దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా మరో కాంపాక్ట్ ఎస్‌యూవీని 'కైలాక్' (Kylaq) పేరుతో లాంచ్ చేసింది. ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ కారును లాంచ్ చేసింది. దీని ధర రూ. 7.89 లక్షలతో ప్రారంభమవుతుంది. ఈ కారు కోసం 2024 డిసెంబర్ 2 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభమవుతుంది.
ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఇతర స్కోడా కార్ల కంటే కైలాక్ కొంత భిన్నంగా ఉండటం చూడవచ్చు. 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందిన ఈ ఎస్‌యూవీ డ్యూయల్ డిజిటల్ స్క్రీన్‌లు, పవర్డ్ డ్రైవర్ సీట్, లెథెరెట్ అప్హోల్స్టరీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్, సిక్స్-స్పీకర్ కాంటన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది.
ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్‌లు, హెడ్‌రెస్ట్‌లు, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా కైలాక్ కారులో అందుబాటులో ఉన్నాయి. 189 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ కారు బూట్ స్పేస్ 1265 లీటర్ల వరకు ఉంటుంది.
స్కోడా కైలాక్ 1.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 114 Bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ కొత్త కారు మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, మారుతి ఫ్రాంక్స్, బ్రెజ్జా, టయోటా టైసర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment