
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ దిగ్గజం ఆడి తాజాగా భారత్‌లో ఆర్‌ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.1.04 కోట్లు. 450 హెచ్‌పీ పవర్‌తో 2.9 లీటర్ వీ6 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో తయారైంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, 3 జోన్ ఎయిర్‌కండీషనింగ్, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్ వంటివి పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.9 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. కంపెనీ పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment