సాక్షి, భువనేశ్వర్: ఎలుకల్ని బంధించేందుకు ఏర్పాటు చేసిన బోనులో నాగుపాము చిక్కుకుంది. పూరీ జిల్లాలో ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. డెలాంగు ప్రాంతానికి చెందిన కిరాణా దుకాణం యజమాని సరుకులను ధ్వంసం చేస్తున్న ఎలుకల్ని బంధించేందుకు శనివారం రాత్రి బోను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం దుకాణం తెరిచి చూసేసరికి నాగుపాము చిక్కుకుని ఉన్నట్లు గుర్తించాడు.
విషయాన్ని స్నేక్ హెల్ప్‌లైన్ కార్యదర్శి సువేందు మల్లిక్‌కు తెలియజేయగా, పాముని సురక్షితంగా బయటకు తీసి సంచిలో బంధించాడు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రంగా విడిచి పెట్టారు. 4 అడుగులు ఉన్న ఈ పాము బోనులో చిక్కిన ఎలుకను మింగేందుకు చొరబడినట్లు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment