Apple discontinues 4 iPhones: ఐఫోన్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను యాపిల్ (Apple) ప్రకటించింది. తాజాగా జరిగిన వండర్లస్ట్ ఈవెంట్‌లో కొత్త ఐఫోన్ 15 సిరీస్ (Apple iPhone 15 Series)ను లాంచ్ చేసింది. మరోవైపు పలు ఐఫోన్ మోడళ్లను భారతీయ మార్కెట్లో అధికారికంగా నిలిపేసింది.
నిలిపేసిన ఐఫోన్లు ఇవే..
యాపిల్ నిలిపేసిన ఐఫోన్ మోడల్‌లలో ఐఫోన్ 12 (iPhone 12), ఐఫోన్ 13 మినీ, (iPhone 13 mini), ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max) ఉన్నాయి. గత ఏడాది రూ. 1,39,900 ధరతో విడుదలైన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్‌ను అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించింది. అలాగే గతేడాదిలోనే రూ. 1,29,900 ధరతో లాంచ్ చేసిన ఐఫోన్ 14 ప్రో మోడల్‌ను కూడా భారత మార్కెట్‌లో నిలిపివేసింది.
(జాబ్ ఇంటర్వ్యూలో అరెస్టయిన యువతి.. ఈ కిలాడి మోసం గురించి తెలిస్తే అవాక్కవుతారు!)
ఇక 2021లో రూ. 69,900లకు విడుదలైన ఆపిల్ ఐఫోన్ 13 మినీకి కూడా యాపిల్ వీడ్కోలు పలికింది. నిలిపివేసిన ఐఫోన్లలో మోడల్‌లలో ఐఫోన్ 12 కూడా ఉంది. 2020లో ఐఫోన్ 12 బేస్ 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 59,900 ధరతో లాంచ్ అయింది. అయితే ఇప్పటికీ ఈ పాత ఐఫోన్ మోడల్‌లపై ఆసక్తి ఉన్నవారు అమెజాన్, ఫ్టిప్‌కార్ట్ వంటి థర్డ్-పార్టీ రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఆయా సంస్థలు తమ వద్ద స్టాక్ ఉన్నంత వరకూ వీటిని విక్రయిస్తాయి.
ఐఫోన్ 15 సిరీస్ ధరలు ఇవే..
కాగా యాపిల్ కొత్తగా ప్రకటించిన ఐఫోన్ 15 సిరీస్ ధరలు ఇలా ఉన్నాయి. ఐఫోన్ 15 (iPhone 15) ప్రారంభ ధర రూ. 79,900. ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus) ధర రూ. 89,900. ఇక ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro) ప్రారంభ ధర రూ. 1,34,900 కాగా, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ధర రూ. 1,59,900 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్లకు ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. అధికారిక సేల్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment