Bajaj Auto bike
-
బజాజ్ పల్సర్ ఎన్125
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో పల్సర్ శ్రేణిలో కొత్తగా ఎన్125 ప్రవేశపెట్టింది. 124.59 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ స్పార్క్, 2 వాల్వ్ ఇంజన్ పొందుపరిచారు. 8,500 ఆర్పీఎం వద్ద 12 పీఎస్ పవర్, 6,000 ఆర్పీఎం వద్ద 11 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. ఎల్ఈడీ డిస్క్ బీటీ, ఎల్ఈడీ డిస్క్ వేరియంట్లలో లభిస్తుంది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.98,707 ఉంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తి డిజిటల్ ఎల్సీడీ స్పీడోమీటర్, మోనోషాక్ సస్పెన్షన్, ఐఎస్జీ సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, 5 స్పీడ్ ట్రాన్స్మిషన్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వంటి హంగులు జోడించారు. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 9.5 లీటర్లు. -
అందరికి తెలిసిన బైక్ లాంచ్ చేయనున్న బజాజ్ - పూర్తి వివరాలు
బజాజ్ ఆటో భారతీయ మార్కెట్లో మళ్ళీ తన అవెంజర్ 220 బైక్ లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న బజాజ్ క్రూజ్ 220, బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 సరసన స్ట్రీట్ 220. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విఫణిలో విడుదలకానున్న కొత్త అవెంజర్ 220 బైక్ చూడటానికి దాని స్ట్రీట్ 160 మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో రౌండ్ హెడ్ లాంప్, బ్లాక్డ్ అవుట్ ఇంజిన్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, పిలియన్ బ్యాక్ రెస్ట్, ఒక చిన్న ఫ్లైస్క్రీన్ మరియు ప్లాట్ హ్యాండిల్ బార్ వంటివి ఉన్నాయి. బజాజ్ అవెంజర్ 220 బైక్ 200 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 18.7 bhp పవర్, 17.5 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ ఇంజిన్ లేటెస్ట్ బిఎస్ 6 ఫేజ్ 2 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ పొందింది. కావున మంచి పనితీరుని అందిస్తుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) ఈ బికా ధరలను ఇంకా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది అవెంజర్ క్రూజ్ 220 కంటే తక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. దీని ధర బహుశా రూ. 1.40 లక్షలు ఉండవచ్చు. ఈ బైక్ గురించి గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
2022లో మోస్ట్ పాపులర్ కారు, బైక్.. మీకు తెలుసా?
భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ డ్రూమ్ “ఇండియా ఆటోమొబైల్ ఇకామర్స్ రిపోర్ట్ 2022” పేరుతో వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కార్ల విభాగంలో హ్యుందాయ్ క్రెటా, బైక్స్ విభాగంలో బజాజ్ పల్సర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలుగా గుర్తింపు పొందాయి. మన దేశంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా కీర్తి పొందగలిగింది. దేశంలో ప్రస్తుతం కొరియన్ కంపెనీ కార్ల హవా జోరుగా సాగుతోంది. 2022లో ఎక్కువ అమ్మకాలు పొందిన, ఎక్కువమంది కొనుగోలుదారుల మనసుదోచిన కారుగా క్రెటా నిలిచింది. ఆ తరువాత స్థానంలో మారుతి సుజుకి బ్రెజ్జా, ఇన్నోవా క్రిస్టా నిలిచాయి. 2022లో లగ్జరీ కార్ల విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఎక్కువ ప్రజాదరణ పొందిన కారుగా గుర్తింపు పొందగా, తరువాత స్థానంలో జీప్ కంపాస్, బెంజ్ సీ క్లాస్, బీఎండబ్ల్యూ5 సిరీస్ చేరాయి. ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్ పల్సర్ ఎక్కువ ప్రజాదరణ పొందిన బైకుగా మొదటి స్థానంలో నిలిచి రికార్డ్ బద్దలు కొట్టింది. ఆ తరువాత స్థానాల్లో హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్, హోండా సీబీ షైన్ వంటివి నిలిచాయి. లగ్జరీ బైక్స్ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్, హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750, కవాసాకీ నింజా జెడ్ఎక్స్-10ఆర్ వంటివి ఎక్కువ అమ్మకాలు పొందినట్లు నివేదికల ద్వారా తెలిసింది. -
2% పెరిగిన బజాజ్ అమ్మకాలు
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు సెప్టెంబర్‌లో 3 శాతం వృద్ధి చెంది 3,23,879 కు పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 3,15,314 మోటార్ సైకిళ్లు విక్రయించామని బజాజ్ ఆటో బుధవారం పేర్కొంది. ఎగుమతులు 1,33,222 నుంచి 10 శాతం వృద్ధితో 1,46,847కు పెరిగాయని వివరించింది. మొత్తం మీద గత ఏడాది సెప్టెంబర్‌లో 3,60,152 వాహనాలు విక్రయించగా... ఈ ఏడాది సెప్టెంబర్‌లో 2 శాతం వృద్ధితో 3,67,815 వాహనాలు విక్రయించామని బజాజ్ ఆటో పేర్కొంది. 32% తగ్గిన అశోక్ లేలాండ్ అమ్మకాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో 7,232 వాహనాలు విక్రయించామని అశోక్ లేలాండ్ తెలిపింది. గత సెప్టెంబర్ అమ్మకాలతో(10,620)పోల్చితే 32 శాతం క్షీణించాయని పేర్కొంది. వాణిజ్య వాహనాల విక్రయాలు (దోస్త్ మోడల్ మినహా) 7,593 నుంచి 38 శాతం క్షీణించి 4,715కు తగ్గాయని వివరించింది. ఇక దోస్త్ విక్రయాలు 3,027 నుంచి 17 శాతం తగ్గి 2,517కు క్షీణించాయని పేర్కొంది.