మార్కెట్లోకి సరికొత్త టీవీఎస్‌ బైక్‌ : ధర? | TVS Raider 125 launched in India, Priced from RS 77500 | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి సరికొత్త టీవీఎస్‌ బైక్‌ : ధర?

Sep 17 2021 9:09 PM | Updated on Sep 17 2021 9:10 PM

TVS Raider 125 launched in India, Priced from RS 77500 - Sakshi

TVS Raider 125 launched in India ప్రముఖ బైక్ తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ మార్కెట్లలోకి మరో కొత్త రైడర్ స్పోర్ట్స్ బైక్ ప్రవేశపెట్టింది. దీని ధర ₹77,500(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ కొత్త టీవీఎస్ బైక్ 125 సీసీ సింగిల్ సిలిండర్ తో వచ్చింది.

ప్రముఖ బైక్ తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ మార్కెట్లలోకి మరో కొత్త రైడర్ స్పోర్ట్స్ బైక్ ప్రవేశపెట్టింది. దీని ధర ₹77,500(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ కొత్త టీవీఎస్ బైక్ 125 సీసీ సింగిల్ సిలిండర్ తో వచ్చింది. ఇది బజాజ్‌ పల్సర్‌ 125, ది హోండా సీబీ షైన్‌ ఎస్‌పీ బైక్లకు పోటీగా 2021 టీవీఎస్‌ రైడర్‌ నిలవనుంది. 2021 టీవీఎస్‌ రైడర్‌ బైక్‌ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌(డే టైమ్ రన్నింగ్‌ ల్యాప్స్‌), అల్లాయ్‌ వీల్స్‌, టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్స్‌, మోనో షాక్‌, ఎల్‌ఈడీ ల్యాంప్స్‌తో వచ్చింది.

ఈ బైక్‌లో డిజిటల్‌ రివర్స్‌ డిస్‌ప్లే కూడా ఉంది. స్పోర్టీ లూక్‌తో 2021 టీవీఎస్‌ రైడర్‌ మరింత ఆకర్షణీయంగా ఉంది. రైడర్ టీవీఎస్ స్మార్ట్ క్సోనెక్ట్ వేరియెంట్ తో 5 అంగుళాల టిఎఫ్ టీ క్లస్టర్ తో వస్తుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసీస్ట్ అందిస్తుంది. దీనిలో మరింత భద్రత కోసం సీబీబిఎస్ ఆప్షన్ ఇచ్చారు. మోటార్ సైకిల్ 124 సీసీ, సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 11.32 హెచ్‌పీ శక్తిని, 11.2 ఎన్‌ఎం టార్క్‌ని ప్రొడ్యూస్‌ చేస్తుంది. ఫైవ్‌ స్పీడ్‌ సూపర్-స్లిక్  గేర్‌బాక్స్‌ కలిగిన ఈ బైక్‌ ఈ సెగ్మెంట్‌లో అత్యంత శక్తిమంతమైనది. ఎకో, పవర్ అనే రెండు  రైడింగ్ మోడ్స్ తో వచ్చిన ఇదే మొట్టమొదటి మోటార్ సైకిల్.(చదవండి: దేశంలో ఈ నగరాల మధ్య తొలి ఎలక్ట్రిక్ హైవే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement