
సెల్‌కాన్ కేంపస్ సిరీస్‌లో కొత్త మోడల్
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ కంపెనీ సెల్‌కాన్, కేంపస్ సిరీస్‌లో సరికొత్త మోడల్, కేంపస్ ఏ 125ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటి వరకూ కేంపస్ సిరీస్‌లో 9 మోడళ్లను అందించామని, ఇవన్నీ రూ.6,000 లోపు ధర ఉన్న మోబైల్ ఫోన్‌లని సెల్‌కాన్ సీఎండీ, వై. గురు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంపస్ ఏ 125ను ఫ్లిప్ కవర్‌తో సహా రూ.6,399కే అందిస్తున్నామని వివరించారు. 4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ 1.3 గిగా డ్యుయల్ కోర్ ప్రాసెసర్ సామర్థ్యంతో పనిచేస్తుందని పేర్కొన్నారు.
4 జీబీ ఇంటర్నల్ మెమెరీ ఉన్న ఈ ఫోన్‌లో ఫ్లాష్‌తో కూడిన 5 మెగా పిక్సెల్ కెమెరా, 3జీ వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. షేక్ అండ్ షేర్, మల్టీ ప్లేయర్ గేమింగ్, డూడ్లింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. వినియోగదారులు తమ మాతృభాషలో మెసెజ్‌లు పంపుకునేందుకు వీలుగా 9 భాషల మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ ప్రత్యేక ఆకర్షణ అని గురు వివరించారు.