఫరీ లైన్స్‌మన్ క్రిస్టియన్ గిట్టిల్‌మన్‌ను క్షమాపణ కోరుతున్నాం. ఈ విషయం మాకు భరించలేనిది. ఒక ఆకతాయి అభిమాని పిచ్చిగా ప్రవర్తించినందుకు మాకు సిగ్గుగా ఉంది. ఇలాంటివి ఇకపై జరగకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతాం'' అంటూ బోచుమ్ క్లబ్ వెల్లడించింది.
చదవండి: PAK vs AUS: ఏ ముహుర్తానా పాక్ గడ్డపై అడుగుపెట్టిందో అన్ని విచిత్ర పరిస్థితులే; తాజాగా
టీమిండియా బౌలర్ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!
Nick Kyrgios: టెన్నిస్ స్టార్ అసహనం.. మతి పోయిందా ఏమన్నా అయ్యుంటే?
Disgraceful situation at Vonovia Ruhrstadion, where the Bochum-Gladbach Bundesliga clash was abandoned after 71 minutes due to a linesman being struck on the head by an object from the crowd.#BOCBMG
— Sacha Pisani (@Sachk0) March 18, 2022
pic.twitter.com/Yfdn4R2blJ
Comments
Please login to add a commentAdd a comment