న్యూఢిల్లీ: బజాజ్ ఆటో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు సెప్టెంబర్‌లో 3 శాతం వృద్ధి చెంది 3,23,879 కు పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 3,15,314 మోటార్ సైకిళ్లు విక్రయించామని బజాజ్ ఆటో బుధవారం పేర్కొంది. ఎగుమతులు 1,33,222 నుంచి 10 శాతం వృద్ధితో 1,46,847కు పెరిగాయని వివరించింది. మొత్తం మీద గత ఏడాది సెప్టెంబర్‌లో 3,60,152 వాహనాలు విక్రయించగా... ఈ ఏడాది సెప్టెంబర్‌లో 2 శాతం వృద్ధితో 3,67,815 వాహనాలు విక్రయించామని బజాజ్ ఆటో పేర్కొంది.
32% తగ్గిన అశోక్ లేలాండ్ అమ్మకాలు
ఈ ఏడాది సెప్టెంబర్‌లో 7,232 వాహనాలు విక్రయించామని అశోక్ లేలాండ్ తెలిపింది. గత సెప్టెంబర్ అమ్మకాలతో(10,620)పోల్చితే 32 శాతం క్షీణించాయని పేర్కొంది. వాణిజ్య వాహనాల విక్రయాలు (దోస్త్ మోడల్ మినహా) 7,593 నుంచి 38 శాతం క్షీణించి 4,715కు తగ్గాయని వివరించింది. ఇక దోస్త్ విక్రయాలు 3,027 నుంచి 17 శాతం తగ్గి 2,517కు క్షీణించాయని పేర్కొంది.
2% పెరిగిన బజాజ్ అమ్మకాలు
Published Thu, Oct 3 2013 2:50 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
Advertisement
Advertisement