Bheemadevarapalli
-
‘రుణ యాప్’ వేధింపులతో యువకుడి ఆత్మహత్య
భీమదేవరపల్లి: రుణయాప్‌ల వేధింపులు తాళలేక భీమదే వరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సంది శ్రావణ్‌రెడ్డి(24) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి చొక్కారెడ్డి మూడేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో తల్లి స్వరూప.. శ్రావణ్ దగ్గరే ఉంటోంది. అయితే శ్రావణ్‌రెడ్డి ఫోన్యాప్ ద్వారా రూ.50వేల వరకు రుణం తీసుకున్నాడు. అది మూడు నెలల్లోనే వడ్డీతో కలిపి రూ.1.50 లక్షలకు చేరుకుంది. తిరిగి చెల్లించలేని పరిస్థితి దాపు రించింది. అతని సోదరి శ్రావణి ఇటీవల ప్రస వించడంతో.. తల్లి స్వగ్రామమైన మల్లారం వచ్చింది. మాదాపూర్‌లోని అద్దె ఇంట్లో శ్రావ ణ్ ఒక్కడే ఉన్నాడు. రుణయాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఈనెల 4న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల నుంచి అతను ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అను మానం వచ్చిన ఇంటి యజమాని ఈనెల 6న పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి చూడగా ఉరివేసుకొని చనిపో యి ఉన్నాడు. తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమా ర్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామమైన మల్లారం తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియ లు నిర్వహించారు. -
గ్లూకోజ్ పౌడర్ అనుకొని..
సాక్షి, వరంగల్: జ్వరంతో బాధపడుతున్న మహిళ గ్లూకోజ్ పౌడర్ అనుకుని ఎలుకల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన గండ్రకోట రేణుక(47) జ్వరంతో బాధపడుతోంది. దీంతో ట్యాబెట్లతో పాటు గ్లూకోజ్ పౌడర్ వాడుతుంది. ఈ క్రమంలో 21వ తేదీ రాత్రి ట్యాబెట్లు వేసుకొని గ్లూకోజ్ పౌడర్ తాగే క్రమంలో కళ్లు సరిగా కనిపించక అక్కడే ఉన్న ఎలుకల మందును నీటిలో కలుపుకుని తాగింది. మరుసటి రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమె కుమారుడు నవీన్‌కు గ్లూకోజ్ పౌడర్ తాగినని చెప్పింది. దీంతో ఇంట్లో పరిశీలించగా గ్లూకోజ్ పౌడర్‌కు బదులు ఎలుకల మందు తాగినట్లు గుర్తించి వెంటనే చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం తరలించాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. చదవండి: వామ్మో! చేపల వలలో భారీ కొండ చిలువ -
డిగ్రీ విద్యార్థినికి వేధింపులు.. ఇంటికొచ్చిమరీ ప్రేమించాలంటూ గొడవ!
భీమదేవరపల్లి: ప్రేమిస్తున్నానని వెంటపడుతూ, తరచూ ఫోన్లో వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన డిగ్రీ విద్యార్థిని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నమిండ్ల చంద్రమౌళి–విజయ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు శ్వేత (18) డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మీసాల వంశీ అనే యువకుడు కొన్ని నెలలుగా ప్రేమిస్తున్నా నంటూ వెంటపడుతున్నాడు. ఫోన్లో ఇబ్బందు లకు గురిచేస్తున్నాడు. ఈనెల 24న వంశీతోపాటు అతని స్నేహితుడు మాడ్గల జగదీశ్ ఎవరూలేని సమయంలో శ్వేత ఇంటికి వచ్చి ప్రేమించా లంటూ గొడవ పడ్డారు. అదే సమయంలో తండ్రి చంద్రమౌళి ఇంటికి రావడాన్ని గమనించి వారు వెళ్లిపోయారు. దీంతో మానసిక వేదనకు గురైన శ్వేత శనివారం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు లేని విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో చూడగా అందులో మృతదేహం కనపడింది. మృతురాలి తండ్రి చంద్రమౌళి ఫిర్యాదుతో వంశీ, జగదీశ్‌పై కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు ముల్కనూర్ ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
దీని బండబడ.. ప్రాణం పోవడం ఖాయం
సాక్షి, హైదరాబాద్: దాదాపు వంద మీటర్ల ఎత్తుతో పూర్తి ఏటవాలుగా ఉన్న గుట్ట.. దాన్ని ఆనుకొని పెద్ద లోయ.. ఆ ఏటువాలు శిఖర ప్రాంతంలో ఒకదానిపై ఒకటి పేర్చినట్టు మూడు భారీ గుండ్లు. అవి ఏ క్షణాన జారి అగాధంలో పడతాయోనన్న భావన కలుగుతుంది. అలాంటి గుండ్లలో పైదానిపై నిలబడితే ఏమనిపిస్తుంది? పై ప్రాణం పైనే పోవడం ఖాయమన్న భావన కలుగుతుంది. అలాంటి భయం కలిగేందుకే ఆ సెటప్ అట. అలా భయపెట్టి పన్నులు వసూలు చేసుకొనే వారన్నది ఇప్పుడు స్థానికుల మాట. అందుకే ఆ పేర్చిన బండరాళ్లను శిస్తు రాళ్లుగా స్థానికులు పిలుచుకుంటున్నారు. ఇది కాకతీయుల కాలానికి చెందినదై ఉంటుందంటున్నారు. కానీ దానికి స్థానికంగా శాసనపూరిత ఆధారాలు లేవు. నోటి మాటల ద్వారా పూర్వకాలం నుంచి వచ్చిన ప్రచారమది. నాయకార్ల పనేనా..? కాకతీయ సామ్రాజ్యంలో పాలన స్వర్ణయుగంగానే చెప్తారు. ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు చక్రవర్తులు ఎన్నో చర్యలు తీసుకున్నారనడానికి ఆధారాలు ఉన్నాయి. వ్యవసాయం కోసం గొలుసుకట్టు చెరువులు తవి్వంచి ఇప్పుడు తెలంగాణలో ఏ మూలకెళ్లినా వందల చెరువులు దర్శనమివ్వడం వారి చలవే. వారి పాలనలో ప్రజలను పన్నుల కోసం పీడించిన దాఖలాలు లేవు. అయితే పాలనా సౌలభ్యం కోసం వారి హయాంలో నాయకార్ వ్యవస్థ ఏర్పాటైంది. స్థానికంగా కొంత ప్రాంతంపై వారి అజమాయిషీ ఉండేది. పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి అందించడం కూడా వారి విధి. ఇలాంటి బాధ్యతలున్న ఒకరిద్దరు చేసిన దాషీ్టకాల్లో ఈ గుండు కూడా ఒకటి అయి ఉంటుందన్నది చరిత్రకారుల మాట. ప్రస్తుత వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామ శివారులోని గుట్టపై ఈ ‘శిస్తు గుండ్లు’న్నాయి. ఈ గుట్టపై ఇతర చారిత్రక ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. కాకతీయులు నిర్మించిన కోట గోడ తరహా నిర్మాణంతోపాటు హరప్పా, కాలీబంగలలో వెలుగు చూసిన టెర్రకోటా ఫలకాల తరహావి ఇక్కాడా కనిపించాయి. మట్టితో చిన్న బిళ్లలుగా చేసి కాల్చి అనంతరం వాటిని టైల్స్గా ఇళ్లలో ఏర్పాటు చేసుకొనేవారు. డంగు సున్నం పూత పూసి దానిపై ఈ బిళ్లలు అతికించేవారు. ఈ చారిత్రక ఆధారాల మధ్య ప్రత్యేకాకర్షణగా ఈ నిలువు గుండ్లున్నాయి. స్థానిక నాయకార్ ఈ ప్రాంతంలో ప్రజలను భయభ్రాంతుకులకు గురిచేసి మరీ పన్నులు వసూలు చేసేందుకే ఈ ఏర్పాటు చేసి ఉంటారన్నది ఓ వాదన. పూర్వం నుంచి ప్రచారం... గుట్ట వాలును కొంత మేర తొలిచి మరింత వాలు చేశారు. దానిపైన పెద్ద బండరాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చారు. పన్ను కట్టని వారిని వాటిపై నిలబెట్టే వారని, కింద లోయలోకి జారి పడిపోతామన్న భయంతో వారు పన్ను చెల్లించేవారని, అలా ఒకరిని భయపెడితే మిగతా వారు పన్ను ఎగ్గొట్టే సాహసం చేసే వారు కాదని స్థానికులు పేర్కొన్నారు. అలా పూర్వకాలం నుంచి మౌఖికంగా ఈ ప్రచారం సాగుతోంది. దానికి ప్రత్యేకాధారాలంటూ అక్కడ లేవు. కాకతీయుల కాలంలోనే దాన్ని ఏర్పాటు చేశారన్నదానికీ ఆధారాలు లేవు. కానీ అది శిస్తుబండ అని గ్రామస్తులు చెబుతున్నారు. – ఔత్సాహిక పరిశోధకుడు, రత్నాకరరెడ్డి ఇది జనగామ జిల్లా బానాజిపేట గ్రామంలో గడి ముందు ఉన్న నిలువురాయి. నిజాంల దాషీ్టకానికి నిలువెత్తు నిదర్శనం. దాన్ని లాల్ కనీ(కడీ)గా పిలుస్తారు. శిస్తు చెల్లించని వారిని, రజాకార్లకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని దీనికి కట్టేసి కొట్టేవారు. బొడ్రాయి తరహాలో ఇది ఊరు మధ్యలో ఉంది. ఇప్పటికీ ఈ రాయిని అలాగే ఉంచడం గమనార్హం. -
మహిళా రైతు ఆత్మహత్య
భీమదేవరపల్లి (కరీంనగర్) : అప్పులబాధ తాళలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కట్కూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పంజా లక్ష్మి(45) తనకున్న రెండెకరాలలో పత్తి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు రూ. 4 లక్షలు ఉండటంతో వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.