
రేణుక (ఫైల్ )
సాక్షి, వరంగల్: జ్వరంతో బాధపడుతున్న మహిళ గ్లూకోజ్ పౌడర్ అనుకుని ఎలుకల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన గండ్రకోట రేణుక(47) జ్వరంతో బాధపడుతోంది. దీంతో ట్యాబెట్లతో పాటు గ్లూకోజ్ పౌడర్ వాడుతుంది. ఈ క్రమంలో 21వ తేదీ రాత్రి ట్యాబెట్లు వేసుకొని గ్లూకోజ్ పౌడర్ తాగే క్రమంలో కళ్లు సరిగా కనిపించక అక్కడే ఉన్న ఎలుకల మందును నీటిలో కలుపుకుని తాగింది.
మరుసటి రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమె కుమారుడు నవీన్‌కు గ్లూకోజ్ పౌడర్ తాగినని చెప్పింది. దీంతో ఇంట్లో పరిశీలించగా గ్లూకోజ్ పౌడర్‌కు బదులు ఎలుకల మందు తాగినట్లు గుర్తించి వెంటనే చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం తరలించాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
చదవండి: వామ్మో! చేపల వలలో భారీ కొండ చిలువ
Comments
Please login to add a commentAdd a comment