చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ 'స్కోడా' (Skoda) భారతీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. స్లావియా, ఆక్టావియా అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న సంస్థ ఇప్పుడు కుషాక్ న్యూ ఎడిషన్ 'ఒనిక్స్' (Onyx) విడుదల చేసింది. దీని గురించి మరిన్ని ఈ కథనంలో చూసేద్దాం..
ధర:
భారతీయ విఫణిలో విడుదలైన కుషాక్ ఒనిక్స్ ఎడిషన్ ధర రూ. 12.39 లక్షలు. ఇది దాని స్టాండర్డ్ బేస్ మోడల్ కంటే రూ. 80,000 ఎక్కువ. ఈ కొత్త వెర్షన్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న కుషాక్ యాక్టివ్, యాంబిషన్ ట్రిమ్‌ల మధ్యలో ఉంటుంది.
ఎక్ట్సీరియర్ ఫీచర్స్:
ఒనిక్స్ ఎడిషన్ చూడటానికి దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. డోర్‌లపై స్టైలైజ్డ్ గ్రే గ్రాఫిక్స్, B-పిల్లర్‌పై 'ఓనిక్స్' బ్యాడ్జింగ్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఫ్రంట్ బంపర్‌పై ఫాక్స్ డిఫ్యూజర్, ఫ్రంట్ గ్రిల్‌పై క్రోమ్ సరౌండ్, సైడ్ ప్రొఫైల్‌లో 16 ఇంచెస్ స్టీల్ వీల్స్ ఉన్నాయి.
ఫీచర్స్:
లోపలి భాగంలో 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్, 6 స్పీకర్ ఆడియో సిస్టమ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, హెడ్‌రెస్ట్‌లపై ఒనిక్స్ బ్యాడ్జింగ్, బ్లాక్ అండ్ వైట్ ఇంటీరియర్ కలర్ థీమ్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఎయిర్ ప్యూరిఫైయర్‌తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.
ఇంజిన్ & పర్ఫామెన్స్:
ఇంజిన్ విషయానికి వస్తే, స్టాండర్డ్ కుషాక్ మల్టిపుల్ ఇంజిన్ ఆప్సన్స్ పొందినప్పటికీ ఒనిక్స్ ఎడిషన్ మాత్రం 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ మాత్రమే పొందుతుంది. ఇది 114 బీహెచ్‌పి పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జతచేయబడుతుంది.
సేఫ్టీ ఫీచర్స్:
భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన వాహనాల జాబితాలో ఒకటి కుషాక్. కావున ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, త్రీ పాయింట్ పాయింట్ సీట్‌బెల్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX ఎంకరేజ్ వంటివి ఉంటాయి.
ప్రత్యర్థులు:
ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త ఒనిక్స్ ఎడిషన్ మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హ్యుందాయ్ క్రెటా, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఇది అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment