శ్రావణ్‌రెడ్డి
భీమదేవరపల్లి: రుణయాప్‌ల వేధింపులు తాళలేక భీమదే వరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సంది శ్రావణ్‌రెడ్డి(24) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి చొక్కారెడ్డి మూడేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో తల్లి స్వరూప.. శ్రావణ్ దగ్గరే ఉంటోంది. అయితే శ్రావణ్‌రెడ్డి ఫోన్‌యాప్ ద్వారా రూ.50వేల వరకు రుణం తీసుకున్నాడు. అది మూడు నెలల్లోనే వడ్డీతో కలిపి రూ.1.50 లక్షలకు చేరుకుంది.
తిరిగి చెల్లించలేని పరిస్థితి దాపు రించింది. అతని సోదరి శ్రావణి ఇటీవల ప్రస వించడంతో.. తల్లి స్వగ్రామమైన మల్లారం వచ్చింది. మాదాపూర్‌లోని అద్దె ఇంట్లో శ్రావ ణ్ ఒక్కడే ఉన్నాడు. రుణయాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఈనెల 4న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల నుంచి అతను ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అను మానం వచ్చిన ఇంటి యజమాని ఈనెల 6న పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి చూడగా ఉరివేసుకొని చనిపో యి ఉన్నాడు. తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమా ర్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామమైన మల్లారం తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియ లు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment