Rs 15 lakh
-
ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని మోదీలా అబద్దాలు చెప్పం: రాహుల్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. అధికార బీజేపీపై విమర్శల జోరు పెంచింది. ఈ క్రమంలోనే ఉడుపిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీలా తాము అబద్దపు వాగ్ధానాలు చేయబోమని ధ్వజమెత్తారు. 'ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం. నల్లధనంపై పారాటం కోసమే పాత నోట్లు రద్దు చేస్తున్నాం. ఇలా మోదీలా మేము అబద్దాలు చెప్పం' అని రాహుల్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఎప్పుడైనా చేసేదే చెప్తుందని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తుందని రాహుల్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్లో ఇలానే చేశామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 13న ఒకే విడతలో జరగనున్నాయి. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ చెబుతుండగా.. 150 స్థానాలకు పైగా కైవసం చేసుకుని కమలం పార్టీని ఓడిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. చదవండి: ఆయన కచ్చితంగా గెలుస్తారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. రక్తంతో లేఖ రాసిన కార్యకర్త.. -
ఆ మాజీ సీఎం భార్యకు నెలకు రూ.15 లక్షలివ్వాలట
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాజీ భార్య పాయల్ అబ్దుల్లా తాను తన బిడ్డల జీవనం కోసం నెలకు రూ.15లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు మెట్లెక్కింది. ప్రభుత్వ నివాసం ఖాళీ చేసిన తర్వాత తాను పిల్లలతో సహా రోడ్డున పడ్డానని, చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా పోయిందని, తమ పోషణార్ధం నెలకు రూ.15లక్షలు ఇవ్వాల్సిందేనని ఆమె పిటిషన్లో డిమాండ్ చేశారు. అక్బర్ రోడ్డులోని ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయించాలని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నెల రోజులకే ఆమె ఈ పిటిషన్ వేయడం గమనార్హం. నిర్వహణా ఖర్చుల కింద తనకు తన ఇద్దరు పిల్లలకు నెలకు రూ.10లక్షలు ఇవ్వాలని, కొత్తగా ఓ నివాసంలో ఉండేందుకు నెలకు రూ.5లక్షలు ఇవ్వాలని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పాయల్ తల్లిదండ్రుల దయ వల్ల ఆమె స్నేహితుల ఇంట్లో తలదాచుకుంటున్నారని, వారి జీవితం చాలా దుర్భరంగా ఉందని పిటిషన్లో చెప్పారు. గతంలో తమకు జెడ్ జెడ్ ప్లస్ కేటగిరి కింద రక్షణ ఉండేదని, ఇప్పుడది కాస్త పోవడంతో భద్రతకు కూడా భంగం ఏర్పడిందని చెప్పారు. అయితే, దీనిపై బదులు ఇవ్వాల్సిందిగా నగరంలోని ఫ్యామిలీ కోర్టు ఒమర్ కు నోటీసులు పంపించింది. కేసు విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది.