Rat killer
-
విషాదం.. ఎలుకల కోసం విషం పూసిన టమాట తిని
ముంబై: ఇంట్లో ఎలుకల బెడదను నివారించడానికి ఉపయోగించిన విషం పూసిన టమాటోను తిని ఓ మహిళ మృత్యువాతపడింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ముంబైలోని పశ్చిమ మలాడ్‌లోని మార్వే రోడ్డు పాస్కల్ వాడీలో శుక్రవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండటంతో వాటిని అరెకట్టేందుకు రేఖాదేవి నిషద్(27) రెండు రోజుల క్రితం టమాటాలకు ఎలుకలమందు పూసి ఉంచింది. ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయిన రేఖాదేవి రోజువారీ పనుల్లో నిమగ్నమైపోయింది. అయితే ప్రతిరోజు రేఖాదేవికి టీవీ చూసే అలవాటుంది. ఈ క్రమంలో శుక్రవారం టీవీ చూస్తూ ఎలుకల కోసం మందు పెట్టిన టమాటాలను నూడుల్స్ తయారు చేసుకునేందుకు కట్ చేసింది. మందు రాసిన విషయాన్ని మర్చిపోయి టమాటాలను నూడుల్స్‌లో వేసుకొని తినేసింది. కొద్దిసేపటికి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ అసలు విషయం చెప్పడంతో వైద్యులు చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. చదవండి: గుడ్ న్యూస్.. మంకీపాక్స్ నుంచి కోలుకున్న తొలి బాధితుడు -
గ్లూకోజ్ పౌడర్ అనుకొని..
సాక్షి, వరంగల్: జ్వరంతో బాధపడుతున్న మహిళ గ్లూకోజ్ పౌడర్ అనుకుని ఎలుకల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన గండ్రకోట రేణుక(47) జ్వరంతో బాధపడుతోంది. దీంతో ట్యాబెట్లతో పాటు గ్లూకోజ్ పౌడర్ వాడుతుంది. ఈ క్రమంలో 21వ తేదీ రాత్రి ట్యాబెట్లు వేసుకొని గ్లూకోజ్ పౌడర్ తాగే క్రమంలో కళ్లు సరిగా కనిపించక అక్కడే ఉన్న ఎలుకల మందును నీటిలో కలుపుకుని తాగింది. మరుసటి రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమె కుమారుడు నవీన్‌కు గ్లూకోజ్ పౌడర్ తాగినని చెప్పింది. దీంతో ఇంట్లో పరిశీలించగా గ్లూకోజ్ పౌడర్‌కు బదులు ఎలుకల మందు తాగినట్లు గుర్తించి వెంటనే చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం తరలించాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. చదవండి: వామ్మో! చేపల వలలో భారీ కొండ చిలువ -
ఎరక్కపోయి.. ఇరుక్కుపోయి.. ఎలుకలు పడేందుకు బోన్ ఏర్పాటు చేస్తే..
సాక్షి, భువనేశ్వర్: ఎలుకల్ని బంధించేందుకు ఏర్పాటు చేసిన బోనులో నాగుపాము చిక్కుకుంది. పూరీ జిల్లాలో ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. డెలాంగు ప్రాంతానికి చెందిన కిరాణా దుకాణం యజమాని సరుకులను ధ్వంసం చేస్తున్న ఎలుకల్ని బంధించేందుకు శనివారం రాత్రి బోను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం దుకాణం తెరిచి చూసేసరికి నాగుపాము చిక్కుకుని ఉన్నట్లు గుర్తించాడు. విషయాన్ని స్నేక్ హెల్ప్‌లైన్ కార్యదర్శి సువేందు మల్లిక్‌కు తెలియజేయగా, పాముని సురక్షితంగా బయటకు తీసి సంచిలో బంధించాడు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రంగా విడిచి పెట్టారు. 4 అడుగులు ఉన్న ఈ పాము బోనులో చిక్కిన ఎలుకను మింగేందుకు చొరబడినట్లు భావిస్తున్నారు. -
పిల్లలకు ఎలుకలమందు పెట్టిన తల్లి
సాక్షి, కంకిపాడు: మతిస్థిమితం సరిగా లేక ఓ తల్లి తన పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి, తానూ తిన్న సంఘటన మండలంలోని పునాదిపాడులో చోటుచేసుకుంది. ఆత్మహత్యా యత్నం ఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని పునాదిపాడు గ్రామానికి చెందిన కనకభవానికి మతిస్థిమితం సరిగా లేదు. కనక భవాని పిల్లలు జ్యోతి ప్రసన్న (7), కుమార్ (5). మధ్యాహ్నం సమయంలో పిల్లలు ఇద్దరూ వాంతులు చేసుకోవటాన్ని స్థానికులు గమనించి తల్లి భవానీని ప్రశ్నించారు. ఎలుకల మందు తెచ్చి భోజనంలో కలిపి పిల్లలకు పెట్టి తానూ తిన్నానని చెప్పింది. వెంటనే తల్లిని, పిల్లలను వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యసేవలు అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ప్రాణాపాయం లేదని పోలీసులు సమాచారం అందింది. ఈ మేరకు ఆసుపత్రి వర్గాల నుంచి అందిన సమాచారంతో ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వై.దుర్గారావు తెలిపారు. చదవండి: అమ్మ ఎక్కడంటే ఏం చెప్పాలి.. -
ఎలుకల మందు పరీక్షించబోయి..
కృష్ణా జిల్లా: ఓ యువకుడి తెలివితక్కువతనం అతడి ప్రాణాలు పోయేలా చేసింది. తాను కొనుక్కొచ్చిన మందు సరిగ్గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి రుచి చూశాడు. దీంతో అస్వస్థతకు లోనైన ఆ యువకుడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రాబర్ట్ అనే యువకుడు ముసునూరు మండలంలోని చర్చిలో పాస్టర్‌గా శిక్షణ పొందుతున్నాడు. చర్చిలో ఎలుకల బెడద ఎక్కువగా ఉండటంతో ఎలకల నివారణ మందు తీసుకువచ్చి రుచి చూసి ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాబర్ట్ కిస్పోటా మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ఎలుకలమందు తాగి సేల్స్ ఎగ్జిక్యూటివ్ మృతి
మలక్‌పేట (హైదరాబాద్) : ఎలుకల మందు తాగి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌కు చెందిన జోసఫ్ (37) సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. కాగా శుక్రవారం ముసారంబాగ్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడు. వచ్చిన కొద్దిసేపటికే స్పృహ తప్పి కిందపడిపోయాడు. అతడు విషం తాగి ఉన్నట్లు గమనించిన బంధువులు హూటాహూటిన మలక్‌పేటలోని యశోద ఆసుపత్రి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా విషం తాగడానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా మృతునికి భార్య, కూతురు ఉన్నారు. పని చేస్తున్న సంస్థ యాజమాన్యం ఒత్తిడి వలనే విషం తాగాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.