ఇటీవల ఆటోకార్ అవార్డ్స్ 2023లో కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా సొంతం చేసుకోగా, బైక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని 'జాజ్ పల్సర్ ఎన్160' దక్కించుకుంది. మొత్తం 22 అవార్డులలో ఏ వాహనం ఏ అవార్డ్ దక్కించుకుందో ఇక్కడ చూడవచ్చు.
మారుతి గ్రాండ్ విటారా అగ్ర గౌరవం అందుకోవడం మాత్రమే కాకుండా.. మిడ్‌సైజ్ ఎస్‌యువి ఆఫ్ ది ఇయర్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. మహీంద్రా స్కార్పియో ఎన్ 'ఆఫ్-రోడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు'ను మారుతి సుజుకి బాలెనొ హ్యాచ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని కైవసం చేసుకున్నాయి.
లగ్జరీ సెడాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఎస్-క్లాస్, ఎగ్జ్‌క్యూటివ్ ఇయర్ ఆఫ్ ది అవార్డు విజేతగా హ్యుందాయ్ టక్సన్, ఎంపివి ఆఫ్ ది ఇయర్‌గా ఇన్నోవా హైక్రాస్, లగ్జరీ ఎస్‌యువి ఆఫ్ ది ఇయర్ టైటిల్ విన్నర్‌గా ఆడి క్యూ3, గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ టాటా టియాగో ఈవి, ప్రీమియం బైక్ ఆఫ్ ది ఇయర్ విన్నర్ సుజుకి కటన, మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని టాటా మోటార్స్ సొంతం చేసుకున్నాయి.
ఆటోకార్ అవార్డ్స్ 2023లో కొత్త మహీంద్రా స్కార్పియో ఎన్ వ్యూయర్స్ ఛాయిస్ అవార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భగా మహీంద్రా కంపెనీ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' కూడా ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరిశ్రమకు సంబంధించి, 2022 పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని మహీంద్రా & మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ సొంతం చేసుకున్నారు
Comments
Please login to add a commentAdd a comment