ఆ బైక్‌ మోడళ్ల ధరలు పెంచిన బజాజ్‌.. ఎంతంటే? | Bajaj Announces Price Hike Pulsar Dominar Up To Rs 6400 | Sakshi
Sakshi News home page

Bajaj Pulsar Price Hike.. ఆ బైక్‌ మోడళ్ల ధరలు పెంచిన బజాజ్‌.. ఎంతంటే?

Published Wed, Jul 13 2022 3:53 PM | Last Updated on Wed, Jul 13 2022 9:08 PM

Bajaj Announces Price Hike Pulsar Dominar Up To Rs 6400 - Sakshi

బజాజ్ కంపెనీ తమ బైక్‌లలోని కొన్ని మోడళ్ల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపులో అత్యధికంగా డామినార్ 250 ధర రూ.6,400 పెరిగి రూ.1.75 లక్షలు కాగా, డామినార్ 400 ధర రూ.1,152 పెరిగి రూ.2.23 లక్షలకు చేరింది. వీటితో పాటు పల్సర్ సిరీస్‌ బైక్‌ల ధరలు కూడా పెరిగాయి.

పల్సర్ N250 ధర రూ.1,299 పెరగగా, పల్సర్ NS200, RS200 ధరలు వరుసగా రూ.999,  రూ.1,088 పెరిగాయి. పల్సర్ 125, 150, NS125, NS160 ధరలు కూడా పెరిగాయి.


అవెంజర్ 220, అవెంజర్ 160 ధరలు కూడా రూ.1000 లోపు పెంచింది. ప్లాటినా 100 డ్రమ్‌ కమమ్యూటర్‌ ధర రూ.1,978 పెరిగి రూ. 63,130కు చేరగా, ప్లాటినా 110, CT100X ధర కూడా పెంచింది.

చదవండి: Whatsapp: ఆ వాట్సాప్‌ వాడుతున్నారా! అయితే వెంటనే డెలీట్‌ చేయండి.. లేదంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement