రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం! | Best Cars Under Rs 15 Lakh in India | Sakshi
Sakshi News home page

రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!

Published Fri, Dec 20 2024 7:26 PM | Last Updated on Fri, Dec 20 2024 8:03 PM

Best Cars Under Rs 15 Lakh in India

కరోనా మహమ్మారి వ్యాపించిన తరువాత చాలామంది సొంతగా కారు ఉంటే బాగుంటుందని భావించారు. ఆ తరువాత కొంతమంది కార్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. అయితే ఇందులో కొందరు రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లను కొనుగోలు చేస్తే.. మరికొందరు రూ. 20 లక్షల లోపు ధర వద్ద లభించే కార్లను కొనుగోలు చేయడానికి మక్కువ చూపించారు. మనం ఈ కథనంలో రూ.15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు ఏవి? వాటి వివరాలు ఏమిటనే విషయాలను తెలుసుకుందాం.

హోండా సిటీ
హోండా అంటే ముందుగా గుర్తొచ్చే కారు 'సిటీ'. ఈ కారు ప్రారంభ ధర రూ. 11.82 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 117 Bhp పవర్, 145 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. హోండా సిటీ 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్‌తో స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్‌ వంటి వాటితో పాటు.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఐసోఫిక్స్ యాంకర్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

స్కోడా స్లావియా
స్కోడా స్లావియా ప్రారంభ ధర రూ.10.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 8 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ క్లస్టర్‌తో పాటు.. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేసే 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్
ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన వర్టస్ కారు కూడా రూ.15 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న ఉత్తమ మోడల్. ఈ కారు ప్రారంభ ధర రూ.10 .89 లక్షలు. ఇది కూడా రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులో 8 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మొదలైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు.. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇది క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీంతో మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.

హ్యుందాయ్ వెర్నా
రూ. 11 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభిస్తున్న హ్యుందాయ్ వెర్నా కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. ఇది 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్ పొందుతుంది. ఈ కారు కూడా క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి.. అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.

ఇదీ చదవండి: భారత్‌లోని 5 బెస్ట్ ఫ్యామిలీ కార్లు ఇవే!

మారుతి సుజుకి సియాజ్
2014లో మొదటిసారి దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన మారుతి సుజుకి కంపెనీకి చెందిన 'సియాజ్' ఆ తరువాత కాలంలో అనేక అప్డేట్స్ పొందింది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.9.40 లక్షల నుంచి రూ.12.30 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. సియాజ్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.5 లీటర్ కే15 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement