Ex-showroom
-
బజాజ్ పల్సర్ ఎన్125
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో పల్సర్ శ్రేణిలో కొత్తగా ఎన్125 ప్రవేశపెట్టింది. 124.59 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ స్పార్క్, 2 వాల్వ్ ఇంజన్ పొందుపరిచారు. 8,500 ఆర్పీఎం వద్ద 12 పీఎస్ పవర్, 6,000 ఆర్పీఎం వద్ద 11 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. ఎల్ఈడీ డిస్క్ బీటీ, ఎల్ఈడీ డిస్క్ వేరియంట్లలో లభిస్తుంది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.98,707 ఉంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తి డిజిటల్ ఎల్సీడీ స్పీడోమీటర్, మోనోషాక్ సస్పెన్షన్, ఐఎస్జీ సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, 5 స్పీడ్ ట్రాన్స్మిషన్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వంటి హంగులు జోడించారు. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 9.5 లీటర్లు. -
నిస్సాన్ కార్ల ధరలు కూడా తగ్గాయి
ముంబై : ఎస్టీ ఎఫెక్ట్‌తో వాహన దిగ్గజ కంపెనీలన్ని వరుసపెట్టి తన వాహనాల రేట్లను తగ్గించడంలో క్యూ కడుతున్నాయి. తాజాగా నిస్పాన్ ఇండియా కూడా తన వాహనాలపై రేట్లను తగ్గిస్తున్నట్టుప్రకటించింది. నిస్సాన్ తన ఎక్స్-షోరూమ్ వాహనాల ధరలు సగటున 3 శాతం తగ్గించింది. నిస్సాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్ర మాట్లాడుతూ, ఆటోమొబైల్ తయారీదారులు, కస్టమర్లకు జీఎస్టీ అమలు సానుకూలమని చెప్పారు. లాభాలను తమ వినియోగదారులకు లాభాలను అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. జూలై 1 జీఎస్టీ పరిధిలో ఆటోమొబైల్స్ ప్రభుత్వం 28 పన్నురేటును నిర్ణయించింది. దీంతో ఈ ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందించాలన్న లక్ష్యంతో ఆటోమొబైల్ కంపెనీలు బైక్‌లు,కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ముఖ్యంగా మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా, టొయోటా కిర్లోస్కర్ మోటార్స్, ఫోర్డ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, బిఎమ్‌డబ్ల్యూలు వంటి కార్ల కంపెనీలు ఇటీవలే కార్ల ధరలు తగ్గుతాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కొత్త వాహనం కొంటున్నారా?
ధరలు... బీమా చూసుకోవాల్సిందే కొత్త వాహనం తీసుకుంటున్నప్పుడు సహజంగానే ఉత్కంఠ ఉంటుంది. దీంతో ఎంత బేరమాడి నా కొన్ని విషయాలపై అంతగా దృష్టి పెట్టలేం. దీనివల్ల ముందుగా లెక్కేసిన దానికన్నా ఎక్కువ కట్టి.. ఇంటికెళ్లాక తీరిగ్గా చింతించాల్సి వస్తుంది. ఇలా జరగకుండా కొత్త బండి తీసుకునేటప్పుడు దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. అవి చూద్దాం... ఎక్స్-ఫ్యాక్టరీ.. ఎక్స్‌షోరూం ధరలు.. వాహనం తయారైనప్పుడు ఫ్యాక్టరీ వద్ద ఉండే విలువ .. షోరూంకి వచ్చేటప్పటికి మారిపోతుంది. షోరూం నుంచి మన చేతికి వచ్చేటప్పటికి ఇంకా మారిపోతుంది. ఇలా ఎక్స్-ఫ్యాక్టరీ, ఎక్స్ షోరూం ధరలతో పాటు పన్నులు, చార్జీలు మొదలైనవన్నీ కలిస్తే కొనుగోలుదారు కట్టేది తడిసిమోపెడవుతుంది. కొన్ని సందర్భాల్లో వాహన పరిమాణం, ఇంజిన్ సైజు, ఉపయోగించే ఇంధనం, రిజిస్ట్రేషన్ చేసే నగరం.. రాష్ట్రం తదితర అంశాలను బట్టి ఫ్యాక్టరీ రేటుతో పోలిస్తే 30-40 శాతం ఎక్కువగా కడుతుంటాం. ఒకోసారి కొనుగోలు ప్రక్రియ చాలా గందరగోళం వ్యవహారంగా అనిపించవచ్చు. లావాదేవీ మొత్తం పూర్తయి ఏదో రకంగా బండి చేతికొస్తే అదే పదివేలు అనిపించొచ్చు. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకూడదు. ప్రతి చిన్న విషయంలోనూ పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే చెక్కు ఇవ్వండి. వాహనం కొన్నప్పుడు... దేనికి ఎంత అయిందన్న పూర్తి వివరాలుండే ఇన్వాయిస్ కాపీని తీసుకోండి. బీమా..: ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనూ రకరకాల బీమా పాలసీలు అందుబాటులో ఉంటున్నాయి. ఇవి కాకుండా వాహనాల తయారీ సంస్థలు స్వయంగా కూడా బీమా పాలసీలు అందిస్తున్నాయి. పాలసీ కొటేషన్ తీసుకుంటే చాలు!! ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, ఈమెయిల్స్ వెల్లువలా వచ్చి పడుతుంటాయి. ఈ గందరగోళంలో పడి సిసలైన ఇన్సూరెన్స్ కవరేజీ వివరాలు చూసుకోవడం మర్చిపోవద్దు. పాలసీ తీసుకున్నప్పుడు కవర్ నోటు, రసీదు ఆన్లైన్లో వెంటనే లభిస్తాయి. పూర్తి వివరాలతో కూడిన సంపూర్ణమైన పాలసీ డాక్యుమెంటు వచ్చేదాకా వీటిని ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. సదరు కాపీ వచ్చిన తర్వాత ఏయే అంశాలకు కవరేజీ ఉంటుంది? వేటికి మినహాయింపు ఉంటుంది? వంటి అంశాలన్నీ సరిచూసుకోవాలి. వరదలు, అల్లర్లు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైన వాటి వల్ల వాహనానికి ఏదైనా జరిగితే కవరేజీ వర్తించేలా సమగ్రమైన పాలసీ ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా ఏయే సందర్భాల్లో కవరేజీ ఉంటుందో అడిగి తెలుసుకోవాలి. ఇలాంటి కొన్ని చిన్న, చిన్న విషయాలను సరిచూసుకుంటేనే... ఇష్టపడి తీసుకున్న వాహనంపై ఆనందంగా తిరగగలం.