
ముంబై: ఇంట్లో ఎలుకల బెడదను నివారించడానికి ఉపయోగించిన విషం పూసిన టమాటోను తిని ఓ మహిళ మృత్యువాతపడింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ముంబైలోని పశ్చిమ మలాడ్లోని మార్వే రోడ్డు పాస్కల్ వాడీలో శుక్రవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండటంతో వాటిని అరెకట్టేందుకు రేఖాదేవి నిషద్(27) రెండు రోజుల క్రితం టమాటాలకు ఎలుకలమందు పూసి ఉంచింది. ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయిన రేఖాదేవి రోజువారీ పనుల్లో నిమగ్నమైపోయింది.
అయితే ప్రతిరోజు రేఖాదేవికి టీవీ చూసే అలవాటుంది. ఈ క్రమంలో శుక్రవారం టీవీ చూస్తూ ఎలుకల కోసం మందు పెట్టిన టమాటాలను నూడుల్స్ తయారు చేసుకునేందుకు కట్ చేసింది. మందు రాసిన విషయాన్ని మర్చిపోయి టమాటాలను నూడుల్స్‌లో వేసుకొని తినేసింది. కొద్దిసేపటికి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ అసలు విషయం చెప్పడంతో వైద్యులు చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది.
చదవండి: గుడ్ న్యూస్.. మంకీపాక్స్ నుంచి కోలుకున్న తొలి బాధితుడు
Comments
Please login to add a commentAdd a comment