Bajaj Pulsar 220F launched in India; check details - Sakshi
Sakshi News home page

బజాజ్ పల్సర్ 220ఎఫ్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?

Published Tue, Feb 21 2023 10:03 AM | Last Updated on Tue, Feb 21 2023 10:48 AM

Bajaj pulsar 220f launched in india price details - Sakshi

అమ్మకాల పరంగా భారతీయ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన 'బజాజ్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో 'పల్సర్ 220ఎఫ్' విడుదల చేసింది. ఈ ఆధునిక బైక్ ధర రూ. 1,39,686 (ఎక్స్-షోరూమ్).

బజాజ్ పల్సర్ మొదటిసారిగా తన 220ఎఫ్ బైకుని 2007లో విడుదల చేసి గొప్ప అమ్మకాలను పొందింది, ఆ తరువాత ఎన్250, ఎఫ్250 బైక్స్ విడుదల చేసి 220ఎఫ్ మోడల్ నిలిపివేసింది, అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మోడల్ రీ లాంచ్ చేసింది. ఈ బైక్  కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి.

కలర్ ఆప్సన్స్

కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ బ్లూ బ్లాక్, రెడ్ బ్లాక్ వంటి మూడు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్సన్స్‌లో విడుదల చేసింది. కంపెనీ తన బైకులను కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో విక్రయిస్తోంది.

ఇంజిన్ & పర్ఫామెన్స్

బజాజ్ పల్సర్ 220ఎఫ్ 220 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి 20.9 బిహెచ్‌పి పవర్, 18.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిఉంటుంది. ఈ బైక్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, సింగిల్ ఛానల్ ABS పొందుతుంది. అదే సమయంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ & వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్ కలిగి ఉంది.

డిజైన్

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ డిజైన్ పరంగా మునుపటి మోడల్ మాదిరిగా అనిపిస్తుంది. ఈ బైక్ భారీ ఫ్రంట్ ఫాసియా, స్ప్లిట్ సీటు, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వంటి వాటితో పాటుఎల్ ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ పొందుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement