డెఫినేట్లీ మేల్ ట్యాగ్‌లైన్‌తో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పల్సర్ బైక్ రెండు దశాబ్ధాలు దాటినా చెక్కు చెదరని ఆదరణ పొందుతోంది. ఏ సెగ్మెంట్‌లో ఈ మోడల్ రిలీజ్ చేసినా.. అక్కడ తన సత్తా చూపుతోంది. ఆర్నెళ్ల కిందట 250 సీసీ సెగ్మెంట్‌లో పల్సర్ ఎన్ 250, పల్సర్ ఎఫ్ 250 బైకులను రిలీజ్ చేయగా అమ్మకాల్లో దుమ్మురేపాయి. కేవలం ఆర్నెళ్ల కాలంలోనే 10వేలకు పైగా బైకులు అమ్ముడైపోయినట్టు బజాజ్ తెలిపింది.
గడిచిన ఆర్నెళ్ల కాలంలో 250 సీసీ రేంజ్‌లో బైకుల అమ్మకాలను పరిశీలిస్తే సుజూకి జిక్సర్ 250 సీసీ, కేటీఎం 250 డ్యూక్ , యమహా ఎఫ్‌జెడ్ 25లతో పోల్చితే బజాజ్ పల్సర్ ఎన్ 250, ఎఫ్ 250 బైకుల అమ్మకాలు ఎక్కువగా సాగినట్టు బజాజ్ తెలిపింది. 2021లో ఈ మోడల్ మార్కెట్‌లోకి వచ్చినప్పుడు వీటి ధర రూ.1.38 నుంచి రూ.1.40 లక్షలు ఉండగా ఇటీవల పెంచిన ధరలతో ప్రస్తుత ధర రూ.1.44 నుంచి రూ. 1.45 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది. రేసింగ్ రెడ్, టెక్నో గ్రీన్, గ్లాసీ బ్లూ రంగుల్లో ఈ బైకు లభిస్తోంది.
చదవండి: జిగేల్‌మనే అవిన్యా...ఈవీ!
Comments
Please login to add a commentAdd a comment