
దీని స్టైల్ చూశారూ.. కత్తి.. ఖతర్నాక్ కదా.. ఇది రెనాల్ట్ కంపెనీకి చెందిన ఈజెడ్–అల్టిమో కాన్సెప్ట్ కారు.. ఇటీవల దీన్ని ప్యారిస్ ఆటోషోలో ప్రదర్శించారు. చూసినోళ్లంతా ఫిదా అయిపోయారంటే నమ్మండి. విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించడమే ఈ కాన్సెప్ట్ కారు తాలూకు లక్ష్యమని రెనాల్ట్ ప్రతినిధులు తెలిపారు. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కారు.. అంటే డ్రైవర్‌తో పనిలేదన్నమాట. పైగా పర్యావరణానికి హాని చేయని రీతిలో ఇది ఎలక్ట్రిక్ కారు కూడా. మొబైల్‌లో లోడ్ చేసిన ప్రత్యేకమైన యాప్‌లో మనం వెళ్లాల్సిన ప్రాంతం తాలూకు వివరాలు ఫీడ్ చేస్తే.. దాని ప్రకారం కారు వెళ్లిపోతుంది. అందుకు అనుగుణంగా ఇందులో కెమెరాలు, రాడార్లు, సెన్సర్లు ఇలా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి.
ఈ వాహనం 19 అడుగుల పొడవు ఉంటుంది. లోపల చూశారుగా.. హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంటుంది. ఇంటీరియర్ అంతా లెదర్, మార్బుల్, చెక్కతో చేశారు. సీటు అటూ ఇటూ కదిలేలా ఏర్పాటు చేశారు. వ్యక్తిగత అవసరాల కోసమే కాకుండా.. పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్లు.. కార్పొరేట్ సంస్థలు తమ క్లయింట్లను ఎయిర్‌పోర్టు నుంచి తేవడానికి, బిజినెస్ మీటింగుల కోసం దీన్ని తప్పక కొనుగోలు చేస్తాయని రెనాల్ట్ నమ్ముతోంది. మార్కెట్లోకి ఎప్పుడొస్తుంది.. ధర ఎంత ఉండొచ్చన్న వివరాలను రెనాల్ట్ వెల్లడించలేదు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment