ప్రముఖ టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో పల్సర్ శ్రేణిలో పలు బైక్ల ధరలను కాస్త పెంచింది. పల్సర్ మోడల్‌లోని Pulsar N250 , Pulsar F250 బైక్ల ధరలను పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా బజాజ్ పల్సర్ బైక్స్‌లో అత్యంత ఆదరణ పొందిన Pulsar 220F బైక్ ధరను కూడా పెంచింది. ఈ బైక్లను కొద్ది రోజుల క్రితమే బజాజ్ లాంచ్ చేసింది.
పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి..!
పల్సర్ 220F ధరను బజాజ్ ఆటో రూ. 660కు పెంచింది. ఇప్పుడు దీని ధర రూ. 1.34 లక్షలుగా ఉండనుంది. మరోవైపు, కొత్త పల్సర్ F250 బైక్ స్వల్పంగా రూ. 915 పెంపును అందుకుంది. కాగా పల్సర్ F250 నేకెడ్ మోడల్ కొంచెం అధికంగా పెరిగింది. పల్సర్ F250 నేకెడ్ మోడల్‌పై రూ.1180 పెంచగా, ప్రస్తుత ధర రూ. 1.41 లక్షలకు చేరింది (ఎక్స్-షోరూమ్).
ధరల పెంపు కొత్తేమి కాదు..!
గత పన్నెండు నెలల వ్యవధిలో పల్సర్ మేకర్ బజాజ్ ఆటో తన ఉత్పత్తుల ధరలను అనేకసార్లు పెంచింది. గత ఏడాది బజాజ్ విడుదల చేసిన 2021 పల్సర్ 250 ధరలను కూడా పెంచింది. ఇక సంప్రదాయ బైక్లకు స్వస్తి పలుకుతూ... బజాజ్ ఆటో ఇప్పుడు తన ఈవీ ఉత్పత్తిని కూడా పెంచాలని యోచిస్తోంది. పూణే సమీపంలో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంట్ కోసం రూ. 300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది . ఈ ప్లాంట్ నుంచి బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ ఒక ఏడాదికి 5 లక్షల ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కల్గి ఉంది.
చదవండి: 111 ఏళ్ల తరువాత రోల్స్ రాయిస్ సంచలన నిర్ణయం..!
Comments
Please login to add a commentAdd a comment