
కృష్ణా జిల్లా: ఓ యువకుడి తెలివితక్కువతనం అతడి ప్రాణాలు పోయేలా చేసింది. తాను కొనుక్కొచ్చిన మందు సరిగ్గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి రుచి చూశాడు. దీంతో అస్వస్థతకు లోనైన ఆ యువకుడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో చోటుచేసుకుంది.
స్థానికంగా నివాసముంటున్న రాబర్ట్ అనే యువకుడు ముసునూరు మండలంలోని చర్చిలో పాస్టర్‌గా శిక్షణ పొందుతున్నాడు. చర్చిలో ఎలుకల బెడద ఎక్కువగా ఉండటంతో ఎలకల నివారణ మందు తీసుకువచ్చి రుచి చూసి ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాబర్ట్ కిస్పోటా మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.